Cyclone Jawad: దిశను మార్చుకున్న జవాద్ తుపాన్.. బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం
ఏపీని కలవరపెడుతున్న జవాద్ తుపాన్.. దిశను మార్చుకుని ప్రయాణిస్తుంది. ఒడిశాలోని పూరి వైపు వెళ్తోంది.
జవాద్ తుపాను దిశను మార్చుకుంది. ఒడిశావైపు కదులుతోంది. విశాఖకు ఆగ్నేయంగా 210 కిలో మీటర్ల దూరంలో, గోపాల్‌పుర్‌కు 320 కి.మీ. దూరంలో తుపాను ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం గంటకు 6 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. రేపు(డిసెంబర్ 5) మధ్యాహ్నానికి పూరీకి సమీపంలో వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తుపాను కారణంగా ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒడిశాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురవనున్నట్టు తెలిపింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలోని ఏర్పడిన తీవ్రవాయుగుండం శుక్రవారం తుపానుగా మారింది. అండమాన్ సముద్రంలో నవంబరు 30న అల్పపీడనం ఏర్పడింది. అది డిసెంబరు 2న బలపడి వాయుగుండంగా మారింది. మరింత బలపడి శుక్రవారం ఉదయం తీవ్ర వాయుగుండంగా మారింది. శుక్రవారం మధ్యాహ్నం తుపానుగా మారింది.
Cyclonic Storm ‘JAWAD’ about 210km eastsoutheast of Visakhapatnam at 1130 hrs IST of 04th December 2021. To weaken gradually during next 06 hours, and reach near Puri around 5th December noon as a Deep Depression. pic.twitter.com/blIzoviDGV
— India Meteorological Department (@Indiametdept) December 4, 2021
జవాద్ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. ఉత్తరం వైపుగా కదులుతూ ఉత్తర ఈశాన్య దిశగా ఒడిశాలో తీరం దాటనుంది. డిసెంబరు 5 మధ్యాహ్నానికి తీవ్ర అల్పపీడనంగా పూరీ సమీపంలోకి చేరుకునే ఛాన్స్ ఉంది. ఇది మరింత బలహీనపడి ఉత్తర-ఈశాన్య దిశగా పశ్చిమ బెంగాల్ తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.
తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో, ఒడిశాలోని గంజాం, గజపతి, పూరీ, జగత్సింగ్పుర్ జిల్లాల్లో శనివారం రెడ్ అలర్ట్ జారీ చేశారు.
తుపాను ముప్పు ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ పటిష్ట చర్యలు చేపట్టింది. 11 ఎన్డీఆర్‌ఎఫ్, 5 ఎస్డీఆర్‌ఎఫ్, 6 కోస్ట్ గార్డు, 10 మెరైన్ పోలీస్ టీమ్‌లను రంగంలోకి దింపింది. జవాద్ కారణంగా ముందస్తు చర్యల్లో భాగంగా రెస్క్యూ టీంలను మోహరించింది. ఇప్పటికే 54వేల8 మంది లోతట్టు ప్రాంతాల నుంచి శిబిరాలకు తరలించారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.
Also Read: Zawad Update: బలహీన పడుతున్న జవాద్... ముందస్తు జాగ్రత్తగా రెస్క్యూ టీంలు మోహరింపు
Also Read: Zawad Update: బలహీన పడుతున్న జవాద్... ముందస్తు జాగ్రత్తగా రెస్క్యూ టీంలు మోహరింపు