అన్వేషించండి

India Corona Cases, 31st July: దేశంలో తాజాగా 41 వేల కేసులు, 593 మరణాలు.. కేరళ నుంచే సగం కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నా.... కొన్ని రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 41, 649 కేసులు నమోదయ్యాయి.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తుంది. కరోనా కొత్త కేసులు, మరణాల్లో స్వల్పహెచ్చుతగ్గులు కనిపిస్తున్నా, కొన్ని రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 17,76,315 మందికి కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు చేయగా 41,649 పాజిటివ్ కేసులు వచ్చాయి. శుక్రవారం మరో 593 మంది కరోనాతో మరణించారు. దేశంలో మొత్తం కరోనా కేసులు 3.16 కోట్లకు చేరుకోగా 4.23 లక్షల మంది మహమ్మారికి బలయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించింది. 

ఇటీవల నాలుగు లక్షల దిగువకు వచ్చిన క్రియాశీల కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం 4,08,920 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. ఈ క్రియాశీల రేటు ప్రస్తుతం 1.29 శాతంగా ఉంది. రికవరీ రేటు 97.37 శాతానికి చేరింది. శుక్రవారం ఒక్కరోజు 37 వేల మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.07 కోట్లకు చేరుకోగా.. నిన్న 52,99,036 మంది కరోనా టీకాలు తీసుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసులు సంఖ్య 46 కోట్ల మార్కును దాటినట్లు కేంద్రం తెలిపింది. 

 కరోనా మహమ్మారి విజృంభణ దేశంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టినా... గత కొన్ని రోజుల నుంచి ప్రతిరోజూ 40 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో ఆందోళన నెలకొంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం కేసుల సంఖ్య కొంచెం తగ్గినప్పటికీ మరణాల సంఖ్య మాత్రం భారీగా పెరిగింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 41,649 కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారంతో పోల్చుకుంటే గత 24 గంటల్లో 38 మరణాలు అధికంగా నమోదయ్యాయి. దాదాపుగా రెండున్నర వేల కేసులు తగ్గాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం దేశంలో మొత్తంలో కరోనా కేసుల సంఖ్య 3,16,13,993కి పెరగగా, మరణాల సంఖ్య 4,23,810 కి చేరింది.

కేరళలో 20 వేల కేసులు.. కర్ణాటక, మహారాష్ట్రలో వైరస్ భయాలు

కేరళలో మరోసారి 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో మొత్తం కేసులు 33.70 లక్షలకు చేరుకున్నాయి. కేసుల ఉద్ధృతితో వారాంతపు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం ఇప్పటికే  ప్రకటించింది.  ఆంక్షలు ఈ రోజునుంచి అమల్లోకి రానున్నాయి. తాజాగా మహారాష్ట్రలో 6,600 మందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. మొత్తం కేసుల్లో ఈ రెండు రాష్ట్రాల వాటా సగానికి పైగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడం, సరిహద్దు రాష్ట్రాలు కేరళ, మహరాష్ట్రలో వైరస్ విజృంభణతో కర్ణాటకలోనూ వైరస్ భయాలు పెరుగుతున్నాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. ఆ రాష్ట్రానికి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్ రిపోర్టు తప్పనిసరి చేసింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Crime News: విజయవాడలో దారుణం: పది రూపాయల కోసం ప్రాణం తీసిన మైనర్‌!
విజయవాడలో దారుణం: పది రూపాయల కోసం ప్రాణం తీసిన మైనర్‌!
iBomma Case Update: ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
Septic Tank Dump in Gandipet Lake : తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
Pawan Kalyan Gift To Sujeeth : 'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?
'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Crime News: విజయవాడలో దారుణం: పది రూపాయల కోసం ప్రాణం తీసిన మైనర్‌!
విజయవాడలో దారుణం: పది రూపాయల కోసం ప్రాణం తీసిన మైనర్‌!
iBomma Case Update: ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
Septic Tank Dump in Gandipet Lake : తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
Pawan Kalyan Gift To Sujeeth : 'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?
'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?
Bangladesh Protest: భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
Embed widget