AP Socio Economic Survey: ఏపీ ఆర్థిక సర్వే-రూ.31 వేలు పెరిగిన తలసరి ఆదాయం, వృద్ధి రేటులో భేష్!
AP Socio Economic Survey: ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేను ప్రభుత్వం విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి జీఎస్డీపీ రూ.12.01 లక్షల కోట్లని ప్రకటించింది. 18.47 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేసినట్లు తెలిపింది.
AP Socio Economic Survey: ప్రభుత్వ పనితీరును ప్రజల జీవన ప్రమాణాలను రిఫ్లెక్ట్ చేసే సోషియో ఎకనామిక్ సర్వేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. 2021-22 సంవత్సరానికి సంబంధించిన సర్వేను సీఎం జగన్ విడుదల చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి జీఎస్డీపీ రూ.12,01,736 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతకు ముందు ఫైనాన్షియల్ ఇయర్ లో జీఎస్డీపీ 10 లక్షల 14 వేల 374 కోట్లు ఉండగా ఒక్క ఏడాదిలోనే రూ.లక్షా 87 వేల 362 కోట్ల ప్రగతి సాధించటం రాష్ట్రంలోనే తొలిసారి అని ఏపీ గవర్నమెంట్ ప్రకటించింది. దీన్నే హయ్యెస్ట్ క్వాంటమ్ జంప్ అంటారు. అంటే ఊహించని స్థాయిలో జీఎస్డీపీలో పెరుగుదల రావటం ఈ జంప్ ను సూచిస్తుంది.
జీఎస్డీపీ రంగాల వారీగా
- వ్యవసాయరంగంలో -రూ.3.9 లక్షల కోట్లు
- పారిశ్రామిక రంగంలో -రూ.2.5 లక్షల కోట్లు( 25.5 శాతం వృద్ధి)
- సర్వీస్ సెక్టార్ లో -రూ.4.67 లక్షల కోట్లు(18.9 శాతం వృద్ధి)
- ప్రొడక్ట్ టాక్సెస్ -రూ.1.1 లక్షల కోట్లు
ఏపీలో 2021-22 ఆర్థిక సంవత్సరం వార్షిక వృద్ధి రేటు 18.47 శాతంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశ వార్షిక సరాసరి 17 శాతం ఉందని వెల్లడించింది.
సచివాలయంలో సామాజిక, ఆర్ధిక సర్వే 2021-22 విడుదల చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్#APAssembly #APBudget2022 pic.twitter.com/bdkeQ5ldo0
— YSR Congress Party (@YSRCParty) March 11, 2022
వృద్ధి రేటు
- వ్యవసాయ రంగంలో-14.5 శాతం
- పారిశ్రామిక రంగంలో- 25.5 శాతం
- సర్వీస్ సెక్టార్ లో -18.9 శాతం
ఏపీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తలసరి ఆదాయం రూ.2 లక్షల 717గా ఉందని ప్రభుత్వం ప్రకటించింది. అంతకు ముందు ఫైనాన్షియల్ ఇయర్ లో తలసరి ఆదాయం రూ.1 లక్షా 76 వేలు ఉంది. ఏడాదిలో రూ.31 వేలు తలసరి ఆదాయం పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. దేశంలో తలసరి ఆదాయం రూ.23 వేలు పెరిగిందని పేర్కొంది. అన్ని విభాగాల్లోనూ జాతీయ స్థాయి సగటును దాటేసి కరోనా కల్లోలంలోనూ అద్భుతమైన ఫలితాలను ఏపీ సాధించిందని ప్రభుత్వం తెలిపింది.
Also Read: AP Budget 2022-23: 2,56,257 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, నాలుగు కీలకాంశాలపైనే దృష్టి పెట్టామన్న ఆర్థిక మంత్రి