అన్వేషించండి
Advertisement
CM Jagan: రేపే సీఎం జగన్ రిటర్న్స్! 15 రోజుల విదేశీ టూర్ తర్వాత రాష్ట్రానికి తిరిగి రానున్న సీఎం
AP Latest News: అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలతో బిజీగా గడిపిన సీఎం జగన్ ఈనెల 17న లండన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. సీబీఐ కోర్టు నుంచి సీఎం జగన్ ప్రత్యేక అనుమతులు పొంది విదేశీ పర్యటనకు వెళ్లారు.
CM Jagan Bharati returns to AP: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి రాష్ట్రానికి రానున్నారు. సీఎం జగన్ - భారతి దంపతులు రేపు (మే 31) రాష్ట్రానికి రానున్నారు. ఇవాళ (మే 30) రాత్రి వారు లండన్ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. రేపు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లి నివాసానికి జగన్ దంపతులు చేరుకోనున్నారు.
కాగా ఎన్నికలతో బిజీబిజీగా గడిపిన జగన్ ఈ నెల 17న లండన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో ఇంకా విచారణ దశలో ఉండడంతో సీబీఐ కోర్టు నుంచి సీఎం జగన్ ప్రత్యేక అనుమతులు పొంది విదేశీ పర్యటనకు వెళ్లారు. తొలుత లండన్ వెళ్లగా.. అక్కడి నుంచి కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లో ఆయన పర్యటించారు. 15 రోజుల అనంతరం తాజాగా రాష్ట్రానికి పయనం అవుతున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement