అన్వేషించండి

Vijayawada Floods: విజయవాడ వరదలు - కరెంట్ బిల్లుల చెల్లింపుపై ఉపశమనం, సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Vijayawada News: వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపులు వాయిదా వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆ ప్రాంతాల్లోని బాధితులు వచ్చే నెల కట్టుకోవచ్చని చెప్పారు.

CM Chandrababu Postponed Electricity Bill Payments In Vijayawada: విజయవాడలోని (Vijayawada) వరద ప్రభావిత ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరద అడుగుల మేర నిలిచి ఉంది. వరద తగ్గిన ప్రాంతాల్లో అధికార యంత్రాంగం పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేసింది. ఫైరింజన్ల సాయంతో రహదారులు, ఇళ్లు, షాపుల్లో బురదను సిబ్బంది తొలగిస్తున్నారు. అటు, పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు సరఫరా కొనసాగుతోంది. మరోవైపు, ముంపు ప్రాంతాల్లో కరెంట్ బిల్లుల చెల్లింపుపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) కీలక ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ నెల విద్యుత్ బిల్లుల వసూలు వాయిదా వేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఇబ్బందుల దృష్ట్యా వారు వచ్చే నెల కట్టుకోవచ్చని తెలిపారు. మరోవైపు, బాధిత ప్రాంతాల్లోని ఇళ్లల్లో ఎలక్ట్రిక్ వస్తువులు పాడేపోయినందున.. ప్రతి ఇంటికీ ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెకానిక్ అవసరం కాబట్టి.. వారు ఇష్టానుసారంగా వసూలు చేయకుండా చూస్తామని చెప్పారు. ఓ ధర నిర్ణయిస్తామని.. అవసరమైతే రాయితీ ఇస్తామని పేర్కొన్నారు. ఆన్ లైన్‌లో నమోదు చేసుకుంటే ఇంటికే సర్వీసులు అందిస్తామని స్పష్టం చేశారు.

డ్రోన్లతో బ్లీచింగ్ స్ప్రే

మరోవైపు, వరద తగ్గిన ప్రాంతాల్లో అధికార యంత్రాంగం ఫైరింజన్ల సాయంతో బురదను తొలగిస్తున్నారు. దాదాపు వందకు పైగా ఫైరింజన్లను అందుబాటులో ఉంచారు. రహదారులు, షాపులు, ఇళ్లల్లో బురదను తొలగిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి దాదాపు 2 వేల మందికి పైగా మున్సిపల్ సిబ్బంది చెత్తా చెదారాన్ని తొలగిస్తున్నారు. వరద తగ్గిన వెంటనే అంటువ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు చేపడుతున్నారు. బురదతో పూర్తిగా క్లీన్ చేసిన ప్రాంతాల్లో డ్రోన్లతో బ్లీచింగ్ లిక్విడ్ స్ప్రే చేస్తున్నారు. అటు, ఇంకా కొన్ని చోట్ల పునరావాస కేంద్రాలు కొనసాగుతుండగా బాధితులకు ఆహారం, తాగునీరు.. అవసరమైన వారికి మెడిసిన్స్ అందిస్తున్నారు. 

సీఎం ఏరియల్ సర్వే

అటు, నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు (CM Chandrababu) శుక్రవారం ఏరియల్ సర్వే (Aerial Survey) నిర్వహించారు. వరదలకు మూల కారణమైన బుడమేరు (Budameru) డ్రైన్, కొల్లేరు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. వరద ప్రవాహం, ముంపు, గండ్లు పడిన ప్రాంతాలను సర్వే చేశారు. ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నదీ ప్రవాహాన్ని పరిశీలించారు. అంతకుముందు నగరంలో కొనసాగుతోన్న వరద సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదలకు ఇళ్లల్లో చెడిపోయిన ఎలక్ట్రిక్ వస్తువులను రిపేర్ చేయించేందుకు నిపుణులను పిలిపించాలని సూచించారు. మరోవైపు, బుడమేరు గండ్ల పూడ్చివేతకు భారత ఆర్మీ రంగంలోకి దిగింది. ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన రెండు గండ్లు పూడ్చేశారు. మైలవరం నియోజకవర్గం కొండపల్లి కవులూరు వద్ద మూడో గండిని శుక్రవారం సాయంత్రం వరకూ పూడ్చేందుకు చర్యలు చేపట్టారు. గండ్లు పూడ్చడం పూర్తైతే నగరానికి వరద ప్రవాహం తగ్గనుంది.

Also Read: Troubles of Floods : చేతులెత్తేస్తున్న మెకానిక్‌లు - పట్టించుకోని ఇన్సూరెన్స్ కంపెనీలు- వరదల్లో మునిగిన వాహనాలు ఇక స్క్రాపేనా ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి

వీడియోలు

India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు
Ind vs Pak Under 19 Asia Cup | నేడు ఆసియా అండర్‌-19 ఫైనల్‌
Rohit Sharma T20 World Cup | హిట్మ్యాన్ లేకుండా తొలి వరల్డ్ కప్
Ishan Kishan about T20 World Cup | ప్రపంచ కప్‌ ఎంపికైన ఇషాన్ కిషన్ రియాక్షన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
Balakrishna : యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
6 అడుగుల ఆజానుబాహులకు బెస్ట్‌ ఆప్షన్లు - కంఫర్ట్‌తో పాటు రైడింగ్‌ ఫన్‌ ఇచ్చే మోటార్‌సైకిళ్లు!
6 అడుగులకు పైగా ఎత్తున్న 30+ ఏజ్‌ వాళ్లకు బెస్ట్‌ బైక్‌లు - సిటీ రోడ్లకు చక్కగా సరిపోతాయి!
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
Embed widget