By: ABP Desam | Updated at : 20 Jan 2022 02:38 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మంత్రి ఆదిమూలపు సురేశ్, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి(ఫైల్ ఫొటో)
సీఎం జగన్ తో సమావేశంలో ఉద్యోగులు పీఆర్సీకి అంగీకరించి ఇప్పుడు మళ్లీ ఆందోళన దిగడం సరికాదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. పీఆర్సీపై ఇబ్బందులు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడవచ్చన్నారు. పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగుల నిరసనలు, కోవిడ్ నేపథ్యంలో పాఠశాలల నిర్వహణపై మంత్రి సురేశ్ స్పందించారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నా తీవ్రత మాత్రం అంతగా లేదన్నారు. పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని స్పష్టంచేశారు. పిల్లలకు కరోనా సోకితే ఆ పాఠశాలను మూసివేసి శానిటేషన్ చేసి తిరిగి ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో కొన్ని విశ్వవిద్యాలయాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయని మంత్రి సురేశ్ గుర్తుచేశారు. హైకోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. భవిష్యత్తులో ఆన్‌లైన్ విధానం తప్పనిసరి అన్నారు. ఆన్‌లైన్ కోర్సులకు రానున్న కాలంలో డిమాండ్ మరింత పెరుగుతుందన్నారు. గుంటూరు వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో మంత్రి సురేశ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్రారంభించారు.
(కాకినాడలో ఉపాధ్యాయ సంఘాల ఆందోళన)
ఆ వ్యక్తుల ట్రాప్ లో పడొద్దు : శ్రీకాంత్ రెడ్డి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు నష్టం చేయాలని ప్రభుత్వం ఉద్దేశంకాదన్నారు. కచ్చితంగా ఉద్యోగులతో చర్చలు జరుపుతామన్నారు. ప్రభుత్వం ఎప్పుడూ మొండిగా వెళ్లదన్నారు. కొందరి మాటలు విని ప్రభుత్వంపై బురద చల్లవద్దని హితవు పలికారు. కరోనా సమయంలోనూ ప్రభుత్వంపై ఎంతో భారం పడిందన్నారు. ఉద్యోగులు ఆవేశాలకు లోనుకావద్దన్నారు. ఏ రాష్ట్రంలోనైనా 27 శాతం ఐఆర్‌ఎ ఇచ్చారా అని ప్రశ్నించారు. అందరికీ మంచి చేయాలని ఆలోచించే ప్రభుత్వం తమదని తెలిపారు. ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలని కొందరు కుట్రలు చేస్తున్నారన్నారు. ఉద్యోగులను ద్వేషించిన వ్యక్తుల ట్రాప్‌లో పడొద్దన్నారు. పది వేల కోట్ల భారం పడుతున్నా పీఆర్సీ అమలుకు సీఎం వైఎస్ జగన్ వెనుకాడలేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
Also Read: సమ్మెలోకి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు.. 21న సీఎస్‌కు నోటీసు !
ఉపాధ్యాయ సంఘాల ఆందోళన
ఏపీ ప్రభుత్వం పీఆర్సీపై విడుదల చేసిన జీవోలను రద్దుచేయాలని నిరసనగా ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. రాష్ట్రం వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముట్టడికి ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాఫ్టో) పిలుపునిచ్చింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని వ్యతిరేకించడంతో పాటు మూడు జీవోలు తక్షణమే రద్దు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఉపాధ్యాయులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఉపాధ్యాయుల అరెస్టులతో పోలీసులు స్టేషన్లు నిండిపోతున్నాయి. జీవోలు రద్దు చేసే వరకు తమ ఆందోళన విమరించమని ఉద్యోగులు తేల్చిచెబుతున్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం తగ్గేదేలే అంటుంది. జనవరి నెల జీతాలను కొత్త పీఆర్సీ ప్రకారం చెల్లించాలని ట్రెజరీకి ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది.
Also Read: కరోనాతో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది.. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
Bhavani Island: పర్యాటక అద్బుతం విజయవాడ భవానీ ఐల్యాండ్, నది మధ్యలో ప్రకృతి అందాలు
Student Debarred: ఏపీ ఇంటర్ బోర్డ్ పరీక్షల్లో కాపీయింగ్ - 13 మంది విద్యార్థుల్ని డిబార్ చేసిన అధికారులు
R Krishnaiah Thanks YS Jagan: ఏ రాజకీయ పార్టీ గుర్తించలేదు, కానీ వైఎస్ జగన్ ఛాన్స్ ఇచ్చారు : ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు
YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?
Breaking News Live Updates: జూబ్లీహిల్స్‌లో నటుడు బాలకృష్ణ ఇంటి వద్ద రోడ్డు ప్రమాదం
Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు - వారికి మాత్రమే !
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?
Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్
Palnadu Students Fight : అచ్చంపేట వర్సెస్ క్రోసూరు స్టూడెంట్స్ - పల్నాడు జిల్లాలో ఇంటర్ విద్యార్థుల గ్యాంగ్ వార్ !