(Source: ECI/ABP News/ABP Majha)
Troubles of Floods : చేతులెత్తేస్తున్న మెకానిక్‌లు - పట్టించుకోని ఇన్సూరెన్స్ కంపెనీలు- వరదల్లో మునిగిన వాహనాలు ఇక స్క్రాపేనా ?
Flooded Vehicles : వరదల్లో మునిగిన వాహనాలు చాలా వరకు రిపేర్ చేయడం కష్టమని మెకానిక్‌లు చెబుతున్నారు. రిపేర్ చేసినా ప్రయోజనం ఉండదంటున్నారు. పైగా ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ కావడం లేదు.
Mechanics say most flooded vehicles are difficult to repair : 2015లో చెన్నైలో వరదలు వచ్చినప్పుడు ఆటోమోబైల్ , ఇన్సూరెన్స్ రంగానికి చాలా పెద్ద సమస్య వచ్చింది. అప్పట్లో లగ్జరీ కార్లు సహా కొన్ని వేల వాహనాలు నీట మునిగి ఎందుకూ పనికి రాకుండా పోయాయి.వాటికి క్లెయిమ్స్ ఇవ్వడానికి ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకు రాలేదు. బాగు చేయడానికి మెకానిక్‌లు కూడా ఆసక్తి చూపలేదు. రిపేర్ చేయగలిన వాహనాలకు పెద్ద మొత్తంలో ఖర్చు అయింది. అయితే అవి ఎంత కాలం పని చేస్తాయో గ్యారంటీ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులే విజయవాడ, ఖమ్మంలో వాహనదారులకు వచ్చింది. వేలల్లో వాహనాలు నీట మునిగిపాడైపోయాయి. వాటిని రేపేర్ చేయించుకోవడం తలకు మించిన భారంగా మారుతోంది.
విజయవాడలో అత్యధికంగా కార్లు , బైకులకు డ్యామేజ్
విజయవాడలో సింగ్ నగర్ తో పాటు నీట మునిగిన ప్రాంతంలోని ప్రతి ఇంట్లోని వాహనాలు దెబ్బతిన్నాయి. నీరు రెండు, మూడు రోజుల పాటు అండిపోవడంతో వాహనాల ఇంజిన్‌లోకి నీరు చేరిపోయింది. దీంతో స్టార్టింగ్ సమస్యలు వచ్చాయి. వాటిని రిపేర్ చేయడం కన్నా.. కొత్తది కొనుక్కోవడం మేలని మెకానిక్‌లు సలహాలు ఇస్తున్నారు. కాస్త తక్కువ నష్టం జరిగిన వాహనాలకు రిపేర్లు చేయాలన్నా ఇరవై వేల రూపాయల వరకూ ఖర్చవుతోంది. ఓ ద్విచక్ర వాహనానికి అంత పెద్ద మొత్తంలో పెట్టి రేపర్ చేయించడానికి చాలా మంది సందేహిస్తున్నారు. మరో కార్ల ఓనర్ల పరిస్థితి మరింత దయనీయంగా మరింది సర్వీస్‌లు లక్షలు ఖర్చయ్యే పరిస్థితి ఏర్పడింది.
వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే - పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని ఆదేశం
ఖమ్మంలో రవాణా వాహనాలకు భారీ డ్యామేజీ
ఖమ్మం నగరాన్ని ముంచెత్తిన వరద నీరు.. కనీసం ఎనిమిది అడుగుల ఎత్తులో పారింది. జాతీయ రహదారి, మున్నేరు గట్లపైనే పెద్ద ఎత్తున వాహనాలు ఉండటంతో అవన్నీ నీట మునిగిపోయాయి. వాటికి రేపేర్లు చేయించడం ఓనర్లకు తలకు మించిన భారంగా మారింది. ముఖ్యంగా ఆయిల్ ట్యాంకుల్లో .. ఇంజిన్లలో చేరిన నీరు కారణంగా రిపేర్ చేయించుకోవాలంటే కనీసం యాభై వేల నుంచి రూ. లక్ష వరకూ ఖర్చవుతోంది. ఖమ్మం, విజయవాడ ఆటోనగర్‌లలో స్థలం ఉండటం లేదు. మెకానిక్‌లు కూా వాహనాలు తీసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు.
ఎక్కువ మంది ఉపాధికి దెబ్బ
వాహనాలు ఉంటే తప్ప రోజువారీ ఉద్యోగ, ఉపాధి పొందలేని వారి పరిస్థితి దుర్భరంగా మారింది. రిపేర్ చేసి ఇవ్వడనికి కనీసం రెండు వారాల సమయాన్ని మెకానిక్‌లు అడుగుతున్నారు. ప్రతి ఒక్క మెకానిక్ దుకాణంలో అదే పరిస్థితి ఉంది. ఇక కంపెనీ సర్వీసింగ్ సెంటర్లలో అయితే స్థలం లేక తీసుకోవడం లేదు. వారం తర్వాత రమ్మంటున్నారు. ఇలా అయితే ఇక ఉద్యోగాలు ఎలా అని ఎక్కువ మంది మథనపడుతున్నారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రాకపోవడంతో అతి పెద్ద సమస్యగా మారింది.
Andra Pradesh Trains: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక- విజయవాడ మార్గంలో 44 రైళ్లు రద్దు- దసరా దీపావళికి ప్రత్యేక ట్రైన్స్
ప్రభుత్వాలు ఏమైనా ఆదుకుంటాయా ?
ప్రభుత్వాలు ఏమైనా ఆదుకుని కనీసం ఇన్సూరెన్స్ అయినా కవర్ అయ్యేలా కంపెనీలతో మాట్లాడితే చాలా వరకూ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నారు. లేకపోతే ఇలా వాహనాలు ఎఫెక్ట్ అయిన వారి వివరాలు నోట్ చేసుకుని వారికి వడ్డీ లేకుండా రుణ సౌకర్యంతో వాహనాలు ఇప్పించాలని కోరుతున్నారు. మొత్తంగా మెకానిక్‌లకు కూడా ఈ సమస్య.. పెద్ద ఇబ్బందిగానే మారింది.