News
News
X

AP News : ఉచితంగా ప్రికాషన్ డోస్ - అన్ని రాష్ట్రాల సీఎస్‌కు కేంద్రం ప్రత్యేక సూచనలు !

ప్రికాష్ డోస్ వ్యాక్సినేషన్‌తో పాటు వివిధ కేంద్ర ప్రభుత్వ అంశాలపై సీఎస్‌లతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి సమీక్ష చేశారు. పలు కీలక సూచనలు చేశారు.

FOLLOW US: 

AP News :   ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా  ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా ,జల్ జీవన్ మిషన్,కోవిడ్ వ్యాక్సినేషన్  ,  నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన అంశాలపై శుక్రవారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ  వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. త్వరలో ప్రధానమంత్రి అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన అంశాలపై సిఎస్ లతో సమీక్షించారు. 

ఉచిత ప్రికాషన్ డోస్ పంపిణీకి ఏర్పాట్లు 

తదుపరి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా 75 రోజులపాటు నిర్వహించే కోవిడ్ ప్రికాషన్ డోస్ పంపిణీ కార్యక్రమంపై మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున అమలు చేసి 18ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందించేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. గ్రామ పంచాయితీలు, మున్సిపల్ ప్రాంతాల్లో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని రాజీవ్ గౌబ సిఎస్ లకు చెప్పారు. అంతేగాక ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలు ద్వారా వ్యాక్సిన్ అందించాలని, రైల్వే స్టేషన్లు,బస్సు స్టేషన్లు తదితర ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

జల్ జీవన్ మిషన్ కు రూ. వెయ్యి కోట్ల డీపీఆర్‌లు రెడీ 

ఈ వ్యాక్సిన్ అందించే సమయంలో అన్ని పాఠశాలలు,కళాశాలు,విశ్వవిద్యాలయాలు వంటి అన్ని విద్యా సంస్థలు తెరచి ఉంచేలా చూడాలని స్పష్టం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని సిఎస్ లను కేబినెట్ కార్యదర్శి రాజీవ గౌబ ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ కు సంబంధించి 1000 కోట్ల రూ.లకు డిపిఆర్లు సిద్ధం చేసి అవసరమైన అన్ని అనుమతులు ఇచ్చామని ఈ నెలలో ఆ నిధులు కూడా విడుదల చేస్తామని కేబినెట్ కార్యదర్శికి ఏపీ సీఎస్ సమీర్ శర్మ వివరించారు.  

ప్రతీ ఇంటిపైనా జాతీయ జెండా ఎగిరేలా హర్ ఘర్ తిరంగా 

ఈ పధకం కింద 90 లక్షల 60 వేల గృహాలకు మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయనుండగా ఇప్పటికే 39 లక్షల ట్యాప్ లు ఏర్పాటుకు సంబంధించిన పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు.  మరో 30 లక్షలకు చెందినవి టెండర్ల దశలో ఉన్నాయని చెప్పారు.కేంద్ర రాష్ట్ర వాటాలకు అనుగుణంగా బిల్లులు వచ్చిన వెంటనే తగిన నిధులు విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు.  

Published at : 15 Jul 2022 04:34 PM (IST) Tags: AP News Review by CS Sameer Sharma Union Cabinet Secretary

సంబంధిత కథనాలు

Annamayya District News : ఓ నిర్ణయం తీసుకుని ఇంటికి తిరిగి వస్తానని, ఇద్దరు పిల్లలతో వివాహిత సూసైడ్!

Annamayya District News : ఓ నిర్ణయం తీసుకుని ఇంటికి తిరిగి వస్తానని, ఇద్దరు పిల్లలతో వివాహిత సూసైడ్!

విధ్వంసాలకు మారుపేరు జగన్ : అచ్చెన్నాయుడు

విధ్వంసాలకు మారుపేరు జగన్ : అచ్చెన్నాయుడు

CJI Ramana : విజయవాడలో కొత్త కోర్టు భవనాలు - శనివారం ప్రారంభించనున్న సీజేఐ !

CJI Ramana : విజయవాడలో కొత్త కోర్టు భవనాలు - శనివారం ప్రారంభించనున్న సీజేఐ !

రామాంతపూర్ ఘటనతో ఇంటర్‌బోర్డు అలర్ట్‌- కాలేజీలకు కీలక ఆదేశాలు

రామాంతపూర్ ఘటనతో ఇంటర్‌బోర్డు అలర్ట్‌- కాలేజీలకు కీలక ఆదేశాలు

AP Agri Gold : ఏపీలో మళ్లీ అగ్రిగోల్డ్ బాధితుల పోరాటం - సెప్టెంబర్ ఆరో తేదీన అసలు పోరాటం

AP Agri Gold  :   ఏపీలో మళ్లీ అగ్రిగోల్డ్ బాధితుల పోరాటం - సెప్టెంబర్ ఆరో తేదీన అసలు పోరాటం

టాప్ స్టోరీస్

TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

TS Inter Board : హైదరాబాద్ లో  విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?