By: ABP Desam | Updated at : 02 Jul 2022 07:20 PM (IST)
కుమార్తె గ్రాడ్యూయేషన్ సెర్మనీలో పాల్గొన్న సీఎం జగన్
Jagan Daughter Harsha : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుమార్తె యెదుగూరి సందింటి హర్షిణి రెడ్డి ఫ్రాన్స్‌లోని ఇన్‌సీజ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్ ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేశారు. ఈ సందర్భంగా జరిగిన గ్రాడ్యూయేషన్ వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం జగన్ , ఆయన సతీమణి భారతి రెడ్డి ప్యారిస్ వెళ్లారు. ఈ కార్యక్రమం శనివారం జరిగింది. గ్రాడ్యూయేషన్ సెర్మనీ పూర్తయిన తర్వాత సీఎం జగన్ తన కుమార్తె సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
Dear Harsha, it’s been a wonderful journey watching you grow up. God has been abundantly gracious. Today I’m proud to see you graduate from INSEAD with distinction and on the Dean’s list. Wishing you God’s very best! pic.twitter.com/7FuZcXp4uT
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 2, 2022
హర్షిణి రెడ్డి మొదట లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఫ్రాన్స్‌లో మరో అత్యున్నతమైన యూనివర్శిటీ అయిన ఇన్‌సీడ్‌లో మాస్టర్ ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సులో చేరారు. కరోనా మొదటి విడత లాక్ డౌన్ పూర్తయిన తర్వాత విమాానాల రాకపోకలు పరిమితంగా ప్రారంభమైన సమయంలో ప్రత్యక్షంగా తరగతులు వినేందుకు హర్షిణి రెడ్డి ప్యారిస్ వెళ్లారు. సీఎం జగన్ బెంగళూరు వెళ్లి సెండాఫ్ ఇచ్చి వచ్చారు. ఇప్పుడు గ్రాడ్యూయేషన్ పూర్తి కావడంతో ఆ వేడుకల్లో .. కుమార్తె సంతోషాన్ని పంచుకునేందుకు వెళ్లారు.
గత నెలలో జగన్ సోదరి షర్మిల కుమారుడు రాజారెడ్డి కూడా అమెరికాలోని ఓ యూనివర్సిటీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు షర్మిల పాదయాత్రకు విరామం ఇచ్చి అమెరికా వెళ్లారు. షర్మిలతో పాటు విజయమ్మ కూడా వెళ్లారు. అప్పట్లో షర్మిల తన అనందాన్ని ఇప్పుడు సీఎం జగన్ పంచుకున్నట్లే ట్వీట్ ద్వారా పంచుకున్నారు.
Congratulations on your graduation Raja!
— YS Sharmila (@realyssharmila) May 20, 2022
It was an absolute pleasure to watch you grow from the baby in my arms to the wonderful man you’ve become today. Be truthful & kind, always valuing the people around you.God bless you & make you a blessing to many!
Proud of you kiddo :) pic.twitter.com/Biw0x2mkaj
MP Raghu Rama Krishna Raju : ఆర్ఆర్ఆర్ సినిమా స్టోరీ చెప్పిన సీఐడీ బాస్, ఎంపీ రఘురామ సెటైర్లు
ఒక్కొక్కరి అకౌంట్లో రూ.24 వేలు వేస్తున్న ఏపీ సర్కారు!
Dirty Politics : మాధవ్ వీడియో చుట్టే ఏపీ రాజకీయాలు ! ఇంతకీ తప్పెవరు చేస్తున్నారు?
Mlc Anantababu : ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో ఎట్టకేలకు ఛార్జ్ షీట్, 88 రోజుల తర్వాత
ఏలూరు జిల్లాలో సంచలనంగా మారిన వైసీపీ లీడర్ వీడియో!
Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?
Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?
ABP Desam Exclusive: రూ.800 యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతోంది! మనకు ఉచితం, RBIకి ఎంత నష్టం!
WhatsApp Emojis: వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!