అన్వేషించండి

Chandrababu : వరద బాధితులందరకీ సాయం - చంద్రబాబు కీలక ప్రకటన

Andhra Pradesh : వరద బాధితులందరికీ సాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. తక్షణ సాయాన్ని ప్రకటించారు.

Chandrababu announced that he will help all the flood victims:  భారీ వర్షాలకు, వ‌ర‌ద‌ల‌కు దెబ్బ‌తిన్న ప్ర‌తి రైతును ఆదుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. ఇళ్లు నీట మునిగిన ప్ర‌తి కుటుంబానికి రూ.3 వేల త‌క్ష‌ణ సాయం అందించాలని అధికారుల్ని ఆదేశించారు.  ఇటీవ‌ల కురిసిన భారీ వర్షాలకు,  వ‌ర‌ద‌ల‌కు న‌ష్ట‌పోయిన ప్ర‌జ‌ల‌ను, రైతుల‌ను త‌మ ప్ర‌భుత్వం అన్నివిధాలా ఆదుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. వ‌ర‌ద‌బాధిత ప్రాంతాల‌కు వెళ్లి అక్క‌డ బాధితుల‌ను ప‌రామ‌ర్శించి, న‌ష్టం అంచ‌నాల‌ను ప‌రిశీలించాల‌ని వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనితలను ఆదేశించారు. ఆయా జిల్లాల మంత్రులు కూడా త‌మ ప్రాంతాల్లో జరిగిన న‌ష్టం వివ‌రాల‌ను సేక‌రించి అంద‌జేయాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు.  

గోదావరి వరదలతో తూర్పు గోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి, కోన‌సీమ‌, కాకినాడ‌, ఏలూరు జిల్లాల్లో పంట‌లు దెబ్బ‌తిన్నాయి. అల్లూరి సీతారామ‌రాజు జిల్లా మెట్ట‌ ప్రాంత‌మైన‌ప్ప‌టికీ అక్క‌డ కూడా వ‌ర‌ద‌ల వ‌ల్ల కొంత న‌ష్టం ఏర్ప‌డింది. ప్రాథ‌మిక అంచ‌నాల మేర‌కు ఈ వ‌ర‌ద‌ల్లో 4,317 ఎక‌రాల్లో ఆకుమడులు  పూర్తీగా దెబ్బ‌తిన్నాయి. 1.06 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వ‌రినాట్లు వేశారు. అదంతా కూడా వ‌ర‌ద‌ నీటి ముంపున‌కు గురైంది. 3,160 ఎక‌రాల్లో మొక్క‌జొన్న‌, 960 ఎక‌రాల్లో ప‌త్తి పంట‌ల‌కు న‌ష్టం వాటిల్లింది. అయితే  క్షేత్ర‌స్థాయికి వెళ్లిన‌ప్పుడు ఈ న‌ష్టం ఇంకా పెరిగే సూచ‌న‌లున్నాయని ప్రభుత్వం చెబుతోంది 

ప్ర‌కృతి విప‌త్తు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌జ‌ల‌ను పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపైన ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.  గ‌తంలో హుదుద్‌, తిత్లీ తుపాన్లు వ‌చ్చిన‌ప్పుడు కూడా ప్రజలకు సాయం చేశాం. ఇప్పుడు ఈ ఐదారు జిల్లాల్లో వ‌చ్చిన విప‌త్తుల వ‌ల్ల న‌ష్ట‌ పోయిన వారంద‌రికీ కూడా సాయం అందిస్తాం. వ‌ర‌ద బాధితులంద‌రికీ హామీ ఇస్తున్నా, ప్ర‌తి కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని చెప్తున్నా. వర‌ద‌ల్లో ముంపుకు గురైన ప్ర‌తి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ ప‌ప్పు, లీట‌రు పామాయిల్‌, కేజీ బంగాళ దుంప‌లు , కేజీ ఉల్లిపాయ‌లు ఇస్తున్నాం. అవి ఒక‌వైపు ఇస్తూనే, గ‌తంలో ఎన్న‌డూ ఇవ్వ‌ని విధంగా ఎక్క‌డైతే ఇళ్ల‌లోకి వ‌ర‌ద నీరు పూర్తిగా వ‌చ్చి చేరిందో, ఎవ‌రైతే పున‌రావాస కేంద్రాల్లో ఉంటున్నారో వాళ్లంద‌రికీ ఒక్కో కుటుంబానికి రూ.3వేల చొప్పున ఆర్థిక సాయం అంద‌జేస్తామని ప్రకటించారు. 

తానే స్వ‌యంగా వెళ్లి వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించాల‌ని అనుకున్నా కానీ నీతి ఆయోగ్ స‌మావేశంలో పాల్గొన‌డానికి ఢిల్లీకి వెళ్లాల్సి ఉండ‌టంతో కుద‌ర‌డం లేదని చంద్రబాబు తెలిపారు.  ఏఏ పంట‌లు ఎంత‌మేర నీట మునిగాయి, ఇన్‌పుట్ స‌బ్సిడీ ఎంత వ‌ర‌కు ఇవ్వొచ్చు, మ‌ళ్లీ రైతులు కోలుకోవాలంటే ఏం చేయాలి, ఏమివ్వాల‌నేది నాకు ఒక‌సారి వివ‌రిస్తే ఆ ప్ర‌కారం వాళ్ల‌ను ఆదుకునే బాధ్య‌త‌ను ప్ర‌భుత్వం తీసుకుంటుంది. ఇక్క‌డ వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌కంటే, ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వ‌ర్షాల వ‌ల్ల ఎక్కువ నీళ్లు రావ‌డంతో గోదావరి జిల్లాల్లో ఎక్కువ ప్రాంతం ముంపున‌కు గురైంది. బాధితుల‌ను ఆదుకునే విష‌యంలో ఇప్పుడుండే నిబంధ‌నావ‌ళి  కంటే కూడా ఎక్కువ సాయం అందించ‌డానికి సిద్ధంగా ఉన్నామన్నారు.                     

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Vijay Deverakonda Rashmika: తిరుమలలో విజయ్ దేవరకొండ - రష్మిక... 'రణబాలి' విజయం కోసం వెంకన్నకు ప్రత్యేక ప్రార్థనలు
తిరుమలలో విజయ్ దేవరకొండ - రష్మిక... 'రణబాలి' విజయం కోసం వెంకన్నకు ప్రత్యేక ప్రార్థనలు
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
Embed widget