అన్వేషించండి

Special Status : వచ్చే గురువారం ఏపీకి ప్రత్యేకహోదాపై చర్చ - విభజన సమస్యలపై కేంద్రం కీలక నిర్ణయం !

Special Status :విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ సమావేశం వచ్చే గురువారం జరగనుంది. చర్చల ఎజెండాలో ప్రత్యేకహోదా కూడా ఉంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Modi )విభజన సరిగ్గా చేయకపోవడం వల్లే తెలుగు  రాష్ట్రాలకు ( Telugu States ) ఇంకా సమస్యలు ఉన్నాయని పార్లమెంట్‌లో ప్రకటించిన కొద్ది రోజులకే సమస్యల పరిష్కారానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ 17వ తేదీన సమావేశం ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాల అధికారులతో పాటు కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ నేతృత్వంలో  విభజన సమస్యల పరిష్కారానికి  Telugu States Problems ) కమిటీ ఏర్పాటు చేశారు.  కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ ఆశిష్‌ కుమార్, ఏపీ నుంచి ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌, తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సమావేశం గురువారం ఉదయం 11గంటలకు జరగనుంది. వర్చువల్‌గానే భేటీ జరుగుతుంది.
Special Status : వచ్చే గురువారం ఏపీకి ప్రత్యేకహోదాపై చర్చ - విభజన సమస్యలపై కేంద్రం కీలక నిర్ణయం !

సమావేశంలో చర్చించడానికి మొత్తం ఎనిమిది అంశాలను ఎజెండాగా ఖరారు చేశారు.  మొదటి అంశం ఏపీ ఫైనాన్స్‌ కొర్పొరేషన్‌ విభజన ఆ తర్వాత వరుసగా విద్యుత్ వినియోగ అంశాలు, పన్ను అంశాల్లో సవరణలు,  విద్యుత్ సంస్థల్లో  నగదు అంశం, వనరుల సర్దుబాటు, వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి నిధుల అంశం, ప్రత్యేక హోదా, పన్ను ప్రోత్సాహకాలు, వనరుల వ్యత్యాసం వంటి వాటిపై చర్చిస్తారు. అలాగే విభజన చట్టం షెడ్యూల్‌ 9, 10లోని ఆస్తుల పంపకాలపైనా భేటీలో చర్చించే అవకాశం ఉంది.  ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్థిక పరమైన అంశాలకు ఓ పరిష్కారం చూపించే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.
Special Status : వచ్చే గురువారం ఏపీకి ప్రత్యేకహోదాపై చర్చ - విభజన సమస్యలపై కేంద్రం కీలక నిర్ణయం !

మిగతా అంశాల సంగతి పక్కన పెడితే రాజకీయంగా ఎంతో కీలకమైన ప్రత్యేకహోదా ( special Status ) అంశంపైనా చర్చిస్తామని కేంద్ర హోంశాఖ ఎజెండాలో పెట్టడం ఏపీ ప్రభుత్వానికి ఊరటక కలిగిస్తోంది. హోదా అనేది ముగిసిన అధ్యాయం అని అంటూ కేంద్రం లోని పెద్ద‌లు ( Central Governament ) అనేక సార్లు తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు కేంద్రమే ప్రత్యేకహోదాపై చర్చలకు రావాలని ఇరు రాష్ట్రల‌కు ఆహ్వ‌నం పంపింది. దీంతో ఈవిష‌యం పై మ‌రో సారి చ‌ర్చ కు తెర‌లేచింది.

వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు (YSRCP MPS ) ఇటీవలే ప్రధాని నరేం‍ద్రమోదీని కలిసి ఏపీ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని మోదీని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ కూడా కోరారు. ఈ పరిణామాలతో సమస్యలు పరిష్కారానికి కేంద్రం  ముందుడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఏపీ ప్రభఉత్వం ఆ అంశాలపై వినతి పత్రాలు ఇచ్చింది కాబట్టి చర్చించేందుకు ఎజెండాలో పెట్టారని కానీ ఎలాంటి ముందడుగు ఉండదని కొంత మంది అంచనా వేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 DC VS RR Result Update: ఢిల్లీ సూపర్ విజయం.. టాప్ ప్లేసుకు చేరిక.. రాణించిన పోరెల్.. సూపర్ ఓవర్లో గెలిపించిన రాహుల్, స్టబ్స్
ఢిల్లీ సూపర్ విజయం.. టాప్ ప్లేసుకు చేరిక.. రాణించిన పోరెల్.. సూపర్ ఓవర్లో గెలిపించిన రాహుల్, స్టబ్స్
Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
Chandrababu:  రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
Supreme Court :  టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Preity Zinta Celebrations | PBKS vs KKR మ్యాచ్ లో ప్రీతి జింతా సెలబ్రేషన్స్ వైరల్Narine Bat Inspection vs PBKS IPL 2025 | పంజాబ్ మ్యాచ్ లో నరైన్ కి షాక్ ఇచ్చిన అంపైర్లుPBKS vs KKR Match Chahal Bowling | IPL 2025 లో సంచలన బౌలింగ్ తో పంజాబ్ కు సెన్సేషనల్ విక్టరీPBKS Highest lowest IPL 2025 | వరుస మ్యాచుల్లో రెండు వేరియేషన్స్ చూపించిన పంజాబ్ కింగ్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 DC VS RR Result Update: ఢిల్లీ సూపర్ విజయం.. టాప్ ప్లేసుకు చేరిక.. రాణించిన పోరెల్.. సూపర్ ఓవర్లో గెలిపించిన రాహుల్, స్టబ్స్
ఢిల్లీ సూపర్ విజయం.. టాప్ ప్లేసుకు చేరిక.. రాణించిన పోరెల్.. సూపర్ ఓవర్లో గెలిపించిన రాహుల్, స్టబ్స్
Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
Chandrababu:  రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
Supreme Court :  టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
DC vs RR Super Over: ఐపీఎల్‌ చరిత్రలో ఎన్ని సూపర్ ఓవర్ మ్యాచ్‌లు జరిగాయి? ఎక్కువ ఎవరు ఆడారు?
ఐపీఎల్‌ చరిత్రలో ఎన్ని సూపర్ ఓవర్ మ్యాచ్‌లు జరిగాయి? ఎక్కువ ఎవరు ఆడారు?
BCCI Red Alert: ఆ హైదరాబాద్ వ్యాపారితో జాగ్రత్త- ఐపీఎల్‌ యాజమాన్యాలు, జట్లకు బీసీసీఐ హెచ్చరిక!
ఆ హైదరాబాద్ వ్యాపారితో జాగ్రత్త- ఐపీఎల్‌ యాజమాన్యాలు, జట్లకు బీసీసీఐ హెచ్చరిక!
Varsha Bollamma: ప్యాంట్, పంత్, లక్నో... వర్షా బొల్లమ్మ ఎక్కడి నుంచి ఎక్కడికి ముడి పెట్టింది మావా
ప్యాంట్, పంత్, లక్నో... వర్షా బొల్లమ్మ ఎక్కడి నుంచి ఎక్కడికి ముడి పెట్టింది మావా
Gold price: 98 వేలకు చేరిన పది గ్రాముల బంగారం - ఇక లక్ష మార్క్ దాటడమే - సిల్వరూ ఆగట్లేదు !
98 వేలకు చేరిన పది గ్రాముల బంగారం - ఇక లక్ష మార్క్ దాటడమే - సిల్వరూ ఆగట్లేదు !
Embed widget