News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

CM Jagan : గ్రీన్ ఎనర్జీలో దేశానికే ఆదర్శం - పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపన

రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకస్థాపన చేశారు. గ్రీన్ ఎనర్జీలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు.

FOLLOW US: 
Share:


CM Jagan :  మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. నంద్యాల జిల్లాలో ఏర్పాటు కానున్న సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు బుధవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. 8 వేల ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. పర్యావరణ హితంగా ఈ ప్రాజెక్టు ఉంటుందన్నారు. సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు.  సోలార్‌ ఎనర్జీ కోసం రూ. 2.49 పైసలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుల కోసం NHPCతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్‌ విషయంలో ఇబ్బంది లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, గ్రీన్‌ ఎనర్జీని ఉత్పత్తి చేసే విషయంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు.    
 
 పంప్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుల వల్ల భవిష్యత్తు తరాలకు గ్రీన్‌ ఎనర్జీ అందుతుందని సీఎం జగన్ చెప్పారు.  కాలుష్య కారక విద్యుత్‌పై ఆధారపడే పరిస్థితి క్రమేణా తగ్గుతుంది. భవిష్యత్తులో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.  వీటికి అనుబంధంగా సోలార్‌, విండ్‌ ప్రాజెక్టులు అనుసంధానం అవుతున్న తీరు గ్రీన్‌ ఎనర్జీలో విప్లవానికి దారితీస్తాయని చెప్పారు.  ఉదయం 6 నుంచి సాయంత్రం వరకూ సోలార్‌ వస్తుంది. సాయంత్రం నుంచి తెల్లవారుజామువరకు విండ్‌ ఎనర్జీని వాడుకోవచ్చన్నారు.  పీక్‌ అవర్స్‌లో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులను  వినియోగించుకుంటామని సీఎంతెలిపారు. 

 ఒక కృత్రిమ బ్యాటరీగా పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు పనిచేస్తాయని.. కాలుష్య రహిత విద్యుత్‌ ఉత్పాదనలో ఏపీ మొదటి స్థానంలో నిలిచేలా ఈ అడుగులు వేస్తున్నామన్నారు.  ఏపీలో 8999 మెగావాట్లకు సంబంధించి సోలార్‌, విండ్‌ పవర్‌ ఉందన్నారు.  రైతులకు ఉచితంగా పగటిపూటే విద్యుత్తు అందుబాటులోకి రావాలని, 7200 మెగావాట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో రూ.2.49లకే ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.  రైతులకు ఉచితంగా కరెంటును సమర్థవంతంగా కొనసాగించేందుకు, ఎలా ఢోకా లేకుండా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసిందని తెలిపారు.  తక్కువ ధరకే కరెంటు వస్తున్నందువల్ల ప్రభుత్వానికి, జెన్‌కోకు వెసులుబాటు కలుగుతుందన్నారు. 
 
 వేల మెగావాట్ల ప్రాజెక్టులకు సంబంధించి లొకేషన్లను గుర్తించామని.. 29 ప్రాజెక్టులకు సంబంధించి 33వేల మెగావాట్లకు పైగా ప్రాజెక్టు నివేదికలు సిద్ధం అయ్యాయని తెలిపారు.  కొన్ని డీపీఆర్‌లు కూడా సిద్ధం అయ్యాయి... వివిధ కంపెనీలకు అలాట్‌మెంట్‌కూడా చేశామని..  ఇందులో భాగంగానే ఇవాళ ఎన్‌హెచ్‌పీసీతో ఒప్పందం చేసుకుంటున్నామని తెలిపారు.  యాగంటిలో, కమలపాడులో దాదాపుగా 2వేల మెగావాట్లకు సంబంధించి రూ.10వేల కోట్లతో చెరిసగం వాటాతో ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంఓయూ కుదుర్చుకుంటున్నామని తెలిపారు.  ఈ రెండు సంస్థలూ మరింతగా అడుగులు ముందుకేసేందుకు మరో 3700 మెగావాట్లకు సంబంధించిన ఫీజబిలిటీ స్టడీలు జరగుతున్నాయని  తెిలాపుర. 
 
 ప్రభుత్వ సంస్థల విద్యుత్‌ ఉత్పాదన సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, ప్రయివేటు కంపెనీలను కూడా ప్రోత్సహిస్తున్నామని..  గ్రీన్‌ ఎనర్జీ విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తామని జనగ్ తెలిపారు.  2300 మెగావాట్ల సౌరవిద్యుత్‌ గ్రీన్‌ కో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నామని..  2300 మందికి ఉద్యోగావకాశాలు వస్తాన్నారు.   ఆర్సెలర్‌ మిట్టల్‌ కూడా 1014 మెగావాట్ల సోలార్‌, విండ్‌ పవర్‌ పనులకు శంకుస్థాన చేస్తున్నాం. దాదాపు వేయి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు.  ఎకోరన్‌ సంస్థ 2వేల మెగావాట్ల పునర్‌ ఉత్పాదక ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేస్తున్నాం. మరో 2 వేలమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని  తెలిపారు. 

  రాబోయే రోజుల్లో స్థానికంగా మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని..  ప్రతి మెగావాట్‌ ఉత్పత్తికి ఆ ప్రాజెక్టుల లైఫ్‌ ఉన్నంతకాలం రాయల్టీ కింద రూ.1లక్ష చొప్పున వస్తుందని తెలిపారు.  జీఎస్టీ ఆదాయం కూడా ప్రభుత్వానికి వస్తుందన్నారు.,  సహకారం అందిస్తున్న రైతులకు, రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటూ ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.30వేలు లీజు చొప్పున వస్తుందని జగన్ తెలిపారు.  ప్రతి రెండేళ్లకు 5శాతం లీజు రుసుము పెరుగుతుందన్నారు.  ఈ ప్రాజెక్టుల వల్ల రైతులకూ మంచి జరుగుతుందని..   దశాబ్దాలుగా నీళ్లకు కటకటలాడే ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టుల కారణంగా రైతులకు మంచి జరుగుతుందని తెలిపారు.  

Published at : 23 Aug 2023 01:23 PM (IST) Tags: AP Latest news YSRCP News Telugu News Today AP CM News YS Jagan News

ఇవి కూడా చూడండి

Top Headlines Today: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించాలన్న మంత్రి కాకాణి - పాలమూరుకు విచ్చేసిన ప్రధాని మోదీ

Top Headlines Today: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించాలన్న మంత్రి కాకాణి - పాలమూరుకు విచ్చేసిన ప్రధాని మోదీ

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Vote for Note Case: తెరపైకి ఓటుకు నోటు కేసు - 4న సుప్రీంకోర్టులో విచారణ

Vote for Note Case: తెరపైకి ఓటుకు నోటు కేసు - 4న సుప్రీంకోర్టులో విచారణ

Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?

Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

టాప్ స్టోరీస్

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

Tiger Nageswara Rao: హేమలత లవణంగా రేణు దేశాయ్ - రవితేజ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ చూశారా?

Tiger Nageswara Rao: హేమలత లవణంగా రేణు దేశాయ్ - రవితేజ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ చూశారా?