News
News
X

Vijaysaireddy letter to rijuju : కర్నూలుకు హైకోర్టు... కేంద్ర న్యాయమంత్రికి విజయసాయి లేఖ..!

కర్నూలుకు హైకోర్టు తరలింపుతో పాటు రైతుల కోసం కమిషన్, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు కోరుతూ న్యాయమంత్రి కిరణ్ రిజుజుకు విజయసాయిరెడ్డి లేఖ రాశారు.

FOLLOW US: 

కర్నూలు జిల్లాకు న్యాయరాజధాని తరలింపుపై కేంద్రంలో కొత్తగా న్యాయశాఖ బాధ్యతలు తీసుకున్న కిరణ్ రిజుజుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మూడు రాజధానులు పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని.. ఈ మేరకు కర్నూలులో న్యాయరాజధానిని ఖరారు చేశామని హైకోర్టుకు అక్కడకు వీలైనంత త్వరగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కర్నూలులో నేషనల్ లా యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టును కర్నూలుకు తరలించాలని నిర్ణయించినందున హైకోర్టు ఎక్కడ ఉంటే... జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం కూడా అక్కడ ఉండటం సబబని అందుకే కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరారు. అదే సమయంలో నేషనల్ జ్యూడిషియల్ అకాడెమీని కూడా కర్నూలులో ఏర్పాటు చేయాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతానికి దేశం మొత్తం మీద మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మాత్రమే ఉందని.. అందు వల్ల రెండో దాన్ని ఏర్పాటు చేయాలని.. దాన్ని కర్నూలులోనే పెట్టాలని కోరారు. ఇలా చేయడం వల్ల భోపాల్ క్యాంపస్ మీద భారం తగ్గుతుందన్నారు. 

ఈ లేఖలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఉన్నట్లే రైతుల కోసం కూడా ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలని విజయసాయిరెడ్డి కేంద్ర న్యాయమంత్రి కిరణ్ రిజుజును కోరారు. దేశంలో నలభై శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉన్నారని కానీ వారిపై  సరైన హక్కులు అందడం లేదని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై రాజ్యసభలో తాను 2019లోనే ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశ పెట్టానని గుర్తు చేశారు. ప్రస్తుతానికి ఇది రాజ్యసభలో పెండింగ్‌లో ఉందన్నారు. ఈ బిల్లును రూపొందించడానికి ప్రత్యేకంగా రాజ్యాంగసవరణ బిల్లును ప్రవేశపెట్టాలని విజయసాయిరెడ్డి కోరారు. 

అలాగే లేఖలో మొదటి పాయింట్‌గా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మార్చాలనికోరారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ప్రకారం.. ఓ పార్టీపై గెలిచిన వ్యక్తి పార్టీ ఫిరాయిస్తే అనర్హతా వేటు వేయాలని ఉందని.. అయితే ఆ వేటు వేయడానికి టైమ్ ఫ్రేమ్ లేకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. గతంలో సుప్రీంకోర్టు మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సూచనలు చేసిందని లేఖలో గుర్తు చేశారు. అయితే చట్టంలో అలాంటి టైమ్ ఫ్రేమ్ లేనందున చాలా సందర్భాల్లో అనర్హతా వేటుపై నిర్ణయం తీసుకోవడం లేదని దీని వల్ల పార్టీ ఫిరాయింపుల చట్టం ఉద్దేశం దెబ్బతింటోందన్నారు. అందుకే ప్రత్యేకంగా రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును టార్గెట్ చేసుకుని ఈ అంశాన్ని కేంద్ర న్యాయమంత్రికి రాసిన లేఖలో విజయసాయిరెడ్డి ప్రధానంగా ప్రస్తావించినట్లుగా భావిస్తున్నారు. 

Published at : 11 Aug 2021 06:08 PM (IST) Tags: YSRCP kiran rijuju highcourt vijaysaireddy kurnool law capital ysrcp letter raghuram krishna raju

సంబంధిత కథనాలు

Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!

Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!

Nellore Fish Curry Recipe : నెల్లూరు చేపల పులుసు, ఎందుకంత ఫేమస్?

Nellore Fish Curry Recipe : నెల్లూరు చేపల పులుసు, ఎందుకంత ఫేమస్?

Governor At Home : రాజ్ భవన్ ఎట్ హోమ్ కు సీఎం కేసీఆర్ గైర్హాజరు, ఆఖరి నిమిషంలో రద్దు

Governor At Home : రాజ్ భవన్ ఎట్ హోమ్ కు సీఎం కేసీఆర్ గైర్హాజరు, ఆఖరి నిమిషంలో రద్దు

Breaking News Telugu Live Updates: కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి 

Breaking News Telugu Live Updates: కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి 

Guntur Accident : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు మృతి

Guntur Accident : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు మృతి

టాప్ స్టోరీస్

Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Tummmala Nageswararao :  హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

Dogfishing : అమ్మాయిలతో డేటింగ్‌కు కుక్క పిల్ల రికమండేషన్

Dogfishing : అమ్మాయిలతో డేటింగ్‌కు కుక్క పిల్ల రికమండేషన్