Gudivada Politics: గుడివాడలో రప్పా రప్పా రాజకీయాలు - పార్టీ సమావేశంలో పాల్గొనకుండా వెళ్లిపోయిన కొడాలి నాని !
Gudivada: గుడివాడలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రెండు పార్టీలు పోటాపోటీ సమావేశాలు నిర్వహించాయి.

Gudivada Politics: గుడివాడలో టీడీపీ, వైసీపీ మధ్య రోజంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ , టీడీపీ రెండు ఒకే రోజు నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు పెట్టుకున్నాయి. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ పేరుతో వైసీపీ విస్తృత స్థాయి సభ ఏర్పాటు చేసింది. ఏడాది పాలన అయిన సందర్భంగా టీడీపీ కూడా తొలి అడుగు కార్యక్రమం ఏర్పాటు చేసుకుంది. అదే సమయంలో వైసీపీ కార్యక్రమానికి కొడాలి నాని వస్తారన్న ప్రచారం జరిగింది. రప్పా రప్పా నరుకుతామని పేర్ని నాని హెచ్చరించిన వీడియో వైరల్ అయిన సమయంలో.. ఆయన కూడా వస్తారని తెలియడంతో టీడీపీ కార్యకర్తలు.. పెద్ద ఎత్తున గుడివాడలో గుమికూడారు.
అదే సమయంలో మాజీమంత్రి కొడాలి నాని, సీఎం చంద్రబాబు బూట్ పాలిష్ చేస్తున్నట్లు నెహ్రూ చౌక్ సెంటర్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే...బూట్ పాలిష్ చేసి కాళ్ళ దగ్గర ఉంటానంటూ కొడాలి నాని చేసిన చాలెంజ్ నిలబెట్టుకోవాలంటూ..గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేరుతో ఫ్లీక్సీని ఏర్పాటు చేశారు.
మాజీమంత్రి కొడాలి నాని, సీఎం చంద్రబాబు బూట్ పాలిష్ చేస్తున్నట్లు నెహ్రూ చౌక్ సెంటర్లో ఫ్లెక్సీ ఏర్పాటు.
— ap-leaks (@ap_leaks) July 12, 2025
కుప్పంలో చంద్రబాబు గెలిస్తే...బూట్ పాలిష్ చేసి కాళ్ళ దగ్గర ఉంటానంటూ కొడాలి నాని చేసిన చాలెంజ్ నిలబెట్టుకోవాలంటూ..గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేరుతో ఏర్పాటైన ఫ్లెక్సీ. pic.twitter.com/W0Tl2AbKbl
వైసీపీ నేతలు కూడా మోసం గ్యారంటీ ఫ్లెక్సీలు వేశారు. అయితే వాటిని టీడీపీ కార్యకర్తలు చింపేశారు.
బామ్మా మాస్...
— 🦁 (@TEAM_CBN1) July 12, 2025
గుడివాడ రౌడీ గుండా.. గాడి వైస్సార్సీపీ ఫ్లెక్సీ చించి పారేసిన బామ్మా గారు.#ChandrababuNaidu #TDPTwitter #AndhraPradesh pic.twitter.com/AQXIiNRBTD
ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో కొడాలి నాని సమావేశానికి రాలేదు. గుడివాడ వన్ టౌన్ పీఎస్ లో సంతకం చేసి హైదరాబాద్ వెళ్లిపోయారు కొడాలి నాని. ముఖ్యమైన నాయకులు ఎవరూ రాకపోవడంతో.. ద్వితీయ శ్రేణి నేతలతోనే గుడివాడ నియోజకవర్గంలో సమావేశాన్ని పూర్తి చేశారు. రప్పా రప్పా మీతోనే మొదలు పెడుతామని.. కొడాలి నాని ముఖ్య అనుచరుడు మెరుగుమాల కాళీ సమావేశంలో హెచ్చరిచారు.
మీరు బూట్లు తుడిచే పరిస్థితి తెచ్చుకోవద్దు
— We YSRCP (@we_ysrcp) July 12, 2025
రప్పా రప్పా గుడివాడ నుంచి మొదలు పెడతాం
- మెరుగుమాల కాళీ, కృష్ణ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు, గుడివాడ నాయకులు#WeYSRCP #AndhraPradesh #Gudivada #KodaliNani pic.twitter.com/HY0Rq5Kw22
అదే సమయంలో గుడివాడ పట్టణంలోని 19, 20, 23, 24వ వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా APSWC చైర్మన్ రావి వెంకటేశ్వరరావు తో కలిసి కూటమి ప్రభుత్వం ఏడాదిలో అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజలకు వివరించారు.
#Day8
— Venigandla Ramu (@RamuVenigandla) July 12, 2025
ఈరోజు గుడివాడ పట్టణంలోని 19, 20, 23, 24వ వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా APSWC చైర్మన్ రావి వెంకటేశ్వరరావు గారితో కలిసి కూటమి ప్రభుత్వం ఏడాదిలో అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాను.
ప్రతి వర్గానికి న్యాయం చేయాలన్న లక్ష్యంతో… pic.twitter.com/vtwADSk905
వైసీపీ ముఖ్యనేతలెవరూ గుడివాడ రాకపోవడంతో.. ఉద్రిక్తలు ఘర్షణల వరకూ వెళ్లకుండా ఆగిపోయాయి.





















