Chandrababu : పోలీసుల్ని బలిపశువులు చేస్తున్న జగన్ రెడ్డి - తప్పు చేసిన ఏ ఒక్కర్నీ వదిలి పెట్టబోమన్న చంద్రబాబు !
తప్పు చేసిన ఏ ఒక్క అధికారిని వదిలి పెట్టబోమని చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్‌పై విడుదలైన అశోక్‌బాబును ఆయన పరామర్శించారు
ఎమ్మెల్సీ అశోక్‌బాబును ( MLC Ashok Babu ) అరెస్ట్ చేయదల్చుకుంటే ఉదయమే అరెస్ట్ చేయవచ్చని అర్థరాత్రి పూట అరెస్ట్ చేయడం ఏమిటని చంద్రబాబు ( Chandrababu ) ప్రశ్నించారు. పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత దారుణమన్నారు. ఎమ్మెల్సీ అశోక్ బాబును . అర్ధరాత్రి కిడ్నాప్ చేసి ఎక్కడెక్కడో తిప్పారని మండిపడ్డారు. ఉన్మాది సీఎం చెప్తే పోలీసుల విచక్షణ ఏమైందని ప్రశ్నించారు. జగన్‌రెడ్డి ( CM Jagan mohan Reddy ) పోలీసుల్ని బలి పశువుల్ని చేస్తున్నారన్నారురు. సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంతో బెయిల్‌పై విడుదలైన అశోక్‌బాబును చంద్రబాబు ఆయన ఇంట్లో పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు ( CID Police ) అదుపులోకి తీసుకున్న ఇరవై నాలుగు గంటలు తనతో ఎలా వ్యవహరించారో వివరించారు. అసలు తనను అదుపులోకి తీసుకున్న విషయం కాకుండా ఉద్యోగుల ఉద్యమం గురించే ఎక్కువగా ప్రశ్నించారని అశోక్ బాబు చంద్రబాబుకు తెలిపారు.
వంద రెండు వందలు కాదు ఏకంగా రెండు లక్షల కేజీలు - గంజాయి కేసుల్లో ఏపీ పోలీసుల సంచలనం !
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ముగ్గురు మాజీ మంత్రులను అరెస్ట్ చేశారు. ఇప్పటివరకూ 40 మంది టీడీపీ నేతలపై కేసులు ( TDP Leaders Arrest ) పెట్టారు. 33 మంది టీడీపీ నేతలను హత్య చేశారన్నారు. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరి పక్షాన టీడీపీ పోరాడుతుందని భయపడే ప్రశ్నే లేదన్నారు. తప్పు చేసే ఏ ఒక్క అధికారీ తప్పించుకోలేరని చంద్రబాబు హెచ్చరించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ( YS Viveka Murder Case ) హత్య కేసులో నిందితులను కడప జైలులో హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.
వచ్చే గురువారం ఏపీకి ప్రత్యేకహోదాపై చర్చ - విభజన సమస్యలపై కేంద్రం కీలక నిర్ణయం !
మొద్దు శ్రీను హత్య సమయంలో అనంతపురం జైలర్‌గా ఉన్న వరుణ్ రెడ్డిని ( Varuna Reddy ) ఇప్పుడు కడప జైలర్‌గా నియమించారన్నారు. వివేకా హత్య కేసులో నిందితులు ప్రస్తుతం కడప జైలులో ఉన్నారని గుర్తు చేశారు. వరుణ్ రెడ్డి నియామకంపై సీబీఐ ( CBI) అధికారులకు లేఖ రాస్తానని చంద్రబాబు ప్రకటించారు. జగన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి ( Avinash Reddy )సాయంతో వరుణ్ రెడ్డి ద్వారా వారికి ప్రాణముప్పు పొంచి ఉందని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు.