అన్వేషించండి

Punganoor Tension: పుంగనూరులో చంద్రబాబు పర్యటనకు ముందు తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు! పోలీసుల లాఠీచార్జ్

చంద్రబాబు పర్యటనకు ముందు పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఇరు వర్గాలపై లాఠీ చార్జ్ చేశారు.

 

Punganoor Tension: అన్నమయ్య జిల్లా పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రాజెక్టుల యాత్రకు వస్తున్న సందర్భంగా అడ్డుకునేందుకు వైఎస్ఆర్‌సీపీ నేతలు చేస్తున్న  ప్రయత్నాల్లోఉద్రిక్తత ఏర్పడింది.  అంగళ్లు గ్రామంలో  పరిస్థితి అదుపు తప్పింది.  రణరంగంలా మారిన అంగళ్లు గ్రామంలో   టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు.   చంద్రబాబుకు స్వాగతం పలకడానికి వెళ్తున్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు.  పోలీసుల సమక్షంలోనే వైసీపీ కార్యకర్తల దాడులు చేశారు. టీడీపీ కార్యకర్తలు తిరగబడటంతో.. ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు.  

పుంగనూరులో ప్రాజెక్టులపై స్టే తెచ్చారని వైసీపీ నేతల విమర్శలు                            

పుంగనూరులో రెండు నీటి ప్రాజక్టులపై కోర్టు స్టే తెచ్చి నిలిపివేశారని.. అభివృద్ధి చేస్తే ఏమాత్రం సహించలేక ఇలాంటి పనులు చేశారని అందుకే చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని వైసీపీ కార్యకర్తలు ప్రకటించారు.  చంద్రబాబు గో బ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ రోడ్లపై పెద్ద ఎత్తున గుమికూడారారు.  పుంగనూరులో ప్రాజెక్టులు నిలిచిపోవడామికి కారణమైన చంద్రబాబును ఎట్టి పరిస్థితులలో ఇక్కడ అడుగుపెట్టినివ్వమని హెచ్చరించారు.  పెద్దిరెడ్డి అరాచకాలకు, అవినీతి ప్రతీక ఆ ప్రాజెక్టులు అందుకే అడ్డుకుని రైతులకు న్యాయం చేశామని.. రైతులకు పరిహారం ఇవ్వకుండా.. పెద్దిరెడ్డి దోచుకున్నారని మండిపడుతున్నారు. 

ధైర్యం ఉంటే తన ముందుకు రావాలని వైసీపీ నేతలకు చంద్రబాబు సవాల్                         

ప్రతిపక్ష నాయకుడి పర్యటనను అడ్డుకుంటామని వైసీపీనేతలు రోడ్డుపైకి పోలీసులు వారికే వత్తాసు పలుకుతున్నరాని.. టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ నాయకుల  దౌర్జన్యంకు భయపడే పరిస్థితి లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. బంబులతోనే పోరాడిన వ్యక్తి నేను.. రాళ్ళు వేస్తే భయపడతానా..అని ప్రశ్నించారు. ధైర్యం ఉంటే తన ముందుకు రావాలని సవాల్ చేశారు. తాను  కూడా  నేను చిత్తూరు జిల్లాలోనే పుట్టా.. చిత్తూరు జిల్లాలోనే రాజకీయం చేశానన్నారు.  జగన్ లాంటి రాజకీయాలు నేను ఎప్పుడూ చూడలేదని  విమర్శించారు. 

పుంగనూరులో ప్రతిపక్ష నేతలపై తరచూ దాడులు                              

పుంగనూరులో ఎ ప్రతిపక్ష పార్టీ నేత పర్యటించేందుకు  ప్రయత్నించినా ఇదే పరిస్థితి ఉంటుంది. చివరికి ఇటీవలే కొత్త పార్టీ  పెట్టుకున్న రామచంద్ర యాదవ్ అనే నేత తన అనుచరులతో ర్యాలీ నిర్వహించినా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఇంటిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున దాడి చేశారు. నష్టం చేశారు. ఇలాంటి దాడులు ప్రతిపక్ష నేతలపై పుంగనూరులో తరచూ జరుగుతూ ఉంటాయి. ఈ సారి చంద్రబాబు పర్యటననే అడ్డుకునేందుకు ఉద్రిక్తతలు సృష్టించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున భద్రత చేపడుతున్నామని పోలీసులు ప్రకటిస్తారు కానీ ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి.             

టాప్ హెడ్ లైన్స్

Perni Nani Avigan: అవిగన్ రాజకీయం - వైఎస్‌ఆర్‌సీపీ మావిగన్‌పై మళ్లీ రూటు మార్చిందా?
అవిగన్ రాజకీయం - వైఎస్‌ఆర్‌సీపీ మావిగన్‌పై మళ్లీ రూటు మార్చిందా?
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
Embed widget