Mansas Trust: మాన్సాస్ ట్రస్టు వారసత్వం వివాదంలో అశోక్‌గజపతిరాజుకు రిలీఫ్.. అనుబంధ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్‌గా ఆశోక్ గజపతి రాజునే కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌ను కొత్తగా నియమించాలని కోరుతూ పిటిషన్ దాఖలు కాగా.. దానికి హైకోర్టు అంగీకరించలేదు.
మాన్సాస్ ట్రస్ట్ వారసత్వంపై ఊర్మిళా గజపతిరాజు దాఖలు చేసిన పిటిషన్ ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఆ ట్రస్ట్ విషయంలో కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్‌గా ఆశోక్ గజపతి రాజునే కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా తమను నియమించాలని కోరుతూ ఊర్మిళా గజపతి రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సైతం హైకోర్టు అంగీకరించలేదు.
ప్రస్తుతం ట్రస్ట్ ఛైర్మన్‌గా ఉన్న అశోక్ గజపతి రాజును తొలగించి, తనను ఛైర్మన్‌గా నియమించాలని కోరుతూ అశోక్ గజపతి రాజు సోదరుడైన ఆనంద గజపతి రాజు రెండో భార్య కుమార్తె ఊర్మిళ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆనంద గజపతి రాజు మొదటి భార్య కుమార్తె అయిన సంచయిత, రెండో భార్య కుమార్తె ఊర్మిళ గజపతి రాజును వారసులుగా గుర్తించింది. ఈ విషయాన్ని ఆమె కోర్టుకు విన్నవించారు. సంచయిత ఛైర్మన్ కాని పక్షంలో తనను ఛైర్మన్‌గా నియమించాలని ఊర్మిళ కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై సోమవారం వాదనలు విన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.
ASLO READ:కర్నూలుకు హైకోర్టు... కేంద్ర న్యాయమంత్రికి విజయసాయి లేఖ..!
దీనిపై మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతి రాజు ఘాటుగా స్పందించారు. కోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ ట్రస్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతిగా జోక్యం చేసుకుంటుందని ఆరోపించారు. ఇష్టానుసారంగా నియామకాలు చేపట్టి గౌరవ ప్రథమైన ట్రస్టు ప్రతిష్టను దెబ్బతీసిందన్నారు. ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నా... ప్రభుత్వం తన బుద్ది మార్చుకోవడం లేదని విమర్శించారు. హైకోర్టు ఆదేశించినా ఈవో ఇప్పటి వరకు తనను కలవలేదని...తన సూచనలు కూడా పట్టించుకోవడం లేదని వాపోయారు.
ASLO READ: ఏపీలో ఐదు.. తెలంగాణలో సున్నా..! రెండేళ్లలో పేదలకు కట్టిచ్చిన ఇళ్లపై కేంద్రం రిపోర్ట్...!
ASLO READ: నాగ పూజ మూఢనమ్మకమా… పూజించవలసింది నాగులనా-దేవతాసర్పాలనా- పాములనా… ఏం చేయాలి…ఏం చేస్తున్నాం…
ఈ సందర్భంగా సంచయితపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమె చేసింది తక్కువ హడావుడి ఎక్కువ అంటూ సెటైర్లు వేశారు. ప్రస్టేజ్‌కు పోయి ట్రస్టు నిధులు దుర్వినియోగం చేశారని తెలిపారు. కోటి రుపాయలు ఖర్చు చేసి కార్లు కొన్నారని.. ఇవన్నీ బయటకు రావాలని ఆశించారు. ప్రభుత్వం చేపడుతున్న ఆందోళనపై తనకు ఎలాంటి ఆందోళన లేదని నిష్పక్షపాతంగా విచారణ సాగలని మాత్రమే కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.