By: ABP Desam | Updated at : 08 Apr 2022 07:57 PM (IST)
ఢిల్లీ వెళ్ళాక ఏం జరిగింది ? ముఖ్యమంత్రి మాటల వెనుక మర్మం ఏంటి ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరుసగా రెండు రోజుల పాటు ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆయన ప్రతిపక్షాలను చాలా ఘాటుగా విమర్శిస్తున్నారు. వారు చనిపోతారన్నట్లుగా మాట్లాడుతున్నారు. తన వెంట్రుక కూడా పీకలేరని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అసలు కార్యక్రమం ఏమిటి ..? ఆయన చేస్తున్న విమర్శలేమిటి ? ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఇలా ఘాటుగా మాట్లాడుతున్నారా? అక్కడేమైనా జరిగిందా ?
జనసేన పార్టీ ఇటీవలి కాలంలో ఓట్లు చీలనివ్వబోమని చెబుతూ వస్తోంది. పవన్ కల్యాణ్ అదే చెబుతున్నారు. వైఎస్ఆర్‌సీపీ మళ్లీ రాదని చెబుతున్నారు. ప్రస్తుతం బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు అమిత్ షాను కూడా కలిశారు. ఈ సందర్భంగా రాజకీయ చర్చలు కూడా జరిగాయని.. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగించాలని.. టీడీపీతో కలవకుండా చూడాలన్న అభిప్రాయాన్ని జగన్ వ్యక్తం చేశారు. అయితే అక్కడ నుంచి సానుకూల సంకేతాలు రాలేదని.. అందుకే జగన్ మండిపడుతున్నారని కొంత మంది విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు, జగన్ కలుస్తున్నారన్న కోపం జగన్లో ఎక్కువగా కనిపిస్తోందన్న అభిప్రాయం ఆయన విమర్శల్లో ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు, పవన్ కలుస్తున్నారని.. కలిసి వచ్చినా తనను ఏమీ చేయలేరని జగన్ అంటున్నారు. నిజానికి ఇప్పటి వరకూ వారిద్దరూ కలుస్తారని ఎక్కడా చెప్పలేదు. అయినా కలుస్తారేమో అని వైఎస్ఆర్‌సీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. పవన్‌కు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని అంటున్నారు.
రాజకీయ విమర్శలు చేయడానికి వేరే సందర్భాలు ఉన్నాయి. కానీ సీఎం జగన్ అలాంటి సందర్భాలు పట్టించుకోవడం లేదు. విద్యార్థుల కార్యక్రమమా..వాలంటీర్ల కార్యక్రమమా అనేది చూసుకోకుండా విప్కష పార్టీల్ని ఎలా విమర్శించుకుంటున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడితే.. తమ ఎదురుగా ఉన్న విద్యార్థులకు ఎలాంటి సందేశం ఇచ్చినట్లుగా ఉంటుందన్న ఆలోచన కూడా సీఎంకు రాకపోవడం కరెక్ట్ కాదన్న వాదన ఎక్కువ మందిలో వినిపిస్తోంది. కారణం ఏదైనా సీఎం జగన్ కోపానికి గురవుతున్నారన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది.
Anantapur TDP Kalva : ఏకతాటిపైకి అనంత టీడీపీ నేతలు - చంద్రబాబు టూర్ తర్వాత మారిన సీన్ !
Petre Rates States : పెట్రో పన్నులపై రగడ ! ఎప్పుడూ కేంద్రమేనా రాష్ట్రాలు తగ్గించవా ?
Undavalli Arun Kumar : ఏపీలో మూడు పార్టీలూ బీజేపీకే మద్దతు - తనను బెదిరిస్తున్నారని ఉండవల్లి ఆవేదన !
Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !
MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్ గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !
Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!
Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !
Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరపై..!