అన్వేషించండి

Chandrababu: ప్రపంచవ్యాప్తంగా తెలుగు శక్తిగా ఎదగాలి - జ్యూరిచ్ తెలుగు డయాస్పోరాలో సీఎం చంద్రబాబు పిలుపు

Chandrababu in Zurich: ఐటీ గురించి మాట్లాడినప్పుడు విమర్శలు వచ్చాయని, కానీ నేడు 195 దేశాలలో తెలుగు బిడ్డలు ఉన్నత స్థితిలో ఉన్నారని చంద్రబాబు అన్నారు. జ్యూరిచ్‌లో తెలుగు డయాస్పోరాలో మాట్లాడారు.

Chandrababu in Telugu diaspora :  ప్రపంచ ఆర్థిక వేదిక  వార్షిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తన పర్యటనను జ్యూరిచ్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంతో ఘనంగా ప్రారంభించారు. 20 దేశాల నుంచి తరలివచ్చిన ప్రవాస తెలుగు వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.  తెలుగు వారు నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేసే శక్తివంతమైన కమ్యూనిటీగా ఎదిగారని కొనియాడారు. తాను గతంలో విజన్ 2020 , ఐటీ రంగం గురించి మాట్లాడినప్పుడు విమర్శలు వచ్చాయని, కానీ ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్లే నేడు 195 దేశాలలో తెలుగు బిడ్డలు ఉన్నత స్థితిలో ఉన్నారని ఆయన గుర్తు చేశారు.
 
ఇటీవలి ఎన్నికల్లో కూటమి సాధించిన 93 శాతం స్ట్రైక్ రేట్ విజయం వెనుక ప్రవాస తెలుగు వారి కృషి మరువలేనిదని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి పూర్వవైభవం తేవాలన్న పిలుపుతో ఎన్నారైలు ఆలోచించకుండా తరలివచ్చి కూటమి కోసం పని చేశారని, కొందరు నేతలు కార్యకర్తలతో సమానంగా కేసులు కూడా ఎదుర్కొన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ సహకరించారని, బీజేపీ కూడా తోడవడంతోనే ఈ అద్భుత విజయం సాధ్యమైందని స్పష్టం చేశారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి పునర్ నిర్మించడంపై ఆందోళన ఉన్నా, గత 18 నెలల్లో మళ్లీ ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరించామని ధీమా వ్యక్తం చేశారు.

పెట్టుబడుల స్వర్గధామంగా ఏపీ 

రాష్ట్ర అభివృద్ధి కోసం  స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్  విధానంతో ముందుకు సాగుతున్నామని, దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే దక్కాయని చంద్రబాబు ప్రకటించారు. గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజం ఏపీకి రావడంతో పాటు, ఆర్సెల్లార్ మిట్టల్ లక్ష కోట్ల రూపాయలతో ఉక్కు పరిశ్రమను, ఏఎం గ్రీన్ సంస్థ 10 బిలియన్ డాలర్లతో గ్రీన్ అమోనియా ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నాయని వెల్లడించారు. మొత్తం 22 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల లక్ష్యంగా కసరత్తు చేస్తున్నామని, ఇది సాకారమైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

భవిష్యత్ సాంకేతికత - యువతకు పెద్దపీట 

టెక్నాలజీలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడంలో తెలుగు వారు ముందున్నారని, రాబోయే కాలంలో ఏఐ , క్వాంటం, స్పేస్,  డ్రోన్ టెక్నాలజీలకు ఏపీ చిరునామాగా మారబోతోందని ముఖ్యమంత్రి వివరించారు. ముఖ్యంగా డ్రోన్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయం, వైద్య రంగాల్లో సేవలు అందించేందుకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అనుమతుల విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. తన ప్రభుత్వంలో లోకేష్, రామ్మోహన్ నాయుడు, టీజీ భరత్ వంటి విద్యావంతులైన యువతకు ప్రాధాన్యత ఇస్తున్నామని, యువత సవాళ్లను ఎదుర్కోవడం నేర్చుకోవాలని హితవు పలికారు.

సంక్షేమం.. సంస్కరణలు 

తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ప్రారంభించడం గర్వకారణమని, నేడు ప్రధాని మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఎకానమీగా అవతరిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజారోగ్యం కోసం   సంజీవని  ప్రాజెక్టు, ప్రకృతి సేద్యం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం, మరియు 958 టీఎంసీల నీటి నిల్వలతో నీటి భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. విదేశాల్లో స్థిరపడిన ప్రవాసులు తమ మాతృభూమిని, మారుమూల గ్రామాలను మర్చిపోవద్దని, ఆ గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.  

టాప్ హెడ్ లైన్స్

YCP Vs TDP: విజయవాడలో టీడీపీ VS వైసీపీ
YCP Vs TDP: విజయవాడలో టీడీపీ VS వైసీపీ
AP Employee Unions: ఏపీ ఉద్యోగ సంఘాల సంచలన నిర్ణయం - పీఆర్‌సీ, ఐఆర్‌ కోసం పోరాటం.. కూటమి ప్రభుత్వానికి సవాలు!
ఏపీ ఉద్యోగ సంఘాల సంచలన నిర్ణయం - పీఆర్‌సీ, ఐఆర్‌ కోసం పోరాటం.. కూటమి ప్రభుత్వానికి సవాలు!
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget