అన్వేషించండి

CM Chandrababu: సాయంత్రానికి వరద నష్టంపై కేంద్రానికి నివేదిక- ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

AP Floods: ఏపీ సీఎం చంద్రబాబు వరద నష్టంపై తొలి నివేదికను సాయంత్రంలోగా కేంద్రానికి పంపుతామన్నారు. చిన్న తప్పుకూడా జరగకుండా పనిచేస్తున్నామన్నారు. శవ రాజకీయాలు చేస్తున్నారని వైసీపీపై ఫైరయ్యారు చంద్రబాబు.

AP Flood Damage: కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా విజయవాడ నగరం ముంపునకు గురయ్యాయి. వేలాది కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. వరద తగ్గిన ప్రాంతాల్లో ఎటు చూసినా... బురదే కనిపిస్తోంది.  దీంతో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయి. నిన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కూడా ఏపీలో వరద మిగిల్చిన నష్టాన్ని పరిశీలించారు. చంద్రబాబుతోనే సమావేశమమై చర్చించారు. గురువారం (సెప్టెంబర్‌ 5వ  తేదీ) రాత్రి ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌రేట్‌లో మీడియా స‌మావేశంలో మాట్లాడారు చంద్రబాబు. ఇవాళ (సెప్టెంబర్‌ 6వ తేదీ) సాయంత్రంలోగా వరద న‌ష్టంపై తొలి నివేదిక‌ను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు చంద్రబాబు. ఈ నివేదిక ఆధారంగా మ‌ళ్లీ  స‌వివ‌రంగా మరో నివేదిక‌ను పంపుతామని చెప్పారు. దీనివ‌ల్ల వ‌ర‌ద న‌ష్టాన్ని అధ్య‌య‌నం చేసేందుకు, కేంద్ర బృందం వ‌చ్చేందుకు అనుకూలంగా ఉంటుందన్నారు. 

వేగంగా పారిశుద్ధ్య పనులు..
ముంపు ప్రాంతాల్లో బురద కడిగేందుకు పారిశుద్ధ్య పనులను శరవేగంగా జరుగుతున్నాయన్నారు చంద్రబాబు. 206 నీళ్ల ట్యాంకర్లు 513 ట్రిప్పులు వేశాయన్నారు. గురువారం రోజు ఫైర్ ఇంజిన్లు 5వేల ఇళ్ల‌ను శుభ్రం చేశాయని చెప్పారు. ఇవాళ  మ‌రింత విస్తృతంగా క్లీనింగ్‌ పనులు జరుగుతాయని చెప్పారు. కారు క్లీనింగ్ చేసే చిన్న‌చిన్న మెషీన్లను తీసుకొచ్చి.. అవ‌స‌ర‌మైతే 300, 400 సేక‌రించి అన్ని ఇళ్ల‌ను శుభ్రంచేసే బాధ్య‌త తీసుకుంటామన్నారు. ఇక.. నీటి క‌నెక్ష‌న్ల‌ను చాలా వ‌ర‌కు  పున‌రుద్ధ‌రించామన్నారు చంద్రబాబు. ఈ నీటిని రెండు రోజుల పాటు ఇంటిని శుభ్రం చేయ‌డానికి, స్నానం చేయ‌డానికి ఉప‌యోగించొచ్చు గానీ.... వంట‌కు, తాగ‌డానికి ఉప‌యోగించొద్ద‌ని స్ప‌ష్టమైన ఆదేశాలిచ్చామన్నారు.

మూడు అంశాల‌పై ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌
గురువారం రోజు శానిటేష‌న్‌, ముంపు, మెడిక‌ల్ క్యాంప్‌ల‌పై ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ తీసుకున్నామన్నారు చంద్రబాబు. 72 శాతం మంది ప్రజలు.. తమ ప్రాంతాల్లో శానిటేష‌న్ ప్రారంభ‌మైంద‌ని చెప్పారన్నారు. మెడిక‌ల్ క్యాంప్స్ పెట్టారా అంటే.. 72 శాతం  మంది... పెట్టార‌ని తెలిపారన్నారు. ఒక‌ వైపు శానిటేష‌న్‌ను పూర్తిచేస్తూనే... ఎక్క‌డిక‌క్క‌డ బ్లీచింగ్ చేయ‌మన్నామన్నారు. వైద్య శిబిరాల‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఇంటికి మెడిక‌ల్ కిట్ ఇచ్చి.. వారం ప‌ది రోజుల్లో చేయాల్సిన‌వి..  చేయ‌కూడ‌నివి ఏంటి అనేదానిపై పాంప్లేట్లు పంచుతున్నామన్నారు. అవ‌స‌ర‌మైతే వేరే రాష్ట్రాల నుంచి ఫైరింజన్లు తెప్పించ‌మ‌ని కూడా ఆదేశించామన్నారు చంద్రబాబు. ఇంకా కొన్ని అపార్ట్‌మెంట్లు, కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచి ఉందని.. ఆ నీటి  తోడేందుకు కూడా చర్యలు చేపట్టామన్నారు. 

