News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

YS Viveka Case : వివేకా హత్య కేసులో సప్లిమెంటరీ చార్జిషీటు దాఖలు - ముగిసిన సుప్రీం ఇచ్చిన దర్యాప్తు గడువు !

వివేకా హత్య కేసులో సీబీఐ అదనపు చార్జిషీటు దాఖలు చేసింది. సుప్రీంకోర్టు దర్యాప్తు కోసం ఇచ్చిన గడువు ముగిసింది.

FOLLOW US: 
Share:

YS Viveka Case :   మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు రిమాండ్ ను పొడిగించింది. జులై 14 వరకు రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.   కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను పోలీసులు కోర్టులో హాజరు పరిచి చంచల్ గూడ జైలుకు తరలించారు.  విచారణ సందర్భంగా కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను సీబీఐ దాఖలు చేసింది. ఇందులో కీలక వ్యక్తుల పేర్లను సీబీఐ ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.  వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు  30వతేదీతో   ముగుస్తోంది.  గతంలో సుప్రీంకోర్టు  జూన్‌ 30లోగా వివేకా కేసులో పూర్తి వివరాలు బయటపెట్టాలని సీబీఐని ఆదేశించింది.

జూలై 3వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ  

అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. అవినాశ్ తండ్రి భాస్కర రెడ్డి ఈ కేసులో జైల్లో ఉన్నారు. అవినాశ్ కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఒక వేళ అరెస్ట్ చేసే పని అయితే .. వెంటనే బెయిల్ ఇవ్వాలని ఆదేశించింది. ఆ మేరకు సీబీఐ అవినాష్ ని ఓ శనివారం అరెస్ట్ చేసి విడుదల చేశారని తెలుస్తోంది. అవినాష్ రెడ్డికి ముందస్తు  బెయిల్ ఇవ్వటం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. అత్యవసర విచారణ చేయాలని కోరారు. అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఏంటని సుప్రీం ప్రశ్నించింది. ఈ పిటీషన్ ను జూలై 3న విచారణకు నిర్ణయించింది. - 

గడువు పొడిగించాలని సుప్రీంకోర్టును కోరే యోచనలో సీబీఐ 
 
సీబీఐ విచారణ గడువు పొడిగింపు కోరుతూ సుప్రీంకోర్టును అభ్యర్ధించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు సుప్రీంలో పిటీషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. 2019 మార్చిలో వివేకా హత్య జరిగింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణలో అనేక మలుపులు చోటు చేసుకేున్నాయి. అవినాశ్ కేంద్రంగా గత కొద్ది నెలలుగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో హైకోర్టు విచారణ సమయంలో తమకు ఈ ఘటనతో సంబంధం లేదని..ఇదంతా రాజకీయ కుట్రగా అవినాశం వాదించారు. సీబీఐ మాత్రం అవినాశ్ పైన అనేక అభియోగాలు నమోదు చేసింది. ఈ క్రమంలో కేసు విచారణ ముగించటం..సీబీఐ తాజా అభ్యర్ధనతో..సుప్రీం తీసుకొనే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

వివేకా కేసులో కీలక మలుపులు 

వైఎ్ వివేకానందరెడ్డి కేసులో చాలా రోజులుగా కీలక మలుపులు చేసుకుంటున్నాయి. సీఎం జగన్ పేరును కూడా రెండు సార్లు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లలో సీబీఐ ప్రస్తావించింది.  హత్య జరిగిందని బయట ప్రపంచానికి తెలియక ముందే సీఎం జగన్ కు తెలుసని చెబుతున్నారు. ఈ క్రమంలో దర్యాప్తు గడువు పొడిగించాలని సీబీఐ కోరితే.. హత్యలో విస్తృత కుట్ర కోణం గురించి  దర్యాప్తు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.  

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 30 Jun 2023 01:05 PM (IST) Tags: CBI Court Viveka murder case CBI investigation additional charge sheet in Viveka case

ఇవి కూడా చూడండి

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Chandrababu Arrest: చంద్రబాబు ఓ క్రిమినల్, అందుకే అరెస్ట్ చేశారు - స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

Chandrababu Arrest: చంద్రబాబు ఓ క్రిమినల్, అందుకే అరెస్ట్ చేశారు - స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

Devineni Uma: అవినీతిపరుడు రాజ్యమేలితే, చంద్రబాబు లాంటి నిజాయితీపరులు జైలులో ఉంటారు : దేవినేని ఉమా

Devineni Uma: అవినీతిపరుడు రాజ్యమేలితే, చంద్రబాబు లాంటి నిజాయితీపరులు జైలులో ఉంటారు : దేవినేని ఉమా

Top Headlines Today: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించాలన్న మంత్రి కాకాణి - పాలమూరుకు విచ్చేసిన ప్రధాని మోదీ

Top Headlines Today: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించాలన్న మంత్రి కాకాణి - పాలమూరుకు విచ్చేసిన ప్రధాని మోదీ

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

KTR about Balka Suman: బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే బాల్క సుమన్‌ మంత్రి అవుతారా? మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలకు అర్థమేంటి!

KTR about Balka Suman: బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే బాల్క సుమన్‌ మంత్రి అవుతారా? మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలకు అర్థమేంటి!

'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!

'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!

అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!

అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!

PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

PM Modi In Mahabubnagar:  తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన