Duvvada Srinivas: 'అందరి సమక్షంలో త్వరలోనే పెళ్లి చేసుకుంటాం' - తిరుమలలో దివ్వెల మాధురి సంచలన వ్యాఖ్యలు
Divvela Madhuri: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వివాహం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వీరిద్దరూ రాగా.. మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Divvela Madhuri Sensational Comments: ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas), దివ్వెల మాధురి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దువ్వాడ ఇంటి వద్ద ఆయన సతీమణి ఆందోళన నిర్వహించి రచ్చ జరిగిన చాలా రోజుల తర్వాత.. శ్రీనివాస్, మాధురి ఇద్దరూ కలిసి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి పుష్కరిణి దగ్గర మాధురి ఫోటో షూట్ కూడా దిగారు. అనంతరం మాధురి మీడియాతో మాట్లాడారు. తాము అందరి సమక్షంలోనే త్వరలోనే పెళ్లి చేసుకుంటామని ప్రకటించారు. కోర్టులో లీగల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయని.. అవి పూర్తైన తర్వాత వివాహం చేసుకుంటామని స్పష్టం చేశారు. అంతవరకూ కలిసే ఉంటామని అన్నారు.
అటు, గత 2 రెండేళ్లుగా తమ కుటుంబ వ్యవహారం నడుస్తోందని.. ఈ విషయంలో వాస్తవాలను ప్రజలకు వివరించానని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. 'నా ఆస్తులను కుటుంబ సభ్యులకు రాసేశాను. గత రెండేళ్లుగా మాధురితోనే ఉంటున్నాను. కోర్టులో కేసులు క్లియర్ అయితే తప్ప పెళ్లిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేను. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు వస్తాను. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా స్వామి దర్శనం కోసమే తిరుమలకు వచ్చాను.' అని దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు.
కాగా, ఇటీవలే దువ్వాడ శ్రీనివాస్, మాధురిల వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఆయన కుటుంబంలో వివాదాలు రచ్చకెక్కాయి. దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి ఆస్తుల పంపకానికి సంబంధించి ఆయన ఇంటి వద్దే ఆందోళనకు దిగారు. శ్రీనివాస్, మాధురిల సంబంధంపై సంచలన ఆరోపణలు చేశారు. టెక్కలిలోని తన ఇంట్లోకి రానివ్వడం లేదని వాణి, దువ్వాడ కుమార్తెలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి ముందే నిరసన తెలిపారు. అయితే, ఆ ఇల్లు దువ్వాడ శ్రీనివాస్ తన పేరు మీద ఎప్పుడే రాశారని.. మాధురి అందుకు తగ్గ డాక్యుమెంట్లను చూపిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. దీనిపై దువ్వాడ శ్రీనివాస్ సైతం క్లారిటీ ఇచ్చారు. తీసుకున్న అప్పు నిమిత్తం మాధురికి ఇల్లు రాసిచ్చానని చెప్పారు. అనంతరం కొద్ది రోజులు వీరు సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఇద్దరూ కలిసి తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు.
Also Read: Andhra University: అమ్మాయిలు డ్యాన్స్ చేయాలంటూ ర్యాగింగ్ - ఏయూలో 10 మంది సీనియర్ల సస్పెన్షన్