విద్యుత్ స‌ర‌ఫ‌రా, టెలికం సేవ‌ల పున‌రుద్ధ‌ర‌ణ‌...
ముంపు ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌, టెలికం సేవలను పునరుద్దరిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ఉందని.. నీరు తగ్గగానే విద్యుత్‌ కనెక్షన్లు ఇస్తామన్నారు. వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల విద్యుత్ బిల్లుల‌ను కూడా వాయిదా వేస్తున్నామన్నారు. ఇక... గ్యాస్ స్ట‌వ్ రిపేర్‌, మోటారు వెహిక‌ల్ రిపేర్లు, ఎల‌క్ట్రీషియ‌న్లు అవ‌స‌రమని... ఆ సేవలన్నీ అందేలా చేయ‌డంపై దృష్టిసారిస్తున్నామన్నారు.  ఈ సేవ‌ల‌కు సంబంధించి ప్ర‌స్తుత‌మున్న వ్య‌వ‌స్థీకృత సంస్థ‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రిపి.. అవ‌స‌ర‌మైతే ఇన్సెంటివ్‌లు ఇచ్చి సేవ‌లందించేలా చేస్తామన్నారు చంద్రబాబు. రాయితీల‌తో రేట్ల‌ను నిర్దేశించి సేవ‌లందించేలా చూస్తామన్నారు. ఎక్క‌డిక‌క్క‌డ కార్పెంట‌ర్‌, ప్లంబ‌ర్‌, మెకానిక్, పెయింట‌ర్‌.. ఇలా అన్ని వ‌ర్కుల‌కు సంబంధించి సేవ‌లందించేలా చూస్తామన్నారు.

Also Read: ఆవేశం కాదు ఆలోచనతో బుక్ చేస్తున్న టీడీపీ - జైళ్లకు వెళ్లడం తప్ప వైసీపీ నేతలకు మరో మార్గం లేదా ?

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పై చంద్రబాబు విమర్శలు...
గత ప్రభుత్వం... బుడమేరుకు పడ్డ మూడు గండ్లు పూడ్చి ఉంటే ఈరోజు ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కాదన్నారు చంద్రబాబు. 2019లో బుడ‌మేరుపై అయిదు వ‌ర్క్‌లు ఇచ్చి రూ. 57 కోట్లు మంజూరు చేస్తే... ఆ ప‌నులు ర‌ద్దు చేశారన్నారు. వైసీపీ త‌ప్పుడు విధానాల వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందిప‌డుతున్నారు. మొత్తం వ్య‌వ‌స్థను భ్ర‌ష్టుప‌ట్టించారని ఆరోపించారు. పైగా.... ప్ర‌జ‌ల‌ను క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కించేందుకు తాము క‌ష్ట‌ప‌డుతుంటే చేత‌కాని రాజ‌కీయ పార్టీ ఇష్టానుసారం మాట్లాడుతోందని దుయ్యబట్టారు. చేసిన త‌ప్పును ఎదుటివారిపై మోపేందుకు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు. ఎప్పుడైనా చ‌రిత్ర‌లో ఇంత వ‌ర్షం ప‌డిందా? కృష్ణాలో ఎప్పుడైనా ఇన్ని నీళ్లు వ‌చ్చాయా? అని ప్రశ్నించారు. 15 లక్ష‌ల క్యూసెక్కుల నీరును సైతం డిశ్చార్జ్ చేసే అంశంపై అధ్య‌య‌నం చేస్తున్నామన్నారు చంద్రబాబు. ఒక్క విష‌యంలోనూ అజాగ్ర‌త్త‌గా లేకుండా కృషిచేస్తుంటే... బాధ్య‌త లేకుండా బుర‌ద‌జ‌ల్లే కార్య‌క్ర‌మం చేస్తున్నారని విమర్శించారు. ఓటు వేయ‌లేద‌ని రాష్ట్రంమీద ద్వేషం పెంచుకోవ‌డం, విధ్వంసం సృష్టించ‌డం మంచిదికాదని హితవు పలికారు. ఇక‌పై ఇలాంటి నేరాలు, ఘోరాలూ చేస్తే రాష్ట్రంలో ఉండ‌నీయ‌రని... ఇంట్లోంచి బ‌య‌ట‌కు రాలేరని హెచ్చరించారు. ప్ర‌జల జీవితాల‌తో ఆడుకోవ‌ద్దని అన్నారు చంద్రబాబు. వైసీపీ చేసిన తప్పుల వల్ల... కొన్ని ల‌క్ష‌ల మంది నాశ‌నమ‌య్యారని... లక్షా 40వేలకుపైగా కుటుంబాలు స‌ర్వ‌స్వం కోల్పోయాయన్నారు. దాదాపు 7 లక్ష‌ల మంది వారం రోజుల నుంచి మాన‌సిక క్షోభ అనుభ‌విస్తున్నారని చెప్పారు.

Also Read: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! మరొకటి రెడీగా ఉంది - ఐఎండీ  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget