అన్వేషించండి

Chandrababu Amaravati Tour : గురువారం అమరావతిలో చంద్రబాబు పర్యటన - పనుల ప్రారంభంపై కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్

Andhra News : అమరావతి నిర్మాణాన్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. గురువారం నిలిచిపోయిన నిర్మాణాలను పరిశీలించి పనుల ప్రారంభంపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

Capital Amaravato :  ఏపీ సీఎం చంద్రబాబు అ  గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉండవల్లిలోని ప్రజా వేదిక నుంచి పర్యటన ప్రారంభం కానుంది.  రాజధాని నిర్మాణాలు, శంకు స్ధాపన జరిగిన ప్రాంతాన్ని ఈ సందర్భంగా సీఎం సందర్శించనున్నారు. అనంతరం సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, జడ్జిల గృహ సముదాయాలకు సంబంధించిన సైట్లు సీఎం పరిశీలించనున్నారు. రాజధాని ప్రాంతంలోని వివిధ నిర్మాణాల స్థితిగతులను  తెలుసుకోనున్నారు.      ఐకానిక్ భవనాల నిర్మాణాల కోసం నాడు పనులు మొదలు పెట్టిన సైట్ లను కూడా సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు.  

రెండున్నరేళ్లలో మొదటి దశ పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ                              

ఇప్పటికే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు.  మున్సిపల్ మంత్రి నారాయణ అమరావతి తొలి దశను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ప్రకటించారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం గతంలో రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారమే ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు.  రాజధాని అభివృద్ధికి తొలిదశలో రూ.48 వేల కోట్లతో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి దాదాపు రూ.9 కోట్లు చెల్లింపులు కూడా గతంలో చేశారు.  అమరావతిని ప్రపంచంలోనే తొలి ఐదు అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉత్తమమైన డిజైన్‌ను రూపొందించామని ప్రభుత్వం ప్రకటించింది.            

కీలక భవనాల నిర్మాణాలు చివరి దశలో                                  
 
రాజధానిలో మెజార్టీ ప్రాంతం కవరయ్యేలా మౌలిక వసతుల కల్పనతోపాటు మంత్రులు, కార్యదర్శులు, అధికారులు, ఉద్యోగుల నివాసాలకు సంబంధించి భవనాల నిర్మాణానికి తొలిదశలో పనులు చేపట్టేందుకు  టెండర్లు పిలిచారు.   మంత్రుల కార్యదర్శులు, అధికారులు, ఉద్యోగుల నివాసాలకు సంబంధించి భవనాల నిర్మాణం కూడా 90 శాతం పూర్తయ్యాయి.  తొలిదశ పనులతో సిటీ నిర్మాణ పనులు పూర్తవుతాయి.   రెండో దశలో మెట్రో రైలు నిర్మాణ పనులు చేపడతారు.        

చంద్రబాబు పరిశీలన తర్వాత కీలక నిర్ణయం                       

రాజధాని నిర్మాణంతో పాటు ఆలిండియా సర్వీస్ అధికారుల నివాసాలు, సచివాలయం, గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారుల నివాసాలు, హైకోర్టు, ఎమ్మెల్యే క్వార్టర్స్, జడ్జిల నివాసాలు ఇలా అడ్మినిస్ట్రేటవ్ సిటీలో దాదాపు ఐదారు కిలోమీటర్ల పొడవున భారీ నిర్మాణాలను చేపట్టారు. 2019లో ప్రభుత్వం మారిపోయే సమయానికి వీటిలో చాలా వరకు పూర్తయ్యాయి. అధికారుల క్వార్టర్లు చివరి దశకు చేరాయి. ఆలిండియా సర్వీస్ అధికారుల క్వార్టర్లు బస చేయడానికి వీలుగా రూపొందాయి. వీటన్నింటినీ చంద్రబాబు పరిశీలించి.. వీలైనంత త్వరగా పనులు చేపట్టేందుకు నిర్ణయం  తీసుకోనున్నారు.             

పాత కంపెనీలతో మళ్లీ పనులు ప్రారంభిస్తారా లేకపోతే కొత్త టెండర్లు పిలుస్తారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget