అన్వేషించండి

Skill Case : స్కిల్ కేసులో చంద్రబాబు పాత్రపై లభించని ఆధారాలు - ఈడీ తాజా ప్రకటన సారాంశం ఏమిటంటే ?

Andhra Pradesh : స్కిల్ కేసులో చంద్రబాబు ప్రమేయం ఉందని ఈడీకి ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈడీ తాజాగా చేసిన ప్రకటనలో చంద్రబాబు ప్రస్తావన లేదు.

ED concluded that Chandrababu is not involved in Skill case : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ తాజాగా కొన్ని సంస్థల ఆస్తులు జప్తు చేసినట్లుగా ప్రకటన విడుదల చేసింది. ఆ స్టేట్‌మెంట్‌లో చంద్రబాబు ప్రస్తావన లేదు.  స్కిల్  కేసు అంటే.. అందరికీ చంద్రబాబు అరెస్టే గుర్తుకు వస్తుంది. ఆ కేసులో ఈడీ కూడా నోటీసులు జారీ చేసిందని ఆరోపిస్తూ సీఐడీ కేసులు పెట్టింది. ఆయనకు కనీసం నోటీసులు ఇవ్వకుండా ఓ అర్థరాత్రి అరెస్టు చేసి జైలుకు పంపారు. యాభై మూడు రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. ఆ కేసులో సీఐడీ ఒక్క రూపాయి అక్రమ లావాదేవీ చూపించలేకపోయిందని బెయిల్ ఇచ్చిన సమయంలో హైకోర్టు స్పష్టం చేసింది. ఆ కేసులోతాజాగా ఈడీ చేసిన ప్రకటన మరింత కీలకంగా మారింది. 

చంద్రబాబు పాత్రపై ఎలాంటి ప్రకటన చేయని ఈడీ 

స్కిల్‌  కేసులో ఈడీ  షెల్‌ కంపెనీలకు నిధుల మళ్లింపుపై విచారణ జరిపింది. గతంలోనే  నలుగురిని అరెస్ట్‌ చేసింది.  మనీలాండరింగ్‌ కింద కేసు నమోదు చేసింది. దర్యాప్తు  ప్రభుత్వం నుంచి సీమన్స్‌ కంపెనీకి వచ్చిన నిధుల్ని షెల్‌ కంపెనీలకు మళ్లించారు నిందితులు. పన్నులు ఎగ్గొట్టడానికి ఇలా చేశారని ఈడీ ఆరోపణ. శేఖర్‌ బోస్‌, ముకుల్‌ అగర్వాల్‌, సురేష్‌ గోయల్‌, వికాస్‌ వినాయక్‌లను ఇప్పటికే విచారించింది ఈడీ. షెల్‌ కంపెనీలను ఏర్పాటు చేసి రూ.241 కోట్లను మళ్లించారని ఈడీ చెబుతోంది.  ఇప్పటికే డిజైన్‌ టెక్‌కి సంబంధించిన రూ.31.20 కోట్ల ఆస్తులు జప్తు చేశారు.  ఈ మేరకు ఈడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 

జగన్ ఇంటి చుట్టూ ఇనుప కట్టడానికి ఖర్చు రూ. 12 కోట్ల పైనే -అంతా ప్రజా ధనమే ! జీవో రిలీజ్ చేసిన టీడీపీ

చంద్రబాబుకు క్లీన్ చిట్ వచ్చినట్లేనా ?

ఈడీ తాజా విచారణ తర్వాత చంద్రబాబుకు ఈ అంశంలో ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టమయినట్లయిందని టీడీపీ వర్గాలంటున్నాయి.  ఈడీ విచారణ ప్రకారం.. నిధుల డైవర్షన్ విషయంలో చంద్రబాబు ప్రమేయం లేదని ..  వినాయక్ ఖాన్వెల్కర్, సుమన్ బోస్, వంటి వారు బోగస్ ఇన్వాయిస్‌లు సృష్టించి ఈ పనికి పాల్పడ్డారని అనకోవచ్గుచు. ప్రెస్ నోట్‌లో కూడా అదే చెప్పారు.   చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఈడీ స్టేట్ మెంట్ లో లేదు. మొత్తం వ్యవహారంలో చంద్రబాబుకు కానీ ఆయన కు సంబంధించిన వారికి డబ్బులు అందినట్లుగా ఎక్కడా చెప్పలేదు. అంటే ఈ వ్యవహారంలో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లుగా  ఈడీ గుర్తించలేదని అర్థం చేసుకోవచ్చు. 

మద్యం షాపులు దక్కించుకున్న వారికి బెదిరింపులు, సీఎం చంద్రబాబు సీరియస్!

ఒక్క రూపాయి ట్రాన్సాక్షన్ చూపించలేకపోయిన సీఐడీ

అయితే ఆయా కంపెనీలు షెల్ కంపెనీల ద్వారా మళ్లించిన సొమ్ము మళ్లీ చంద్రబాబుకు చేరిందని సీఐడీ ఆరోపించింది. చివరికి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చాయని కూడా వాదించారు. అయితే అనూహ్యంగా తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎలక్టోరల్ బాండ్లు వెలుగులోకి వచ్చాయి. టీడీపీకి స్కిల్ కేసులో ఉన్న ఒక్క కంపెనీ కూడా విరాళివ్వలేదు. ఇప్పుడు చంద్రబాబుపై సీఐడీ అధికారులు ఆధారాల్లేకుండా తప్పుడు కేసులు పెట్టినట్లుగా రుజువు అయిందని టీడీపీ వర్గాలు వాదిస్తున్నాయి.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బహిరంగ విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలపై కఠిన చర్యలు: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
బహిరంగ విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలపై కఠిన చర్యలు: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget