Coronavirus Cases Today: ఏపీలో తగ్గని కరోనా వ్యాప్తి.. కొత్తగా 1,365 కరోనా కేసులు.. రెండు జిల్లాల్లో తీవ్ర ప్రభావం
గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,365 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో రాష్ట్రంలో మరో 8 మందిని కరోనా మహమ్మారి బలిగొంది.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. నిన్నటితో పోల్చితే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 200 మేర పెరిగాయి. గత రెండు నెలల నుంచి ఏపీలో కరోనా కేసులు వెయ్యి, లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,365 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో రాష్ట్రంలో మరో 8 మందిని కరోనా మహమ్మారి బలిగొంది.
ఏపీలో కరోనా రికవరీ రేటు మెరుగ్గా ఉన్నా.. కేసులు మాత్రం తగ్గడం లేదని రాష్ట్ర వైద్య శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు 20,39,178 కు గాను నేటి ఉదయం వరకు 20,11,285 మంది కోలుకుని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. నిన్నటితో పోల్చితే యాక్టివ్ కేసులు స్వల్పంగా తగ్గడం ఊరటనిస్తోంది. ఏపీలో యాక్టివ్ కేసులు 14 వేల దిగువకు వచ్చాయి. ప్రస్తుతం 13,796 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. మేరకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
గుండె జబ్బుకు గురికాకుండా ఉండాలంటే తినాల్సినవి ఇవే... తేల్చిన హార్వర్డ్ అధ్యయనం
#COVIDUpdates: 22/09/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) September 22, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,39,178 పాజిటివ్ కేసు లకు గాను
*20,11,285 మంది డిశ్చార్జ్ కాగా
*14,097 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 13,796#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/nQ3mIvFkfs
కరోనా బారిన పడి ఏపీలో అధికంగా చిత్తూరు జిల్లా, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. తూర్పు గోదావరి, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. నిన్న ఒక్కరోజులో 8 మంది చనిపోగా, ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,097కు చేరింది. కేసులవారీగా చూస్తే గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 212, తూర్పు గోదావరి జిల్లాలో 210, ప్రకాశంలో 166, కడపలో 153 మంది కరోనా బారిన పడ్డారని ఏపీ వైద్య శాఖ తెలిపింది.
ఏపీలో ఇప్పటివరకూ 2 కోట్ల 78 లక్షల 70 వేల 218 శాంపిల్స్‌కు కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో గడిచిన 24 గంటల్లో 56,720 శాంపిల్స్‌కు కరోనా టెస్టులు చేసినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. మంగళవారం నాడు 1,466 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే పాజిటివ్ కేసుల కంటే రికవరీలే అధికంగా ఉండటం ఊరట కలిగిస్తోంది.
AAlso Read: ఆన్ లైన్ లో స్పెర్మ్ ఆర్డర్... తొమ్మిది నెలల తరువాత పండంటి బిడ్డ