Pawan Kalyan Mahila Commision : పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ షాక్ - క్షమాపణ చెప్పాలని నోటీస్ !
పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మూడు పెళ్లిళ్లపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Pawan Kalyan Mahila Commision : జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైఎస్ఆర్‌సీపీ నేతలు, సీఎం జగన్ చేస్తున్న విమర్శల పరంపరలోకి తాజాగా ఏపీ మహిళా కమిషన్ వచ్చింది. పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నోటీసులు జారీచేసింది. మూడు పెళ్లిళ్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఏపీ మహిళా కమిషన్ నోటీసుల్లో పేర్కొంది. భరణమిస్తే భార్యను వదిలించుకోవచ్చనే సందేశమిచ్చేలా పవన్ కల్యాణ్ మాటలున్నాయని పే... రూ. కోట్లు, రూ. లక్షలు, రూ. వేలు ఎవరి స్థాయిలో వారు భరణం ఇచ్చి భార్యను వదిలించుకుంటూ పోతే మహిళలకు భద్రత ఉంటుందా అని మహిళా కమిషన్ నోటీసుల్లో ప్రశ్నించింది. మహిళలను ఉద్దేశించి స్టెపినీ అనే పదం పవన్ కల్యాణ్ ఉపయోగించడం ఆక్షేపణీయం అని పేర్కొంది. చేతనైతే మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న వ్యాఖ్యలను పవన్ వెనక్కి తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. మహిళా లోకానికి పవన్ కల్యాణ్ తక్షణం క్షమాపణ చెప్పాలన్నారు.
మూడు పెళ్లిళ్లపై పవన్ అసలు ఏమన్నారంటే ?
వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎప్పుడు చూసినా మూడు పెళ్లిళ్ల గురించి విమర్శలు చేస్తూంటారు. ఈ క్రమంలో వారికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. 'నేను 3 పెళ్లిళ్లు చేసుకున్నానని వారు అసూయ పడుతున్నట్లున్నారు. వారినీ 3 పెళ్లిళ్లు చేసుకోమనండి. నాకేమీ అభ్యంతరం లేదు. నాకు కుదరలేకనే 3 పెళ్లిళ్లు చేసుకున్నాను. పొద్దాక తన పెళ్లిళ్లపై మాట్లాడే వారిని చూస్తుంటే... తాను 3 పెళ్లిళ్లు చేసుకున్నానని వారు అసూయ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. వారిని కూడా విడాకులు ఇచ్చి 3 పెళ్లిళ్లు చేసుకోమనండి. నాకేమీ ఇబ్బంది లేదు. అలాగైతే నేను 3 పెళ్లిళ్లు చేసుకున్న చోట 3 రాజధానులు పెడతారా? విడాకులు ఇచ్చినప్పుడు ఆస్తిని ఇచ్చానg. ఆ తర్వాత మూడో పెళ్లి చేసుకున్నానన్నారు. 'ఒక పెళ్లి చేసుకుని 30 మందితో తిరిగే కొడకల్లారా.. నాపై అవాకులు చెవాకులు పేలితే చొక్కా పట్టుకుని, ఇళ్లల్లోంచి బయటకు లాక్కొచ్చి కొడతా' అని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
పవన్ కల్యాణ్‌కు కౌంటర్ ఇచ్చిన సీఎం జగన్ !
పవన్‌కు సీఎం జగన్ కూడా కౌంటర్ ఇచ్చారు. మూడు పెళ్లిళ్లు చేసుకోమని సందేశం ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. "మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుంది.. మీరూ చేసుకోండని ఏకంగా టీవీల్లో నాయకులుగా చెప్పుకుంటున్నవారు ఇలా మాట్లాడుతున్నారు. మీరూ ఆలోచన చేయండి. రేపొద్దున మన ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి ఏంటి? మన ఇంట్లో కూతుర్ల పరిస్థితి ఏంటి? చెల్లెమ్మల పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కరు నాలుగేళ్లు కాపురం చేసి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకుంటే వ్యవస్థ ఏం బతుకుతుంది. ఒకసారి కాకుండా మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటే ఆడవాళ్ల జీవితాలు ఏం కావాలి? ఇలాంటి వారా మనకు నాయకులు? వీరు మనకు దశా దిశా చూపగలరా? " అని ప్రశ్నించారు. ఇప్పుడు అదే కోణంలో మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.