అన్వేషించండి

AP Ministers: నిర్మలా సీతారామన్ చెప్పింది కరెక్టా, పురంధేశ్వరి కరెక్టా తేల్చండి - ఏపీ బీజేపీ చీఫ్ పై మంత్రులు ఫైర్

పురందేశ్వరి బీజేపీ పార్టీ అధ్యక్షురాలా లేక టీడీపీ అధ్యక్షురాలా అని అర్థం కావడం లేదని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు.

AP Ministers RK Roja and Vidadala Rajini fires on AP BJP chief Purandeswari:
పురందేశ్వరి బీజేపీ పార్టీ అధ్యక్షురాలా లేక టీడీపీ అధ్యక్షురాలా అని అర్థం కావడం లేదని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలను మంత్రి ఆర్కే రోజా శనివారం ప్రారంభించారు. అనంతరం సరదాగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి మంత్రి రోజా బ్యాడ్మింటన్ ఆడారు. అనంతరం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.... అప్పులపై పార్లమెంట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన స్టేట్మెంట్ తప్పా లేక పురందేశ్వరి వ్యాఖ్యలు తప్పా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పారదర్శకంగా నిధులు ఖర్చు పెడుతుందని, ఇప్పటికైనా పురందేశ్వరి అబద్ధాలు చెప్పడం మానుకోవాలన్నారు. ప్రజలకు మంచి చేసే ఉద్దేశం ఉంటే రాష్ట్రంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చని చెప్పారు. కొందరు పార్టీ పెట్టి 9 ఏళ్ళు అయిందని, ప్యాకేజీ కోసం పార్టీ పెట్టారు గాని ప్రజల కోసం కాదని ఆమె ఆరోపించారు. పవన్ పార్టీ పెట్టిన అనంతరం ఇతర పార్టీలకు ఓటు వేయాలని చెప్తుండడం హాస్యాస్పదం మన్నారు. డైరెక్టుగా ఎన్నికలకు వెళ్లి బొక్కా బోర్ల పడ్డాడని ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబుకి సపోర్టు చేయాలని పవన్ చెప్తాడని, కానీ పవన్ కళ్యాణ్ ను పట్టించుకునే నాథుడే లేడన్నారు. నందమూరి ఫ్యామిలీ టీడీపీ పార్టీని స్వాధీనం చేసుకోవాలని చెప్పారు.

అధికారంలో ఉంటే అప్పుల ఊసే ఎత్తని చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే మాత్రం అప్పుల గురించి మాట్లాడుతారన్నారు. లెక్చరర్ లాగా బోర్డులో ప్రజెంటేషన్ ఇస్తూ నదులు ఇక్కడ కలపొచ్చు అని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు ఏం చేశాడో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. లక్ష కోట్ల వెల్ఫేర్, అనేక అభివృద్ధి కార్యక్రమాలు సీఎం జగన్ చేపట్టారన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే నిధులు అనుసంధానం చేస్తాడని, ప్రతిపక్షంలో ఉంటే నదులు అనుసంధానంపై మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలకు ఏం చేస్తారో వాగ్దానం ఇవ్వాలని మంత్రి రోజా డిమాండ్ చేశారు. 

విశాఖ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి విడదల రజిని మాట్లాడుతూ... నూతనంగా ఎన్నికైన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మరిది స్క్రిప్ట్ నే చదువుతోందని ఆరోపించారు. ఆమె చంద్రబాబు కోసం పని చేసినట్లు అనిపిస్తుందని చెప్పారు. అప్పులు అని తప్పుడు లెక్కలు చెబుతున్నారని మంత్రి రజిని ఆరోపించారు. ఏపీలో తీసుకునే ప్రతి రుణం ప్రజల సంక్షేమం కోసమే వినియోగిస్తున్నామన్నరు. సౌత్ ఎమ్మేల్యే గడప గడపకు కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసారని చెప్పారు. జగనన్న ప్రభుత్వము లో విశాఖ జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. 600 కొట్లు రూపాయిల తో నాడు నేడు లో కేటాయింపు చేశామన్నారు. కలెక్టరు ఆదేశాలు తో సి యస్ ఆర్ నిధులు ద్వారా 11కోట్లు తో అభివృద్ధి చేయగా... టీడీపీ హయం లో ప్రభుత్వ మెడికల్ కళాశాల తేవాలి అంటే కేవలం 500 కోట్ల నిధులు కేటాయించారు. కానీ వైసిపి హయం లో 17 మెడికల్ కాలేజీలను 3,820 కోట్లతో తీసుకోచ్చామని చెప్పారు. ఆలోచన కి దైర్యం లేని మీరా ఇప్పుడు ప్రశ్నించేది ఆరోపించారు. 135 కోట్లతో జీవీఎంసీ లో అభివృద్ధి పనులకి ఆగస్ట్ 1 ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. విశాఖ పై జగన్ మోహన్ రెడ్డి కి ఒక ఆలోచన ఉందని స్పష్టం చేశారు.

తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి మెరుగు నాగార్జున దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాసీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మంత్రి మెరుగు నాగార్జున మాట్లాడుతూ.. కరోనా వస్తే రాష్ట్రాన్ని వదిలి పారిపోయినోళ్ళు 14 ఏళ్ళు సీఎంగా పని చేసి, దొంగ రాజకీయాలు చేసేందుకు ఏపిలో తిరుగుతున్నారాన్నరు. వాళ్ళకు జ్ఞానోదయం కలిగించాలని ప్రార్ధించానన్నారు. చంద్రబాబు లాంటి వాళ్ళు రాష్ట్రాన్ని కలుషితం చేయోద్దని, మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి అయ్యే విధంగా ఆశీర్వాదించాలని కోరుకునట్లు తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు సర్వీస్ చేస్తుందన్నారు. వాలంటీర్ అంటే దైవాంశ సంబూతులని అభివర్ణించారు. ఇళ్ళు లేని వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి, ఆధారం లేని వాళ్ళ దగ్గరకు వెళ్ళి సహాయం చేస్తున్న వ్యక్తులు వాలంటీర్లేనని అన్నారు.

కరోనా మహమ్మారి వ్యాప్తిలో కూడా వాలంటీర్లు సేవలు అందించారన్నారు. వాలంటీర్లు ఒక కొత్త ఆశయానికి తెర తీసారని చెప్పారు. వాళ్ళ గురించి ఎవరూ మాట్లాడినా అవి అభూత కల్పనలని తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్లాన్ ప్రకారం రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారన్నారు.. కొడుకు రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ కార్యకర్తలు వస్తే నాపై 12 కేసులు ఉన్నాయ్, మీకు 13 ఉంటే నా దగ్గరకు రండీ అంటున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని బాగు చేయాలనా, లేక గొడవకు సృష్టించాలనా లోకేష్ కే అర్ధం కావాలన్నారు. రిపోర్టర్ దాడి చేయడం అనేది హేమమైన చర్య అని అన్నారు. రిపోర్టర్ పై దాడికి కారణమైన లోకేష్, చంద్రబాబులపై కేసులు పెట్టాలన్నారు. ఆలోచనలు, అవగాహన లేని వాళ్ళు, రాజకీయ స్వార్ధం కోసం వాలంటీర్ లపై మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Telangana Assembly: 'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Telangana Assembly: 'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
BRS On NTR: ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
BJP MP Pratap Sarangi Injured: రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Embed widget