By: ABP Desam | Updated at : 29 Apr 2022 08:40 PM (IST)
ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష
టీచింగ్ ఫ్యాకల్టీలో ఎక్కడ ఖాళీలు ఉన్నా వెంటనే భర్తీచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఉన్నతవిద్యపై సీఎం సమీక్ష నిర్వహించారు. టీచింగ్ స్టాఫ్ నియామకంలో ఎక్కడా సిఫార్సులకు తావు ఉండకూడదని ఇక్కడ రాజీపడితే విద్యార్థులకు తీవ్ర నష్టం ఏర్పడుతుందన్నారు. సమర్ధు్లైన వారిని, ప్రతిభ ఉన్నవారిని టీచింగ్ స్టాఫ్‌గా తీసుకోవాలి...వారికీ పరీక్షలు నిర్వహించి... ఎంపిక చేయాలని ఆదేశించారు. టీచింగ్ స్టాఫ్ కమ్యూనికేషన్ల నైపుణ్యాన్నికూడా పరిశీలించాలన్నారు. యూనివర్శిటీల్లో క్రమశిక్షణ, పారదర్శకత అత్యంత ముఖ్యమైనవని ...ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.
డిగ్రీ విద్య ప్రత్యేక యూనివర్సిటీ పరిధిలో రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ డిగ్రీకాలేజీలను జేఎన్టీయూ తరహాలో ఒక ప్రత్యేక యూనివర్శిటీ లాంటి వ్యవస్థ కిందకు తీసుకురావాలని జగన్ ఆదేశించారు. ఇందులో మంచి పరిజ్ఞానం ఉన్నవారిని ప్రతిపాదిత వ్యవస్థకు నేతృత్వం వహించేలా చూడాలన్నారు. దేశంలో డిగ్రీ చదవాలనుకుంటే ఏపీకి రావాలని అనుకునేట్టుగా ఉండాలని.. ఏపీలో డిగ్రీలు చదివితే.. మంచి జీతాలు వచ్చే పరిస్థితిని తీసుకురావాని ఆదేశించారు.
విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ చాలా ముఖ్యమని అందుకే విద్యాదీవెన, వసతి దీవెన అమలు చేస్తున్నామన్నారు. గతంలో కన్నా గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో పెరిగినా సంతృప్తి చెందకూడదని
జీఈఆర్ 80శాతానికి పైగా ఉండాలన్నారు. ఉద్యోగాలను కల్పించే చదువులు దిశగా కోర్సులు ఉండాలి..ఇప్పుడున్న కోర్సులకు సంబంధించి అనుబంధకోర్సులు, ప్రత్యేక కోర్సులు తీసుకురావాలని ఆదేశించారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు వీలుగా ఇంగ్లిషుపై పట్టు, ప్రావీణ్యం విద్యార్థులకు రావాలి..వీటిపై అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీఆర్‌ఈ, జీ మ్యాట్ పరీక్షలపైన కూడా విద్యార్థులకు మంచి శిక్షణ ఇవ్వాలని సీఎం సూచించారు.
ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో, అంతమందికీ విద్యాదీవెన, వసతి దీవెన ఇస్తున్నామని ఇంతకుముందు చదివించే స్తోమత లేక, చాలామంది అబ్బాయి చదువుకుంటే చాలు అని.. అమ్మాయిలను పై చదువులకు పంపలేని పరిస్థితులు ఉండేవన్నారు. అలాంటి పరిస్థితులను పూర్తిగా తీసేయడానికి ఇంట్లో ఉన్న పిల్లలు అందరికీ కూడా విద్యాదీవెన, వసతి దీవెన వర్తింపు చేస్తున్నామని జగన్ తెలిపారు. రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల్లో అమ్మాయిలు చదువులకు దూరమవుతున్నారు..వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు.
YSRCP MP Pilli Issue : ఆధారాలున్నాయన్న వైఎస్ఆర్సీపీ ఎంపీ - చాన్సే లేదన్న ప్రభుత్వం ! ఇద్దరిలో ఎవరు కరెక్ట్ ?
ABV Joining : రెండేళ్ల జీతం ఇవ్వకపోతే కోర్టుకెళ్తానన్న ఏబీవీ - జీఏడీలో రిపోర్ట్
ప్రేమ పేరుతో నమ్మించి, రెండుసార్లు గర్భవతిని చేసి అబార్షన్ - ప్రియుడిని నిలదీస్తే ఏమన్నాడంటే !
Breaking News Live Updates : కాంగ్రెస్ లో చేరిన మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్మన్
Guntur Crime : గుంటూరు జిల్లాలో దారుణం, తొమ్మిదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
TRS ZP Chairman In Congress : కాంగ్రెస్లో చేరిన టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ - గుట్టుగా చేర్పించేసిన రేవంత్ !
Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు
Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!