News
News
X

Darshi Mla Maddishetty : నేను ఎవరి సీటు లాక్కోలేదు, ఇకపై దేనికైనా రెడీ -వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి హాట్ కామెంట్స్

Darshi Mla Maddishetty : ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైసీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఏకంగా ఎమ్మెల్యే మద్దిశెట్టి తనను అవమానపరుస్తున్నారని తన గోడు చెప్పుకున్నారు. కనీసం ప్రోటోకాల్ పాటించడంలేదని వాపోయారు.

FOLLOW US: 

Darshi Mla Maddishetty : ప్రకాశం జిల్లా దర్శి వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న తనను ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా అవమానపరిచారన్నారు.  స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తనకు తెలియకుండా కొందరు నాయకులు కార్యకర్తలతో మీటింగ్ లు పెడుతున్నారన్నారు. తనపై ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా సహిస్తూనే వచ్చానని, ఇకపై సహించనన్నారు.  కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆరోపించారు.  ఒక ఎమ్మెల్యేకు ఇవ్వవలసిన గౌరవం కూడా ఇవ్వకుండా ఫ్లెక్సీలలో ఫొటోలు వేయకుండా ఆగౌరవపరిచారన్నారు. 

నేను ఎవరి సీటు లాక్కోలేదు 

"నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఒక్కరోజు సరిగ్గా నిద్రలేకుండా చేస్తున్నా రు. రెడ్డి సామాజిక వర్గం 90% నా వెంటే ఉందన్నారు. నేను ఎవరి సీటు లాక్కోలేదు. వారు పిలిచి పోటీ చేయమంటేనే చేశాను. ఈరోజు నుంచి దేనికైనా ఊరుకునేది లేదు. దేనికైనా సిద్ధంగా ఉన్నాను. ఎంత దూరమైనా వెళ్తా." - ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణు గోపాల్ 

బూచేపల్లి, మద్దిశెట్టి వర్గాల మధ్య విభేదాలు 

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బూచేపల్లి, మద్దిశెట్టి వర్గాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఇటీవల చీమకుర్తిలో సీఎం జగన్ సభ ఏర్పాటు చేశారు  దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి. ఈ సభకు  ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గైర్హాజరు అయ్యారు. సభావేదికగా ఇరు వర్గాల మధ్య  అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఇటీవల మద్దిశెట్టి, బూచేపల్లి వర్గీయులు  దర్శిలో పోటాపోటీగా  పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  ఎమ్మెల్యేకు సంబంధం లేకుండా నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు, మండల నేతలతో  బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఆయన తల్లి జడ్పీ ఛైర్మన్ వెంకాయమ్మ సమావేశాలు నిర్వహించారు.  దీంతో బూచేపల్లి తలపెట్టిన చీమకుర్తి సీఎం కార్యక్రమానికి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ డుమ్మా కొట్టారు.

సీఎం ప్రోగ్రామ్ కు స్థానిక ఎమ్మెల్యే డుమ్మా

ప్రకాశం జిల్లాలో వైసీపీలో వర్గ విభేదాలు కొనసాగుతున్నట్లు సీఎం జగన్ పర్యటనతో తేలిపోయింది. వైసీపీ అధినేత, సీఎం జగన్ పర్యటనకు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ గా మారింది.  సీఎం జగన్  ప్రకాశం జిల్లా నిన్న చీమకుర్తిలో పర్యటించారు.  అక్కడ దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డిల విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో పాల్గొన్నారు. అయితే ఈ సభలో స్థానిక ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పాల్గొనలేదు. ఈ సభకు తనను ఆహ్వానించలేదని, నియోజకవర్గంలో తన ప్రత్యర్థి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి సీఎం జగన్  ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే భావిస్తున్నారని సమాచారం. అందుకే సభకు డుమ్మా కొట్టారని తెలుస్తోంది.  ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వైసీపీ ముఖ్య నేతలంతా ఈ కార్యక్రమానికి హాజరైనా స్థానిక ఎమ్మెల్యే దూరంగానే ఉన్నారు. సభకు రాకపోయినా ఎమ్మెల్యే కనీసం స్వాగతం పలకడానికి హెలిప్యాడ్‌ దగ్గరకు కూడా రాకపోవడం గమనార్హం. మాజీ మంత్రి శిద్దా రాఘవరావుకు కూడా సీఎం ప్రోగ్రామ్ కు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. అయితే శిద్దా కుమారుడు సుధీర్ మాత్రం హెలిప్యాడ్‌ వద్దకు వచ్చి సీఎం జగన్ కు స్వాగతం పలికారు.  

ఎంపీ మాగుంట కూడా 

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా సీఎం సభకు దూరంగా ఉన్నారు. మాగుంట చెన్నైలోని తన ఇంట్లో శుభకార్యం ఉండటంతో రాలేకపోతున్నానని ముందుగానే సమాచారం ఇచ్చారట. సీఎం జగన్ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అడిగిన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్థానిక ఎమ్మెల్యే వేణుగోపాల్ వర్గానికి మింగుడుపడటం లేదని హాట్ టాక్ నడుస్తోంది.

Also Read : Relief for Jagan : సీబీఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు మినహాయింపు - ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట !

Published at : 26 Aug 2022 06:14 PM (IST) Tags: AP News CM Jagan ysrcp Darshi Mla Maddishetty Internal politics Bucchepalli

సంబంధిత కథనాలు

Nagababu On Garikapati : క్షమాపణ చెప్పించుకోవాలని కాదు, గరికపాటిపై నాగబాబు మరో ట్వీట్

Nagababu On Garikapati : క్షమాపణ చెప్పించుకోవాలని కాదు, గరికపాటిపై నాగబాబు మరో ట్వీట్

Chandragiri Crime : ప్రేమ పెళ్లి ఇష్టం లేక యువకుడి ఇల్లు ధ్వంసం, తలుపులు పగలగొట్టి కూతురి కిడ్నాప్!

Chandragiri Crime : ప్రేమ పెళ్లి ఇష్టం లేక యువకుడి ఇల్లు ధ్వంసం, తలుపులు పగలగొట్టి కూతురి కిడ్నాప్!

రాజీనామా చేసి విశాఖ రాజధాని కోసం ఉద్యమిస్తాను: ధర్మాన ప్రసాదరావు

రాజీనామా చేసి విశాఖ రాజధాని కోసం ఉద్యమిస్తాను: ధర్మాన ప్రసాదరావు

Breaking News Telugu Live Updates: ప్రేమ పేరిట వివాహితకు వేధింపులు, కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన యువకుడు 

Breaking News Telugu Live Updates: ప్రేమ పేరిట వివాహితకు వేధింపులు, కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన యువకుడు 

Minister KTR : జగన్, చంద్రబాబులతో కేసీఆర్ మాట్లాడారా? ఆంధ్రాలో పోటీపై కేటీఆర్ ఏమన్నారంటే?

Minister KTR : జగన్, చంద్రబాబులతో కేసీఆర్ మాట్లాడారా? ఆంధ్రాలో పోటీపై కేటీఆర్ ఏమన్నారంటే?

టాప్ స్టోరీస్

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?