అన్వేషించండి

రైతులకు అండగా నిలిచాం, వైయస్ఆర్ జలకళ లెక్కలు చెప్పిన పెద్దిరెడ్డి

రైతులకు చేయూత నివ్వడంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందరి కన్నా ఒక అడుగు ముందే ఉన్నారని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

వ్యవసాయానికి అండగా నిలవడం, రైతులకు చేయూత నివ్వడంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందరి కన్నా ఒక అడుగు ముందే ఉన్నారని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైయస్ఆర్ జలకళ పథకంలో భాగంగా ఖర్చు చేసిన నిధుల వివరాలను ఆయన శాసన సభలో వెల్లడించారు.
అసెంబ్లీలో మంత్రి పెద్దిరెడ్డి...
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాష్ట్రంలోని రైతులకు వైయస్ఆర్ జలకళ పథకం ద్వారా అందిస్తున్న కార్యక్రమాల ప్రగతిపై మంత్రి పెద్దిరెడ్డి, సభకు వివరించారు. వైయస్ఆర్ జలకళ కింద కమాండ్ ఏరియాతో పాటు నాన్-కమాండ్ ఏరియాలో కూడా అర్హులైన రైతులకు ప్రభుత్వం ఉచితంగా బోర్ బావులను మంజూరు చేస్తోందని తెలిపారు. వీటితో పాటుగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్, విద్యుత్ ఉపకరణలతో పాటు 180 మీటర్ల కేబుల్ ను కూడా రైతులకు ఉచితంగానే అందచేస్తున్నామని చెప్పారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా ఇప్పటివరకు వచ్చిన మొత్తం దరఖాస్తులు 2,28,421 అయితే దానిలో సచివాలయాల్లో విఆర్వోలు ఆమోదించినవి 1,88,571 దరఖాస్తులు, భూగర్భ జల శాఖ సర్వే పూర్తి చేసినవి 66,190 దరఖాస్తులు, వీటిల్లో కలెక్టర్లు 42,388 దరఖాస్తులకు అడ్మినిస్ట్రేషన్ అనుమతులు ఇచ్చారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. అన్ని అనుమతులు పూర్తి చేసుకున్న వాటిల్లో 19,908 బోర్ బావులకు డ్రిల్లింగ్ పూర్తి చేశామని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బోర్లంటే...
రాష్ట్రంలో 2020 నుంచి 2024 వరకు మొత్తం రెండు లక్షల బోర్లు వేస్తామని చెప్పామని, మొత్తం మూడు లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా అయిదు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో వైయస్ఆర్ జలకళ పథకంను అమలు చేస్తున్నామని అన్నారు. ఈ పథకం కింద మంజూరు చేసిన బోరుబావులకు ఉచితంగానే విద్యుదీకరణ చేస్తున్నట్లు సభలో తెలిపారు. ఉచితంగా విద్యుదీకరణ చేసినవి 1721, దీనికి చేసిన వ్యయం రూ.54.95 కోట్లుగా వెల్లడించారు.
టీడీపీ హయాంలో అలా...
గత ప్రభుత్వం ఎన్టీఆర్ జలసిరి పేరుతో రైతులకు ఉచిత బోరు బావులను మంజూరు చేసిందని పెద్దిరెడ్డి అన్నారు. అయితే అవన్నీ కేవలం కమాండ్ ఏరియాల్లో మాత్రమే అమలు చేశారని, అదికూడా కేవలం రెండు వందల అడుగులు వరకు మాత్రమే డ్రిల్లింగ్ కు అవకాశం కల్పించారని అన్నారు. గత అయిదేళ్ళలో తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు మంజూరు చేసిన బోరుబావులు కేవలం 33,116 మాత్రమేనని వెల్లడించారు. ఇందుకోసం గత ప్రభుత్వం ఖర్చు చేసిన వ్యయం కేవలం రూ.99.35 కోట్లు మాత్రమేనని సభలో లెక్కలు వివరించారు. రైతులు చేసుకున్న దరఖాస్తులు ఆయా మండలాల్లో ఎంపిడిఓల ద్వారా మాత్రమే మంజూరు చేశారని, అదికూడా మొదటి వచ్చిన దరఖాస్తుకు మొదటి ప్రాధాన్యత అనే విధానాన్ని అమలు చేశారని ఆయన గుర్తు చేశారు. 
ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు వైయస్ఆర్ జలకళ కింద బోరుబావులను మంజూరు చేసేందుకు వీలుగా నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. కమాండ్ ఏరియాతో పాటు నాన్ కమాండ్ ఏరియాలోనూ బోరు బావులను మంజూరు చేస్తున్నామని, జియాలజిస్ట్ లు ఎంత లోతు వరకు సిఫారస్ చేస్తే అంత వరకు డ్రిల్లింగ్ చేయిస్తున్నామని చెప్పారు. పారదర్శకత కోసం ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోనూ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. సచివాలయాల స్థాయిలోనే విఆర్వోల ద్వారా ప్రతి దరఖాస్తును వెరిఫై చేయిస్తున్నాం. ఈ నాలుగేళ్ళలో వర్షాలు సంవృద్ధిగా కురుస్తుండటం, చెరువుల్లో సాగునీరు ఉండటం, సాగుకు కొరత లేకపోవడం వల్ల రైతుల నుంచి కూడా బోరుబావుల కోసం అంతగా ఆసక్తి వ్యక్తం కాలేదని తెలిపారు. వ్యవసాయానికి జగన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఇప్పటి వరకు విద్యుత్ శాఖ ద్వారా 1.21 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్ లను ఇచ్చామన్నారు మంత్రి పెద్దిరెడ్డి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget