అన్వేషించండి

Andhra Pradesh Trains: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక- విజయవాడ మార్గంలో 44 రైళ్లు రద్దు- దసరా దీపావళికి ప్రత్యేక ట్రైన్స్‌

Andhra Pradesh Floods: ఏపీలో రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రకటన చేసింది. రాయనపాడు లైన్‌ క్లియర్‌ అయినట్టు పేర్కొంది. అదే టైంలో విజయవాడ మార్గంలో వెళ్లే 44 రైళ్లను రద్దు చేసింది.

TRAINS CANCELLED In Andhra Pradesh: భారీ వర్షాలు, వరదల నుంచి ఏపీ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. దెబ్బతిన్న రవాణా వ్యవస్థ కూడా సర్దుకుంటోంది. ముఖ్యంగా రైల్వే ట్రాక్‌లపై వరద నీరు చేరడంతో... చాలా వరకు రైళ్ల రాకపోకలను  కూడా నిలిపివేశారు. అయితే.. వరద తగ్గడంతో.. యుద్ధ ప్రాతిపదిక మరమ్మతులు చేసి... రైళ్ల రాకపోకలను పునరుద్దరిస్తున్నారు అధికారులు. రాయనపాడు మార్గంలో ట్రాక్‌ నీట మునిగడంతో... ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపేశారు.  అయితే... ప్రస్తుతం అక్కడ వరద నీరు తగ్గడంతో.. మరమ్మతులు చేపట్టి... రైళ్ల రాకపోకలను పునరుద్దరించారు. రాయపాడులో స్టాప్‌ను తొలగించి నిర్దేశించిన ట్రాక్‌లపై నడుపుతున్నారు. దాదాపు 15 రైళ్లను పునరుద్దరించింది దక్షిణ మధ్య రైల్వే.

పునరుద్దరించిన రైళ్ల వివరాలు
1. గూడురు-సికింద్రాబాద్‌ (12709)
2. తిరుపతి-సికింద్రాబాద్‌ (12763)
3. విశాఖ-హైదరాబాద్‌ (12727)
4. విశాఖ-మహబూబ్‌నగర్‌ (12861)
5. విశాఖ-నాందేడ్‌ (20811)
6. విశాఖ-ఎల్‌టీటీ ముంబై (18519)
7. విశాఖ-సాయినగర్‌ షిర్డీ (18503)
8. షాలీమార్‌-హైదరాబాద్‌ (18045)
9. షాలీమార్‌-సికింద్రాబాద్‌ (22849)
10. బెంగళూరు-ధనాపూర్‌ (12295)
11. పుదుచ్చేరి-ఢిల్లీ (22403)
12. కొచ్చువెళ్లి-గోరఖ్‌పూర్‌ (12512)
13. తాంబరం-హైదరాబాద్‌ (12759)
14. యశ్వంత్‌పూర్‌-లక్నో (12539)
15. చెన్నై-ఢిల్లీ (12621)

విజయవాడ మార్గంలో 44 రైళ్లు రద్దు..
వరదల కారణంగా విజయవాడ అల్లకల్లోకంగా మారింది. ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. వరదల్లో మునిగిన రైల్వే ట్రాక్‌లకు మరమ్మతు పనులు చేయాల్సి ఉంది. దీంతో.. విజయవాడ మార్గంలో నడిచే దాదాపు 44 రైళ్లను రద్దు చేసినట్టు విజయవాడ  రైల్వే డివిజన్‌ అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్‌ 6, 7, 8, 9 తేదీల్లో.. 44 రైళ్లను రద్దు చేశారు. రద్దయిన రైళ్లలో విజయవాడ, గుంటూరు, తెనాలి, రేపల్లె, నిడదవోలు, గుడివాడ, రాజమండ్రి, ఒంగోలు, మచిలీపట్నం మధ్య నడిచే పలు రైళ్లు  ఉన్నాయి. 44 రైళ్లు చేయడంతోపాటు.. కొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.

Also Read: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! మరొకటి రెడీగా ఉంది - ఐఎండీ


దసరా, దీపావళి కోసం ప్రత్యేక రైళ్లు.. 
దసరా, దీపావళి వచ్చేస్తున్నాయి. సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. తమ వారితో కలిసి పండుగ చేసుకోవాలని ఆరాటపడుతుంటారు. అలాంటి వారి కోసం... పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది దక్షిణ మధ్య రైల్వే. 10 స్పెషల్‌ ట్రైన్లను నడుపుతున్నట్టు ప్రకటించింది. సికింద్రాబాద్‌-విశాఖ, సికింద్రాబాద్‌-బ్రహ్మపూర్‌, తిరుపతి-శ్రీకాకుళం రోడ్‌, భువనేశ్వర్‌-బెలగావి, బెర్హంపూర్‌-నాందేడ్‌ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. పండుగల సీజన్‌లో ప్రయాణికులకు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటోంది దక్షిణ మధ్య రైల్వే. ప్రస్తుతానికి 10 స్పెషల్‌ ట్రైన్లను ప్రకటించింది. అవసరాన్ని బట్టి... మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెప్తున్నారు.

