News
News
వీడియోలు ఆటలు
X

CID ADG Sanjay: మార్గదర్శిలో అక్రమాలన్నీ నిజమే - కఠిన చర్యలు తప్పవు: సీఐడీ ఏడీజీ

CID ADG Sanjay: మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అక్రమాలు జరిగాయనేది వాస్తవం అని సీఐడీ ఏడీజీ సంజయ్ తెలిపారు. చిట్ ఫండ్ చట్టం 1982ను ఉల్లంఘించినట్లు వెల్లడించారు. 

FOLLOW US: 
Share:

CID ADG Sanjay: మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అక్రమాలు జరిగాయని సీఐడీ ఏడీజీ సంజయ్ తెలిపారు. చిట్ ఫండ్ చట్టం-1982 ను ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు. చిట్ చందాదారుల డబ్బులను అక్రమంగా దారి మళ్లించారని ఢిల్లీలోని మీడియా సమావేశంలో వెల్లడించారు. చట్ట ఉల్లంఘనలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఊరుకోదని చెప్పుకొచ్చారు. సర్కారు చేతులు ముడుచుకొని కూర్చుంటే అనేక మంది ప్రజలు నష్టపోవాల్సి వస్తుందని వివరించారు. అయినా ఎవరో వచ్చి పిర్యాదు చేస్తే తప్పు.. చట్ట ఉల్లంఘనలపై చర్యలు తీసుకోకుండా ఉండడం సరికాదన్నారు. అలా చేస్తే లక్షలాది మంది అమాయక ప్రజలు నష్టపోతారని వివరించారు. మార్గదర్శిలో మనీ లాండరింగ్ నిధుల మళ్లింపు జరిగిందని సంజయ్ చెప్పుకొచ్చారు. 

ఇటీవలే మార్గదర్శిపై ఫైర్ అయిన ఉండవల్లి

మార్గదర్శి చిట్స్ వ్యాపారంలో అనేక నిబంధనలను ఉల్లంఘించిందని, ఇప్పుడు అవే అక్రమాలు బయటపడుతున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. మంగళవారం  రాజమండ్రిలో  మార్గదర్శి వ్యవహారంపై ఆయన మీడియాతో మాట్లాడారు. మార్గదర్శి నిబంధనలను ఉల్లంఘించిందనే విషయాన్ని తాను ఏనాడో చెప్పానని నష్టాల్లో నడుస్తోందని కూడా చెప్పానని దానిపై ఆ సంస్థ ద్వారా తప్పులు బయ టకు తీసినందుకు తనపై రామోజీరావు కేసులు పెట్టించారని ఆరోపించారు.   ప్రస్తుతం ఏపీ సీఐడీ విచారణలో అందుకు తగ్గట్లే చిట్ అక్రమాలు జరిగినట్లు ఇప్పుడు తేలుతోందన్నారు. 

మార్గదర్శిని రామోజీ తన ఇష్టమొచ్చినట్లు నడిపిస్తూ డిపాజిటర్ల సొమ్మును సొంత వ్యాపారాలకు వినియోగిస్తున్నారని ఉండవల్లి ఆరోపించారు.  చిట్ ఫండ్ వ్యాపారం చేసేవారు వేరే వ్యాపారాలు చేయకూడదని ఉండవల్లి స్పష్టం చేశారు. బ్రహ్మయ్య అండ్ కంపెనీకి చెందిన సీఏను అరెస్ట్ చేస్తే. అది అందరు సీఏలపై దాడి ఎలా అవుతుందని ప్రశ్నించారు.  తప్పు ఎవరు చేసినా తప్పేనన్నారు.  చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఉండవల్లి  స్పష్టం చేశారు.  రామోజీ అయినా ఇంకెవరైనా చట్టం ముందు అంతా సమానమేనన్నారు. సాక్షాత్తూ వెంకటేశ్వరస్వామికే రూ.10 కోట్లు ఫైన్ వేశారని వెంకటేశ్వరస్వామి కంటే కూడా అతీతుడిననీ రామోజీ అనుకుంటారని కానీ, విజయ్ మాల్యా, రామోజీ రావు ఈ ఇద్దరూ చేసింది ఒక్కటే అని ఉండవల్లి వ్యాఖ్యానించారు.                  

సెక్షన్ 477 - ఏ ప్రకారం అకౌంట్స్ తారుమారు చేస్తే శిక్ష తప్పదని స్పష్టం చేశారు.  రామోజీరావుకు పారదర్శకత ఉంటే.. డిపాజిటర్ల పేర్లు విడుదల చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. అవినీతిని ప్రశ్నిస్తే.. రామోజీరావు పత్రికాస్వేచ్ఛపై దాడి అని చెప్పుకుంటారని ఉండవల్లి ఎద్దేవా చేశారు. మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ సంస్థలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. ఇండివిడ్యువల్‌ గ్రూపులకు సంబంధించిన ఫారం 21ను మార్గదర్శి చిట్స్‌ సమర్పించలేదని, బ్యాలెన్స్‌షీట్లను తెలియజేసే పత్రాలను కూడా మార్గదర్శి అందజేయలేదని అధికారులు తెలిపారు. మూడు నెలలుగా మార్గదర్శికి చెందిన 444 గ్రూపులకు సంబంధించి కార్యకలాపాలను నిలిపివేశారని తెలిపారు. డిసెంబర్‌ నుంచి ఈ ఫారం నింపి ఇవ్వలేదని సీఐడీ అధికారులు ఆరోపణలు చేస్తున్నారు.                          

Published at : 12 Apr 2023 02:53 PM (IST) Tags: AP News Crime News Chit Funds CID ADG Margadasrhi

సంబంధిత కథనాలు

TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు

TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Nara Lokesh: ప్యాలెస్‌లు ఉన్న జగన్ పేదోడా? వైసీపీ గలీజ్ పార్టీ - మహానాడులో నారా లోకేశ్

Nara Lokesh: ప్యాలెస్‌లు ఉన్న జగన్ పేదోడా? వైసీపీ గలీజ్ పార్టీ - మహానాడులో నారా లోకేశ్

టాప్ స్టోరీస్

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి

ఒక్క ఛాన్స్ ప్లీజ్ - తెలుగులోకి వస్తానంటున్న తమిళ బ్యూటీ ప్రగ్యా నగ్రా

ఒక్క ఛాన్స్ ప్లీజ్ - తెలుగులోకి వస్తానంటున్న తమిళ బ్యూటీ ప్రగ్యా నగ్రా