Ayyanna : జనసేనతో పొత్తు కోసం త్యాగానికి రెడీ - పోలీసుల తీరుపై అయ్యన్న కీలక వ్యాఖ్యలు !
నిరసన చేపట్టకుండా హౌస్ అరెస్ట్ చేయడంతో అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. ప్రజలకు కాపలా కాయాలని సూచించారు.
Ayyanna : దొంగలకు కాదని ప్రజలకు కాపలా కాయాలని పోలీసులకు టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు సలహా ఇచ్చారు. చంద్రబాబు అరెస్టునకు వ్యతిరేకంగా నిరసన చేయాలనుకున్న అయ్యన్న పాత్రుడిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు ని తప్పు అని చెప్పే బాధ్యత మనకి లేదా అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయం లో పూర్తిగా సపోర్ట్ చేశామని.. పోలీస్ బందోబస్తు సరిగ్గా ఉండాలని.. రోడ్లను రిపేర్ చేయాలని చంద్రబాబు చెప్పేవారన్నారు. హౌజ్ అరెస్టు ఎందుకు చేస్తున్నరు అంటే సమాధానం లేదని.. హౌజ్ అరెస్ట్ చేసే ముందు నోటీస్ ఇవ్వాలి ఈ విషయము పోలీస్ అధికారులకి తెలియదా అని ప్రశ్నించారు.
మేము సంఘ విద్రోహ శక్తులమా.. ప్రభుత్వము అంటే ప్రజలు కదా అని అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. రోడ్ మీద ధర్నా చేయకూడదా... గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుప కూడదా పోలీసులు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. దొంగ కి కాపలా కాస్తున్నారు... ప్రజలకు కాపలా కాయండని సూచింారు. పోలీస్ లు దాచుకున్న పి ఎఫ్ డబ్బులూ కూడ కొట్టేశాడు జగన్ మోహన్ రెడ్డి అని ఆరోపించారు. చంద్ర బాబు నాయుడు అరెస్టు లో న్యాయం వుందా? అన్యాయంగా అరెస్ట్ చేశారా అనే విషయం ప్రజలకి తెలపాలన్నారు.
మఇంజనీరింగ్ కాలేజీ లు చాలా తక్కువగా వున్న సమయమ లో ఒకేసారి 160 కాలేజ్ లు పెట్టారు . ఎన్ టి ఆర్ టైం లో జిల్లాకు మూడు పాలిటెక్నిక్ కళాశాల లు ఏర్పాటు చేశామన్నారు. మన విద్యార్థులు వరుసగా ఇంటర్యూల్లో ఫెయిల్ అవుతూంటే గుజరాత్ కు ఒక టీమ్ ని పంపి అక్కడ నైపుణ్య అభివృద్ధి సంస్థలు స్టడీ చేసి ఏపీ లో కూడ పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నారని అయ్యన్న తెలిపారు. ఇడుపుల పాయ లో కూడా సీమెన్స్ స్కీమ్ ఉందన్నారు.
270 కోట్లు రూపాయి లు చంద్ర బాబు నాయుడు తినేశారు అనడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు. చంద్ర బాబు నాయుడు ఒక్కటే చెప్పారు. బెయిల్ వద్దు.. కేసు తప్పుడు కేసు అన్న తర్వాతే బయటికి వస్తానన్నారు. తాను నిర్దోషి అని కోర్ట్ చెప్పేవరకు జైల్ లో వుంటానని చెప్పారన్నారు. తనను కృష్ణా జిల్లా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అనే ప్రశ్నలు వేశారని.. జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక నేరస్తుడు అన్నానని.. ఆ మాట చెప్పింది సీబీఐ వాళ్లేనన్నారు. రాజమహేంద్ర వరం అని పలకడం రాదు మరి నత్తి పకోడి అనక ఏమమంటారన్నారు. రోజా సహా అందరిపై తాను అన్న మాటలకు కట్టుబడి ఉంటానన్నారు.
పార్టీ కోసం నేను చావడానికి సిధ్ధమని అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. కార్య కర్తలు నిలబెట్టుకున్న పార్టీ టీడీపీ అన్నారు. లోకేష్, చంద్ర బాబు నాయుడు కి ప్రజా ఆదరణ పెరుగుతుంది అని మాత్రమే అరెస్ట్ చేశారని.. లోకేష్ ను ఎయిర్ పోర్టులోనే అరెస్టు చేయడానికి ఏర్పాట్లు చేశారని.. ఆయన కూడా రెడీ అయ్యారన్నారు. బ్రాహ్మణి నాయకత్వంలో పార్టీని ముందుకు తీసుకెళ్తామన్నారు. విశాఖలో 72వేల కోట్ల విలువైనభూముల్ని బెదిరించి రాయించుకున్నారని.. మద్య నిషేధం అని చెప్పి.. వేల కోట్లు అప్పు తెచ్చారని మండిపడ్డారు. ఫైబర్ నెట్ ప్రాజెక్టు ద్వారా 149కే ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తే ఇప్పుడు 350 వసూలు చేస్తూ.. స్కాం అందని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే బెంగుళూర్ హైదరా బాద్, తాడేపల్లి, ఇడుపుల పాయ లో వున్న ప్యాలెస్ లు చాలక వైజాగ్ రుషి కొండ మీద ప్యాలెస్ ఎదుకని.. వీటన్నిటి పై ప్రజలు ఆలోచన చేయాలని అయ్యన్న పిలుపునిచ్చారరు.
జనసేనతో పొత్తు లోక కల్యాణం కోసమన్నారు. రావణాసురుడి కి రాజకీయ సమాధి కట్టాల్సి ఉందని.. అవసరం అయితే తన నర్సీపట్నం సీట్ వదులుకునేందుకు సిద్ధమని అయ్యన్న పాత్రుడు ప్రకటించారు.