News
News
X

AP Teachers : ఏపీ టీచర్లకు హాజరే పెద్ద పరీక్ష - "యాప్" సమస్యలకు పరిష్కారమేంటి ?

ఏపీ టీచర్లకు మరో గండం వచ్చి పడింది. ఫేసియల్ రికగ్నేషన్ యాప్‌తో హాజరు వేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ యాప్ పని చేయకపోవడంతో టీచర్లు తిప్పలు పడుతున్నారు.

FOLLOW US: 

AP Teachers :     స్కూల్ ప్రారంభమైన వెంటనే క్లాసులోకి వెళ్లి అటెండెన్స్ రిజిస్టర్ తీసుకుని.. రమేష్.. సురేష్ అని పిలుస్తూంటే.. ఎస్ సార్ అనే ఆన్సర్ వినడం టీచర్లకు రొటీన్. కానీ ఇప్పుడు వారు కూడా అటెండెన్స్  కూడా ఎస్ సార్ అనాల్సి వస్తోంది.  ఇలా హెడ్ మాస్టర్ ముందు అనాల్సి వస్తే సరే అనుకోవచ్చు.. కానీ ఓ యాప్ ముందు హాజరు నమోదు చేసుకోవాల్సి వస్తోంది. అది ఇప్పుడు ఏపీలో ఉపాధ్యాయులకు తీర్చుకోలేని సమస్యగా మారుతోంది. ప్రభుత్వంపై ఉద్యోగులు మండి పడుతున్నారు.  అసలు ఏ మాత్రం కసరత్తు చేయకుండా అమలు చేస్తున్న విధానమంటున్నారు. 

బయోమెట్రిక్‌, ఐరిస్‌కు బదులుగా యాప్ హాజరు !

 ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఇప్పటి వరకూ బయోమెట్రిక్‌, ఐరిస్‌ హాజరు విధానం అమల్లో ఉంది. కొత్తగా పాఠశాల విద్యాశాఖ ఫేషియల్‌ రికగ్నిషన్‌ యాప్‌ విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆటోమెటిక్‌గా ఉపాధ్యాయులకు సెలవుగా పడుతుంది. ఉపాధ్యాయులు తమ సొంత స్మార్ట్‌ఫోన్ల నుంచే ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ నూతన విధానం మంగళవారం నుంచే అమల్లోకి వచ్చింది. ఉపాధ్యాయులు 'సిమ్స్‌ ఎపి' అనే మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఉదయం 9 గంటల్లోపు కచ్చితంగా వారి హాజరు నమోదు చేయాలి. 9కి ఒక్క నిమిషం దాటినా సెలవుగా పరిగణిస్తారు. 

 ఫేషియల్‌ రికగ్నిషన్‌ యాప్‌తో అనేక సమస్యలు !

ఫేషియల్‌ రికగ్నిషన్‌ యాప్‌తో  అనేక సమస్యలు వస్తున్నాయని ఉపాధ్యాలు చెబుతున్నారు. ఇప్పటికీ స్మార్ట్‌ఫోన్లు ఉపయో గించని ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు.  మొత్తం 1.8 లక్షల మంది ఉపాధ్యాయుల్లో యాభై వేల మంది కూడా యాప్ డౌన్ లోడ్ చేసుకోలేదని తెలుస్తోంది.  నిర్ణీత సమయంలోనే పాఠశాలకు వచ్చిన తరువాత నెట్‌వర్క్‌ పనిచేయకపోతే బాధ్యత ఎవరు వహించాల్సి ఉంటుందనేది ఉపాధ్యాయుల ప్రశ్న. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఈ పరిస్థితి వస్తే పాఠశాలను మూసివేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.  గతంలో బయోమెట్రిక్‌ హాజరు ప్రవేశపెట్టిన సమయంలో పరికరాలను విద్యాశాఖ అందించింది. ఇప్పుడు అవసరమైన పరికరాలను ఇవ్వకుండానే ఉపాధ్యాయుల ఫోన్ల ద్వారా హాజరు నమోదు చేయాలని చెబుతోంది.
 
అందరికీ ఒకే యాప్ ! 

విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది అందరికీ ఒకే యాప్‌ 'సిమ్స్‌-ఎపి'ని తీసుకొచ్చింది. విద్యార్థులకు కూడా అదే యాప్‌ నుంచి హాజరు వేయాల్సి ఉంటుంది.. ఉపాధ్యాయులు ఇప్పటికే విద్యార్థుల పేర్లను యాప్‌లో నమోదు చేసుకుంటున్నారు. ఎవరి పాఠశాల ఆవరణలో వారికి హాజరును ముందుగా రికార్డు చేయాలి. ఇటీవల విలీనమైన చోట్ల ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఇతర పాఠశాలలకు వెళ్లారు. వారికీ కొత్త సమస్యలు వస్తున్నాయి. వీటిని ఎలా పరిష్కరించాలన్నదానిపై అధికారులు కూడా ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. 

తొలి రోజే ఉపాధ్యాయులకు అనుభవమైన కష్టాలు ! 
 
ఫేషియల్‌ రికగ్నిషన్‌ యాప్‌ అందుబాటులోకి తెచ్చిన తొలిరోజే ఈ ఫేస్‌ క్యాప్చరింగ్‌ అటెండెన్స్‌ ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టింది.   ఫేస్‌ క్యాప్చరింగ్‌ అటెండెన్స్‌ విధానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఉపాధ్యాయులు నానా తంటాలు పడాల్సి వచ్చింది.  యాప్‌ డౌన్‌లోడ్‌కు తోడు.. ఫొటో అప్‌లోడ్‌ చేయడానికి ఉపాధ్యాయులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు.  నెట్‌ లేక కొంతమంది, స్మార్ట్స్‌ ఫోన్స్‌ లేక ఇంకొంత మంది ఈ యాప్‌తో ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు.. డౌన్‌లోడ్‌ ప్రాబ్లమ్‌, నెట్‌ వర్క్‌ ప్రాబ్లెమ్‌ తో ఏం చేయాలో తెలియక టీచర్స్‌ తలాలు పట్టుకుంటున్నారు. గతంలో ఉన్న బయోమెట్రిక్‌ విధానాన్ని పక్కన పడేసి.. ప్రభుత్వం కొత్తగా తీసుకుని వచ్చిన ఈ యాప్‌ పై మండిపడుతున్నారు.  

