News
News
వీడియోలు ఆటలు
X

CM Jagan: ఒక్క సత్యనాదెళ్ల జగన్‌కు సరిపోడు - తమ్ముళ్లు, చెల్లెళ్లు అందరూ సత్యనాదెళ్లతో పోటీ పడాలి - జగన్

జగనన్న వసతి దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా.. బుధవారం (ఏప్రిల్ 26) అనంతపురం జిల్లా నార్పలలో ఏర్పాటు జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

FOLLOW US: 
Share:

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటర్ తర్వాత చదువు మానేసే వారి సంఖ్య బాగా తగ్గిందని సీఎం జగన్ చెప్పారు. అంతకుముందు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే వారి సంఖ్య గతంలో 37 లక్షలుగా ఉంటే, తాము అధికారంలోకి వచ్చాక మార్పు చేసిన విధానాల వల్ల, ప్రభుత్వ కాలేజీలు, స్కూళ్లలో చదివేవారి సంఖ్య 40 లక్షలకు పైగా విద్యార్థులు చేరారని అన్నారు. ఇంజినీరింగ్, డిగ్రీ చదివే విద్యార్థులు కోర్సు చదివేటప్పుడే ఇంటర్న్‌షిప్ కచ్చితంగా చేయాలనే నిబంధన తీసుకొచ్చినట్లుగా చెప్పారు. జగనన్న వసతి దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా.. బుధవారం (ఏప్రిల్ 26) అనంతపురం జిల్లా నార్పలలో ఏర్పాటు జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అనంతరం దాదాపు 8 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి దాదాపు రూ.912 కోట్ల రూపాయలను నేరుగా జమ చేశారు.

" ఒక్క సత్యనాదెళ్ల ఈ జగనన్నకు సరిపోడు, నా తమ్ముళ్లు, చెల్లెళ్లు అందరూ సత్యా నాదెళ్లతో పోటీ పడాలి. అందుకే జగనన్న విదేశీ దీవెన అనే పథకం తీసుకొచ్చాం. టాప్ 50 యూనివర్సిటీల్లో కనుక సీట్ వస్తే దాదాపు కోటి 25 లక్షలకుపైగా ఫీజులు ప్రభుత్వమే భరిస్తుంది. మీరు చదవండి.. చదివించే బాధ్యత మీ అన్నది. ‘ఎడ్యుకేషన్ ఈజ్ నాలెడ్జ్’ ఇది ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. మీ జగనన్న ఆలోచనలు ప్రపంచంలో మిమ్మల్ని లీడర్లను చేసేలా ఉన్నాయి. "
-

పేదరిక సంకెళ్లను తెంచుకోవాలంటే అది చదువు అనే అస్త్రంతోనే సాధ్యమవుతుందని అన్నారు. చదువు అనేది ఓ కుటుంబ చరిత్రనే కాదని, ఓ సామాజిక వర్గాన్ని కూడా మారుస్తుందని అన్నారు. చదువుల కోసం ఏ ఒక్కరూ అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదనే తాపత్రయంతోనే, ఈ నాలుగేళ్లలో నాణ్యమైన విద్య అందించే విధంగా మార్పులు చేశామని అన్నారు. విద్యా రంగంలో గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్‌ చెప్పారు.

Published at : 26 Apr 2023 12:46 PM (IST) Tags: Anantapur YSRCP News CM Jagan CM Jagan speech Jagananna vasathi deevena

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: చెన్నై పాంచ్‌ పవర్‌, ఐదో ఏట అడుగు పెట్టిన జగన్ సర్కారు, చేరికలపై ఈటల నిరాశ

Top 10 Headlines Today: చెన్నై పాంచ్‌ పవర్‌, ఐదో ఏట అడుగు పెట్టిన జగన్ సర్కారు, చేరికలపై ఈటల నిరాశ

Andhra Politics : వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?

Andhra Politics :  వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి

AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

AP Cabinet Meeting :  ఏడో తేదీన ఏపీ కేబినట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

టాప్ స్టోరీస్

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !