Chandra Babu on Jagan: కేసులపై చంద్రబాబు కౌంటర్- సాగునీటి విధ్వంసంపై సమాధానాలని సవాల్
Chandra Babu on Jagan: ప్రశ్నించిన టీడీపీ నేతలపై కుట్రలు, దాడులు, అక్రమ కేసులు పెట్టడం మానేసి సాగునీటి విధ్వంసంపై తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ కు సవాల్ విసిరారు.
Chandra Babu on Jagan: రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా పుంగనూరు విధ్వంసక ఘటనలో టీడీపీ నేతలను అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రశ్నించిన టీడీపీ నేతలపై కుట్రలు, దాడులు, అక్రమ కేసులు పెట్టడం పక్కన పెట్టి.. ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి తీరని అన్యాయం చేశారని అన్నారు. తన స్వార్థం, పగ కోసం మాత్రమే సీఎం జగన్ ఆలోచిస్తారని.. రాష్ట్రాభివృద్ధి గురించి మాత్రం అస్సలే ఆలోచించరని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇలా ఆలోచించడం వల్లే ఈరోజు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పడకేశాయని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగు ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తి చేయలేదని అన్నారు. రాష్ట్రంలోని ఒక్క ఎకరాకు కూడా సాగునీటి వసతి కల్పించలేదని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగానికి పట్టిన శని జగన్మోహన్ రెడ్డి. తన స్వార్థం, తన పగ తప్పితే రాష్ట్ర అభివృద్ధి గురించి, రైతు అవసరం గురించి జగన్ ఏ మాత్రం ఆలోచించకపోవడం వల్లే ఈరోజు రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ ఇలా పడకేశాయి. నాలుగేళ్లలో ఒక్క ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చెయ్యలేదు. ఒక్క ఎకరాకు… pic.twitter.com/1EnI4jZuU1
— N Chandrababu Naidu (@ncbn) August 9, 2023
ప్రాజెక్టు గేట్ల నిర్వహణ లేదని, కాలువల్లో పూడిక తీయలేదని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. జీవనాడి పోలవరాన్ని జీవం లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి రంగానికి ఇంత ద్రోహం చేసిన సీఎం జగన్ ను చరిత్ర ఎప్పటికీ క్షమించదని వివరించారు. నేతలను అరెస్ట్ చేయించడానికి బదులుగా తాను అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని సీఎం జగన్ కు సవాల్ విసిరారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల కనీస నిర్వహణ లేక, పులిచింతల, అన్నమయ్య, గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోయాయి. ఇదేనా ప్రాజెక్టుల పై ఉన్న శ్రద్ధ ?#JaganCurseToAPIrrigation pic.twitter.com/tWCt2KmiwJ
— Telugu Desam Party (@JaiTDP) August 9, 2023
రాయలసీమలోని 102 ప్రాజెక్టుల్ని ప్రీక్లోజర్ చేసిన జగన్ సీమ ద్రోహి కాదా ?#JaganCurseToAPIrrigation pic.twitter.com/Ej9KfyIJ2F
— Telugu Desam Party (@JaiTDP) August 9, 2023
రాష్ట్రానికి లైఫ్ లైన్ అయిన పోలవరానికి లైఫే లేకుండా చేసాడు జగన్ రెడ్డి #JaganCurseToAPIrrigation pic.twitter.com/PxNiaYeSsp
— Telugu Desam Party (@JaiTDP) August 9, 2023
సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరిలో భాగంగా పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ ఫేజ్-1 పరిశీలించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు#ProjectsKillWaterNill#YuddhaBheri#JaganFailsIrrigation#AndhraPradesh #NalugellaNarakam #JaganLosingIn2024#ByeByeJaganIn2024… pic.twitter.com/s8UgL3YHNd
— Telugu Desam Party (@JaiTDP) August 8, 2023
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 72 శాతం పూర్తిచేసిన వాడిని. మళ్ళీ ఈ ప్రాజెక్టును ప్రాణసమానంగా చూసుకుని పూర్తి చేస్తా- @ncbn గారు#CBNinEastGodavari#PolavaramPaaye #PolavaramProject #AndhraPradesh #NalugellaNarakam #JaganLosingIn2024#ByeByeJaganIn2024… pic.twitter.com/qRn1WgWeSK
— Telugu Desam Party (@JaiTDP) August 8, 2023
వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే.. ప్రాణ సమానంగా భావించిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న సీఎం జగన్ కు ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.