అటెండెన్స్ ఒక్కటే కాదు పలు యాప్‌లు !

తొలిరోజు కేవలం పదిశాతం మంది మాత్రమే హజరు నమోదు చేయగలిగారని తెలుస్తోంది. మరోవైపు వ్యక్తిగత ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని ఉపాధ్యాయ సంఘం ఫ్యాఫ్టో పిలుపు నిచ్చింది. హాజరు నమోదుకు అవసరమైన డివైసెస్‌ ను ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుండి మధ్యాహ్నాం వరకు అనేక చోట్ల సర్వర్‌ బిజీ అని వచ్చింది. నెట్‌ సదుపాయం లేకపోవడం కూడా సమస్యగా మారింది. యాప్‌ డౌన్‌లోడ్‌ కూడా కాలేదు. గతంలో పిల్లలకు వేసే అటెండెన్స్‌ యాప్‌ కూడా మంగళవారం పనిచేయలేదు. ఆండ్రాయిడ్‌ ఫోన్లు లేని వారి పరిస్థితి మరింత ఘోరంగా మారింది. మరోవైపు విద్యార్థుల హాజరు అప్‌లోడ్‌, బాత్‌రూములు, స్కూలు పరిసరాలు, మధ్యాహ్నా భోజనం ఫోటోలు కూడా అప్‌లోడ్‌ చేయాల్సిఉండటంతో ఉపాధ్యాయులు గందరగోళంలో పడిపోయారు. ఈ విషయాన్ని పై అధికారులకు తెలియచేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మధ్యాహ్నాం వరకు ఉరుకులు పరుగులుతోనే సరిపోయింది.  

అటెండెన్స్ డివైసెస్ కోసం డిమాండ్ !

హాజరు నమోదుకు అవసరమైన డివైసెస్‌ ను నెట్‌ సౌకర్యంతో పాటు ప్రభుత్వమే ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  ఉపాధ్యాయులు వ్యక్తిగత సెల్‌ఫోన్లలో యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని, ఇప్పటికే చేసుకున్న వారు అటెండెన్స్‌ వేయొద్దని ఇప్పటికే పిలుపునిచ్చాయి.  ప్రభుత్వం ఇప్పటికైనా ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ పై  నిర్ణయాన్ని వెనక తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  తాను అధికారంలోకి రాగానే బయోమెట్రిక్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్.. ఇప్పుడు ఫేస్ ఐడీ తీసుకువచ్చి కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని  అంటున్నారు. 

ఉపాధ్యాయుల హాజరు సమస్యలకు పరిష్కారం ఏమిటో.. అధికారవర్గాల నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ రాలేదు. 

Published at : 17 Aug 2022 10:56 AM (IST) Tags: teachers New Attendance System for Andhra Pradesh Teachers Facial Recognition App AP Teachers

సంబంధిత కథనాలు

Man Murder: పెళ్లికి నో అన్న బావ, పగ తీర్చుకున్న బావ మరిది - రెండు కుటుంబాల్లో విషాదం!

Man Murder: పెళ్లికి నో అన్న బావ, పగ తీర్చుకున్న బావ మరిది - రెండు కుటుంబాల్లో విషాదం!

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు

KCR AP Challenge : ఏపీలోనే కేసీఆర్‌కు అసలైన సవాల్ - అక్కడి ప్రజలకు ఏం చెబుతారు ? గత చరిత్రను ఎలా మర్చిపోయేలా చేస్తారు ?

KCR AP Challenge : ఏపీలోనే కేసీఆర్‌కు అసలైన సవాల్ - అక్కడి ప్రజలకు ఏం చెబుతారు ? గత చరిత్రను ఎలా మర్చిపోయేలా చేస్తారు ?

Janasena Chiru : పవన్‌కు తోడుగా రంగంలోకి దిగుతారా ? మళ్లీ చిరంజీవి మనసు రాజకీయం వైపు లాగుతోందా ?

Janasena Chiru : పవన్‌కు తోడుగా రంగంలోకి దిగుతారా ? మళ్లీ చిరంజీవి మనసు రాజకీయం వైపు లాగుతోందా ?

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

టాప్ స్టోరీస్

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

Bigg Boss 6 Telugu Episode 32: సూర్య అంటే ఇష్టం, తన క్రష్ అని చెప్పేసిన ఇనయా, మరి సూర్యకు?

Bigg Boss 6 Telugu Episode 32: సూర్య అంటే ఇష్టం, తన క్రష్ అని చెప్పేసిన ఇనయా, మరి సూర్యకు?

66 మంది చిన్నారులు మృతి - భారత్‌ దగ్గుమందు తయారీ సంస్థకు డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్

66 మంది చిన్నారులు మృతి - భారత్‌ దగ్గుమందు తయారీ సంస్థకు డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్

Samsung Axis Bank Card: సంవత్సరం మొత్తం క్యాష్‌బ్యాక్‌లు - శాంసంగ్, యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఆఫర్లు!

Samsung Axis Bank Card: సంవత్సరం మొత్తం క్యాష్‌బ్యాక్‌లు - శాంసంగ్, యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఆఫర్లు!