News
News
X

TTD: తిరుమలలో దళారులపై కేసు నమోదు.. టికెట్లను ఎంతకు విక్రయించారో తెలుసా?

తిరుమలలో దళారులపై కేసు నమోదైంది. భక్తులకు అక్రమంగా టికెట్లను విక్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

FOLLOW US: 

శ్రీవారి రూ.300 దర్శన టికెట్లను ట్రావెల్‌ ఏజెంట్లకు అక్రమంగా విక్రయించిన దళారులపై కేసు నమోదు చేశారు. ఏడు సుపథం టికెట్లను దళారులు 35 వేల రూపాయలకు విక్రయించినట్లు తెలిసంది. ఈ వ్యవహారంలో టీటీడీ ఉద్యోగితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. దళారులు ఈ నెల 23న దర్శన టికెట్లను ట్రావెల్‌ ఏజెంట్లకు విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. టోకెన్ల తనిఖీ సమయంలో అనుమానం రావడంతో విజిలెన్స్‌ అధికారులు విచారణ జరపగా.. బయటకు వచ్చింది.

బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు

వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారయ్యాయి. అక్టోబర్‌ 7వ తేదీ నుంచి 15 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు తెలిపింది. కరోనా నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఏడాది కూడా ఏకాంతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు అక్టోబర్‌ 5న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని జరపనున్నట్లు వెల్లడించింది. 

News Reels

 • 06-10-2021: అంకురార్పణ
 • 07-10-2021: ధ్వజారోహణం, పెద్దశేష వాహనసేవ
 • 08-10-2021: చిన్నశేష వాహ‌నసేవ, హంస వాహనసేవ
 • 09-10-2021: సింహ వాహ‌న సేవ, ముత్యపుపందిరి వాహ‌న సేవ
 • 10-10-2021: క‌ల్పవృక్ష వాహ‌నసేవ, సర్వభూపాల వాహనసేవ
 • 11-10-2021: మోహినీ అవ‌తారం, గ‌రుడ‌ వాహనసేవ‌
 • 12-10-2021: హ‌నుమంత వాహ‌నసేవ, గ‌జ వాహ‌నసేవ
 • 13-10-2021: సూర్యప్రభ వాహ‌నసేవ, చంద్రప్రభ వాహ‌నసేవ
 • 14-10-2021: రథోత్సవానికి బ‌దులుగా సర్వభూపాల వాహనసేవ, అశ్వ వాహ‌నసేవ
 • 15-10-2021: ప‌ల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం

నడక దారి పనులు పూర్తి
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం నిర్మిస్తున్న నడక దారి పైకప్పు పనులు దాదాపు పూర్తయ్యాయని టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల‌లో అలిపిరి కాలినడక మార్గం నుంచి భ‌క్తుల‌ను అనుమ‌తి ఇస్తున్నట్టు పేర్కొన్నారు.  దాత‌ల‌ స‌హ‌కారంతో ఈ పనులు జరిపినట్లు వెల్లడించారు. ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యం నుంచి నామాల గోపురం వ‌ర‌కు నిర్మించిన పైక‌ప్పును, మార్గ మ‌ధ్యలో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌నూ జవహర్ రెడ్డి ప‌రిశీలించారు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Also Read: AP Letter TO GRMB: తెలంగాణ చెబుతున్నవన్నీ అబద్ధాలే.. డీపీఆర్‌లను ఆమోదించొద్దు.. జీఆర్ఎంబీకి ఏపీ లేఖ

Also Read: Weather Update: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం

Published at : 30 Sep 2021 12:25 PM (IST) Tags: ttd Mediators Fraud In TTD TTD Darshan Tickets Fraud Case on TTD Tickets Issue

సంబంధిత కథనాలు

Weather Latest Update: త్వరలో మరో అల్పపీడనం, మరి ఏపీలో వర్షాలుంటాయా? ఈ జిల్లాల్లో విపరీత చలి!

Weather Latest Update: త్వరలో మరో అల్పపీడనం, మరి ఏపీలో వర్షాలుంటాయా? ఈ జిల్లాల్లో విపరీత చలి!

సుప్రీం కోర్టు తీర్పుతో వైసీపీలో జోష్‌- స్వాగతించిన నేతలు, మంత్రులు

సుప్రీం కోర్టు తీర్పుతో వైసీపీలో జోష్‌- స్వాగతించిన నేతలు, మంత్రులు

Petrol-Diesel Price, 29 November 2022: డీజిల్‌ కొట్టించాలంటే మాత్రం ఈ జిల్లాల్లో బెటర్!

Petrol-Diesel Price, 29 November 2022: డీజిల్‌ కొట్టించాలంటే మాత్రం ఈ జిల్లాల్లో బెటర్!

Gold-Silver Price 29 November 2022: 53వేల రూపాయల కంటే దిగువకు బంగారం- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే!

Gold-Silver Price 29 November 2022: 53వేల రూపాయల కంటే దిగువకు బంగారం- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే!

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

టాప్ స్టోరీస్

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?

Men Suicide: పాపం మగ మహారాజులు - కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపించి ఏడ్వనివ్వండి !

Men Suicide: పాపం మగ మహారాజులు - కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపించి ఏడ్వనివ్వండి !