News
News
వీడియోలు ఆటలు
X

Bopparaju Venkateshwarlu: ఏపీ ఉద్యోగల డిమాండ్లు తీర్చేదాకా ఇక నిరసనలే, బొప్పరాజు వార్నింగ్

ఈనెల 27, 28వ తేదీల్లో ఏలూరు, గుంటూరులో ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

FOLLOW US: 
Share:

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు తాము ఉద్యమాన్ని ఆపబోమని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తేల్చి చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై గత 70 రోజులుగా ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో పోరాడుతున్నామని అన్నారు. ఉద్యోగులకు బకాయి పడ్డ రూ.కోట్ల జీతాలను ప్రభుత్వం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 27, 28వ తేదీల్లో ఏలూరు, గుంటూరులో ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఈ నెల 24న మహాసభలు నిర్వహించనుంది. ఈ 27వ మహాసభల పోస్టర్లను బొప్పరాజు వెంకటేశ్వర్లు రెండు రోజుల క్రితమే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో నాలుగోదశ ఉద్యమానికి సిద్ధం అవుతున్నామని వెల్లడించారు. ప్రస్తుతం మూడో దశ ఉద్యమం నడుస్తోందని చెప్పారు. ఈ నెల 27న ఏలూరులో ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నామని, ఈ సదస్సుకు ఉద్యోగులు తరలి రావాలని బొప్పరాజు పిలుపునిచ్చారు. తాము ఉద్యమం కొనసాగిస్తుండడం వల్లే ప్రభుత్వం స్పందిస్తోందని, తమ డిమాండ్లు న్యాయమైనవి కాబట్టే ప్రభుత్వం ముందుకు వస్తోందని స్పష్టం చేశారు. పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, మిగతా డిమాండ్లపైనా చర్చ జరగాలని, సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఉద్యమం కొనసాగిస్తామని బొప్పరాజు వివరించారు. డీఏ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారన్నది ప్రభుత్వం లిఖితపూర్వకంగా వెల్లడించాల్సిందేనని అన్నారు.

ఏపీజీఈఏ కూడా ఉద్యమ బాట
ఉద్యోగులు, పెన్షనర్లు సహా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) సోమవారం నుంచి ఉద్యమాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా తాలూకా కేంద్రాల్లో ఏపీజీఈఏ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేశారు. తొలి విడతగా 26 జిల్లాల్లోని 40 తాలూకా కేంద్రాల్లో వారు దీక్షలు చేపట్టారు. సీపీఎస్‌ రద్దు చేయాలని, ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, పెండింగ్‌ డీఏలు, వాటి బకాయిలు విడుదల చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు. ఏపీజీఈఏ సమర్పించిన 160 డిమాండ్‌లను వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణ, అస్కారరావు చెప్పారు. జూన్‌ 7 తేదీ వరకు అన్ని తాలూకాల్లో రోజువారీ నిరసన దీక్షలు, రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని తెలిపారు. జూన్‌ 8 నుంచి మలి దశ ఆందోళనలు చేపడతామని తెలిపారు.

రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికల సమయం ఆసన్నమైంది కానీ, గత ఎన్నికలకు ముందు పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఇప్పుడు నెరవేర్చే  పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా వారు దాచుకున్న సొమ్మే ప్రభుత్వం వాడేసుకోడం ఏంటని ప్రశ్నించారు. పీఆర్సీ సహా చాలా సమస్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. వాటి పరిష్కారం కోసం దశల వారీ ఉద్యమానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిలుపు ఇచ్చిందని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సహా వేర్వేరు శాఖల ఉద్యోగులు తమ ఉద్యమ కార్యాచరణలో పాల్గొంటారని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదని, సమ్మె తప్ప తమకు మరో మార్గం లేదని తెలిపారు.

Published at : 23 May 2023 06:34 PM (IST) Tags: AP government Bopparaju Venkateshwarlu AP Secretariat AP Employees issues

సంబంధిత కథనాలు

Lokesh Rayalaseema Declaration :  రాయలసీమ అభివృద్ధికి టీడీపీ డిక్లరేషన్ - అవన్నీ చేస్తే  రత్నాల సీమే !

Lokesh Rayalaseema Declaration : రాయలసీమ అభివృద్ధికి టీడీపీ డిక్లరేషన్ - అవన్నీ చేస్తే రత్నాల సీమే !

Lady VRO: చేతిలో పిల్లాడు ఉన్నా అక్రమ మైనింగ్‌ను అడ్డుకుని మహిళా వీఆర్వో సాహసం

Lady VRO: చేతిలో పిల్లాడు ఉన్నా అక్రమ మైనింగ్‌ను అడ్డుకుని మహిళా వీఆర్వో సాహసం

Guntur: అరిష్టం పోగొట్టుకోడానికి గురూజీ దగ్గరికి మహిళ, శిష్యుల పాడు పని! పోలీసులకు ఫిర్యాదు

Guntur: అరిష్టం పోగొట్టుకోడానికి గురూజీ దగ్గరికి మహిళ, శిష్యుల పాడు పని! పోలీసులకు ఫిర్యాదు

Nellore: మూగ యువతిపై ముగ్గురు అత్యాచారయత్నం! తెలివిగా స్పందించి తప్పించుకున్న బాధితురాలు

Nellore: మూగ యువతిపై ముగ్గురు అత్యాచారయత్నం! తెలివిగా స్పందించి తప్పించుకున్న బాధితురాలు

Udayagiri Treasure Mystery: చారిత్రక కోట ఉదయ'గిరి' గుప్తనిధుల కోసం ప్రాణాలు బలి!

Udayagiri Treasure Mystery: చారిత్రక కోట ఉదయ'గిరి' గుప్తనిధుల కోసం ప్రాణాలు బలి!

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!

IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!