దసరా దీపావళికి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఇవే...
1. సికింద్రాబాద్‌-విశాఖ (07097) - సెప్టెంబర్‌ 6 నుంచి డిసెంబర్‌ 1వ తేదీ వరకు
2. విశాఖ-సికింద్రాబాద్‌ (07098) - సెప్టెంబర్‌ 9 నుంచి డిసెంబర్‌ 2వ తేదీ వరకు
3. సికింద్రాబాద్‌-బ్రహ్మపూర్‌ (07027) - సెప్టెంబర్‌ 6 నుంచి డిసెంబర్‌ 2వ తేదీ వరకు
4. బ్రహ్మపూర్‌-సికింద్రాబాద్‌ (07028) - సెప్టెంబర్‌ 7 నుంచి నవంబర్‌ 30వ తేదీ వరకు
5. తిరుపతి-శ్రీకాకుళం రోడ్‌ (07440) - అక్టోబర్‌ 10 నుంచి డిసెంబర్‌ 1వ తేదీ వరకు
6. శ్రీకాకుళం రోడ్‌-తిరుపతి (07441) - అక్టోబర్‌ 7 నుంచి డిసెంబర్‌ 2వ తేదీ వరకు
7. భువనేశ్వర్‌-బెలగాలి (02813) - సెప్టెంబర్‌ 7 నుంచి సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు
8. బెలగావి-భవనేశ్వర్‌ (02814) - సెప్టెంబర్‌ 9 నుంచి డిసెంబర్‌ 2వ తేదీ వరకు
9. నాందేడ్‌-బెర్హంపూర్‌ (07431) - అక్టోబర్‌ 12 నుంచి నవంబర్‌ 30వ తేదీ వరకు
10. బెర్హంపూర్‌-నాందేడ్‌ (07432) - అక్టోబర్‌ 13 నుంచి డిసెంబర్‌ 1వ తేదీ వరకు

Also Read: సాయంత్రానికి వరద నష్టంపై కేంద్రానికి నివేదిక- ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jani Master: జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
Revanth Reddy: నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Siddharth-Aditi Rao Hydari: గుడిలో సింపుల్‌గాపెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్‌- అదితి రావు హైదరి - ఫోటోలు వైరల్‌‌
గుడిలో సింపుల్‌గాపెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్‌- అదితి రావు హైదరి - ఫోటోలు వైరల్‌‌
Ganesh Idols Immersion: హైదరాబాద్‌లో నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు- 18వేలమందితో బందోబస్తు
హైదరాబాద్‌లో నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు- 18వేలమందితో బందోబస్తు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం, గోల్ఫ్‌కోర్ట్ సమీపంలో కాల్పులుTirumala Ghat Road | ఇంజనీర్స్ డే సందర్భంగా తిరుమల ఘాట్ రోడ్ రహస్యం మీ కోసం | ABP DesamArvind Kejriwal Resign | పక్కా వ్యూహంతో రాజీనామా చేసి ముందస్తుకు వెళ్తున్న Delhi CM కేజ్రీవాల్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jani Master: జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
Revanth Reddy: నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Siddharth-Aditi Rao Hydari: గుడిలో సింపుల్‌గాపెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్‌- అదితి రావు హైదరి - ఫోటోలు వైరల్‌‌
గుడిలో సింపుల్‌గాపెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్‌- అదితి రావు హైదరి - ఫోటోలు వైరల్‌‌
Ganesh Idols Immersion: హైదరాబాద్‌లో నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు- 18వేలమందితో బందోబస్తు
హైదరాబాద్‌లో నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు- 18వేలమందితో బందోబస్తు
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌పై మళ్లీ కాల్పులకు యత్నం- గోల్ఫ్ కోర్స్‌ వద్ద కలకలం
డొనాల్డ్ ట్రంప్‌పై మళ్లీ కాల్పులకు యత్నం- గోల్ఫ్ కోర్స్‌ వద్ద కలకలం
Cm Revanth Reddy : మహిళా సంఘాలకు గుడ్ న్యూస్-  రెండేసి చీరల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్- రెండేసి చీరల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు  
Crime News: హైదరాబాద్‌లో దారుణాలు - హోటల్‌లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య?, మరో చోట అనుమానంతో భార్యను చంపేసిన భర్త
హైదరాబాద్‌లో దారుణాలు - హోటల్‌లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య?, మరో చోట అనుమానంతో భార్యను చంపేసిన భర్త
Tejashwi Yadav: తేజస్వీ ఓ క్రికెటరా? అతని కెప్టెన్సీలో కోహ్లీ ఆడాడా? ఇంటర్నెట్‌లో తెగ వెదుకుతున్న నెటిజన్లు!
తేజస్వీ ఓ క్రికెటరా? అతని కెప్టెన్సీలో కోహ్లీ ఆడాడా? ఇంటర్నెట్‌లో తెగ వెదుకుతున్న నెటిజన్లు!
Embed widget