By: ABP Desam | Updated at : 09 Jun 2023 06:15 PM (IST)
మంత్రులకు తనను తిట్టడమే పనన్న చంద్రబాబు !
Chandrababu comments : ఉదయం లేచింది మొదలు తనను తిట్టడమే మంత్రులకు పెద్దపని ఏపీ మంత్రులపై టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు వేశారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ ఐ టీడీపీ సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. టీడీపీ మహానాడులో విడుదల చేసిన మేనిఫెస్టో వివరాలను సోషల్ మీడియా లో విస్తృత ప్రచారం కల్పించింది ఐ-టీడీపీ నే అని ప్రశంసించారు. బీసీ (BC)ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం (Special Act) తెస్తామని, ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని.. అభద్రతకు గపరవుతున్నారని అన్నారు. బీసీలపై దాడులు పెరుగుతున్నాయని, వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టం అవసరమని అన్నారు.
మంత్రులకు తనను ప్రతి రోజూ తిట్టమే పని అని.. మంత్రులకు ఓ వైసీపీ ఆఫీస్ నుంచి ఓ నోట్ వస్తుందని ఆ నోట్ లో ఉన్నది ఉన్నట్లుగా చదివేస్తారని ఎద్దేవా చేశారు. అనంతరం మంత్రులపై తీవ్ర ఆరోపణలు చేశారు. అక్రమ మైనింగ్ చేసేవాడు మైనింగ్ శాఖ మంత్రి అని, సొంతూరులో పిల్ల కాల్వ తవ్వలేని వ్యక్తి ఇరిగేషన్ మంత్రి అని అన్నారు. నియోజకవర్గంలో పది ఇళ్లు కట్టలేని వాడు హౌసింగ్ మంత్రి, పెట్టుబడులు గురించి అడిగితే కోడి గుడ్డు గురించి చెప్పేవాడు పరిశ్రమల మంత్రి అని ఆరోపించారు. జగన్ కు కోర్టుల్లో అనుకూల తీర్పులు రావాలని యాగాలు చేసే వ్యక్తి దేవాదాయ శాఖ మంత్రి అన్నారు. రైతుబజార్లను తాకట్టు పెట్టేవాడు ఆర్థిక శాఖ మంత్రి, పిల్లల జీవితాలు నాశనం చేసేవాడు విద్యామంత్రి అని చంద్రబాబు మండిపడ్డారు.
మేనిఫెస్టోలో ఉన్న అంశాలను ఉన్నవి ఉన్నట్లుగా అమలు చేస్తామన్నారు. మహాశక్తి పథకం ద్వారా మహిళలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతున్నామని చంద్రబాబు తెలిపారు. ఏడాదికి మూడు సిలెండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, నెలకు రూ. 1500 వంటి పథకాలతో మహిళలకు లబ్జి చేకూరుస్తామని స్పష్టం చేశారు. ఆడబిడ్డల జీవితాల్లో వెలుగు తేవాలనేదే తన లక్ష్యమన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని గతంలో చెప్పి.. అమలు చేశామని, మళ్లీ అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన చేపడతామన్నారు. పేదలు ధనికులుగా మారడం ఇష్టం లేని వాళ్లే ‘పూర్ టు రిచ్ స్కీం’ను వ్యతిరేకిస్తారని అన్నారు.
పార్టీ కార్యకర్తలు చేసే ప్రచారం ఎంత ముఖ్యమో.. సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం కూడా అంతే ముఖ్యమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.అమరావతి ( ఎక్కడికీ పోదని, 9 నెలల తర్వాత మళ్లీ నిర్మాణ పనులు పరుగులు పెట్టిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు ధీటుగా మరో నగరాన్ని కట్టాలని సంకల్పించామన్నారు. అమరావతి కోసం రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారని తెలిపారు. టీడీపీపై విశ్వాసంతోనే 29 వేల మంది రైతులు భూములిచ్చారని, టీడీపీ (TDP) వచ్చాక అమరావతిలో పనులు పరుగులు పెట్టిస్తామని ప్రకటించారు.
IT Employees Car Rally: చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల కార్ ర్యాలీ ప్రారంభం - బోర్డర్ వద్ద టెన్షన్! వందల్లో పోలీసులు
BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?
Top Headlines Today: నేడు బాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల ర్యాలీ; తెలంగాణలో ఎన్నికల హడావుడి ఎందుకు లేదు? - నేటి టాప్ న్యూస్
Weather Latest Update: త్వరలో బంగాళాఖాతంలో తుపానుకు అవకాశం! నేడు వర్షాలు పడే ప్రాంతాలు ఇవే: ఐఎండీ
Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత
Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు
కాంగ్రెస్ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!
IND Vs AUS: రెండో వన్డేలో తుదిజట్లు ఎలా ఉంటాయి? - భారత్ మార్పులు చేస్తుందా?
/body>