Badvel By Election: బద్వేల్ లో ప్రశాంతంగా పోలింగ్... దొంగ ఓట్లు వేస్తున్నారని బీజేపీ ఆరోపణ... అవాస్తమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటన
బద్వేల్ లో ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుందని ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ తెలిపారు. దొంగ ఓట్లు వేస్తున్నారన్న వార్తలు అవాస్తవమన్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్ని పేర్కొన్నారు.
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ తెలిపారు. బద్వేల్ ఉప ఎన్నికను ఆయన వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. 281 పోలింగ్ కేంద్రాల్లోనూ ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ప్రకటించారు. ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. మూడు చోట్ల మాక్ పోలింగ్‌లో ఈవీఎంలో సమస్య వచ్చిందని, వాటిని పరిష్కరించామన్నారు. ఎక్కడా పోలింగ్ నిలిచిపోలేదన్నారు. దొంగ ఓట్లు వేస్తున్నారని, ఇతర ప్రాంతాల వ్యక్తులు ఓట్లు వేసేందుకు వస్తున్నారన్న వార్తలు అవాస్తవమని తేల్చి చెప్పారు. ఇప్పటివరకు అలాంటి ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి అందలేదని విజయానంద్ పేర్కొన్నారు.
#BadvelByPoll లోబద్వేలు మునిసిపాలిటీ ఉర్దూ పాఠశాల పోలింగ్ బూత్ నెం. 158,159 లోని ఏజెంటును బయటకు పంపగా,ఎందుకు పంపించారని ఒక పేరులేని “ ప్రేక్షక ” భటుడికి చెప్పగా, అడ్డు తగులుతావా అంటూ చొక్కా పట్టుకుని లాక్కెళ్ళిన ప్రేక్షక భటులు.@ECISVEEP @dgpapofficial #BadvelByPollComplaints pic.twitter.com/MgOE7dvcYs
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) October 30, 2021
Also Read: ప్రశాంతమైన కుప్పంలో రౌడీ రాజ్యం .. ఓటుతో బుద్ది చెప్పాలని చంద్రబాబు పిలుపు !
.@YSRCParty నాయకులు చేస్తున్న అరాచకాలపై అధికారులందరికీ పదే పదే ఫిర్యాదు చేసినప్పటికీ,చేస్తామన్న మాటలే కానీ,చర్యలుతీసుకుని ప్రజలలో విశ్వాసాన్ని నింపిన దాఖలాలు లేవు.
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) October 30, 2021
ఇప్పటివరకు మాఏజెంట్లను దాదాపు 30 బూతులలో ప్రేక్షకభటుల సహకారంతో బయటకు పంపడం దీనికి నిదర్శనం.#BadvelByPollComplaints pic.twitter.com/HdD1JTn22i
బీజేపీ ఏజెంట్లను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు : సీఎం రమేశ్
బద్వేల్ ఉప ఎన్నికలో మధ్యాహ్నం 3 గంటల వరకు 44.82 శాతం పోలింగ్ నమోదయ్యింది. బద్వేలు పరిధిలో బీజేపీ ఏజెంట్లను ఇబ్బంది పెడుతున్నారని ఎంపీ సీ.ఎం.రమేశ్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో దొంగలు, పోలీసులు ఒక్కటయ్యారని ఆరోపించారు. కేంద్ర బలగాలు కాకుండా స్థానిక పోలీసులను పోలింగ్ బూత్ ల్లో ఉంచుతున్నారని ఆరోపించారు. పోరుమామిళ్లలో బయటి వ్యక్తులు మోహరించారన్నారు. బద్వేల్ లో పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు పెద్ద తేడా ఏమీ లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ కార్యకర్తల కంటే ఘోరంగా పోలీసుల తీరు ఉందని ఆరోపించారు. తిరుపతి ఉపఎన్నికల్లో ఎలా దొంగ ఓట్లు వేశారో బద్వేలులో కూడా అదే సీన్ పునరావృతం అవుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే గోవిందరెడ్డి హౌస్ అరెస్టు చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. దొంగ ఓట్లతో గెలిచేది ఓ గెలుపేనా అని ప్రశ్నించారు. పోలీసులే దొంగ ఓట్లను ప్రోత్సహించడం సరికాదన్నారు. మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డిని ఎందుకు అన్ని మండలాల్లో తిరగడానికి పోలీసులు అనుమతిస్తున్నారని ప్రశ్నించారు.
#BadvelByPollComplaints https://t.co/SjJ3qeaO2C
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) October 30, 2021
Also Read: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మెగా జాబ్ మేళా... ప్రారంభించిన మంత్రి గౌతమ్ రెడ్డి...
బయటి వ్యక్తులు ఓట్లు వేస్తున్నారు : బీజేపీ అభ్యర్థి సురేశ్
బద్వేల్ లో పెద్ద ఎత్తున బయటి వ్యక్తులు వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారని బీజేపీ అభ్యర్థి సురేశ్ ఆరోపించారు. దీనిపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇతర నేతలు ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. స్థానికులు ఇతర ప్రాంతాల నుంచి వారిని అడ్డుకున్నారని చెప్పారు. చాలా చోట్ల స్థానికలు ఓట్లు జాబితాల్లో కనిపించడంలేదన్నారు. వీటిపై ప్రశ్నిస్తుంటే అధికారులు సమాధానం చెప్పడంలేదన్నారు.
Also Read: మధ్యాహ్నం 3 గంటల వరకు హుజూరాబాద్ లో 61.66 శాతం, బద్వేలులో 44.82శాతం పోలింగ్ నమోదు