By: ABP Desam | Updated at : 08 Apr 2022 10:28 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మంత్రుల ప్రమాణ స్వీకారం
AP New Cabinet : ఏప్రిల్ 11వ తేదీన జరిగే మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని ఏపీ సీఎఎస్ సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాయలం పక్కనే నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై వీడియో సమావేశం ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ నూతన మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయడంతో పాటు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖల కార్యదర్శులు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. బ్లూబుక్ లోని నిబంధనల ప్రకారం నూతన మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు సంబంధిత శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రితో నూతన మంత్రివర్గ సభ్యులు గ్రూపు ఫొటోకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రోటోకాల్, సమాచారశాఖ అధికారులను సీఎస్ డా.సమీర్ శర్మ ఆదేశించారు.
కరకట్ట రోడ్డులో ప్రముఖులకు ఎంట్రీ
అంతకు ముందు ముఖ్యకార్యదర్శి(పొలిటికల్)ఆర్.ముత్యాలరాజు మాట్లాడుతూ నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించి వేదిక, అలంకరణ, ఆహ్వాన పత్రిక, గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులుగా డిజిగ్నేట్ అయిన వారికి ఆహ్వానం పలకడం వంటి ఏర్పాట్లు, వారికి తగిన రవాణా సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకుగాను ప్రోటోకాల్ డైరెక్టర్ కు సహకరించే విధంగా కొంతమంది ప్రోటోకాల్ అధికారులను నియమిస్తున్నట్టు ముత్యాల రాజు సీఎస్ కు వివరించారు. అదనపు డీజీ శాంతి భద్రతలు రవిశంకర్ మాట్లాడుతూ నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకుని 11వ తేదీన కరకట్ట రోడ్డును గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇతర న్యాయమూర్తులు, మంత్రులుగా నియమించబడిన వారికి, ఎంపీలు, ఎమ్ఎల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖుల వాహనాలు ప్రమాణ స్వీకార ప్రాంతానికి చేరుకునేలా ఏర్పాటుచేస్తా్మని తెలిపారు. మిగతా వారి వాహనాలు ఇతర మార్గాల్లో వచ్చేలా తగిన ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అదే విధంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో డీఐజీలు సి.త్రివిక్రమ వర్మ, రాజశేఖర్, ఇతర అధికారులు పాల్గొ్న్నారు.
Also Read : Why Jagan Looses Cool : ఢిల్లీ వెళ్ళాక ఏం జరిగింది ? ముఖ్యమంత్రి మాటల వెనుక మర్మం ఏంటి ?
Bharat Bandh : సీపీఎస్ రద్దు, కుల ఆధారిత జనాభా గణన డిమాండ్‌తో భారత్ బంద్
Konaseema Curfew : బుధవవారం నుంచి కోనసీమలో కర్ఫ్యూ - కీలక నిర్ణయం తీసుకున్న పోలీసులు
Konseema Protest Live Updates: కోనసీమ జిల్లా అంతటా కర్ఫ్యూ- ఆందోళనతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త
Anantapur TDP Kalva : ఏకతాటిపైకి అనంత టీడీపీ నేతలు - చంద్రబాబు టూర్ తర్వాత మారిన సీన్ !
Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!
Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !
Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరపై..!
KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్