అన్వేషించండి

Pensions in AP: ఏపీలో పెన్షన్లు ఇంటి వద్దకే, వాళ్లతో అందిస్తాం - మంత్రి క్లారిటీ

AP Latest News: అధికారంలోకి రాగానే ఇన్ని పథకాలపై సంతకం పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబే అని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Nimmala Ramanaidu Comments: చంద్రబాబు తన ఐదు సంతకాలతో ఏపీ ప్రజల భద్రతకు భరోసా ఇచ్చారని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా మెగా డీఎస్సీపై సంతకం చేసి యువతకు ఇచ్చిన మాట నెరవేర్చారని అన్నారు. 16,343  పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించారని అన్నారు. గురువారం (జూన్ 13) ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘రెండవ సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపై పెట్టడం ద్వారా ప్రజల్లో నెలకొన్న భయాన్ని తొలగించారు. మీ బిడ్డ మీ బిడ్డ అంటూ ప్రజల ఆస్తులకు వారసుడుగా మారే ప్రయత్నం చేశాడు జగన్. మూడో సంతకంగా సామాజిక పింఛన్లపై సంతకం పెట్టారు. పెన్షన్లపై కూడా జగన్ అబద్ధాలు చెప్పారు. ఒక్క సంతకంతో ఏకంగా వృద్ధుల పెన్షన్ లను రూ.4 వేలకు, దివ్యాంగుల పెన్షన్ లను రూ.6 వేలకు పెంచారు చంద్రబాబు. ఈ పెన్షన్ లను ఇంటి వద్దే అందించేలా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతానికి పింఛన్లు గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ద్వారానే ఇళ్ల దగ్గరే అందజేస్తాం’’

నాలుగో సంతకంగా అన్నా క్యాంటీన్ పునరుద్ధరణపై పెట్టారు. ఒక నిరుపేద కేవలం రూ.15 రూపాయలతో మూడు పూటలా తినేలా ఈ పథకాన్ని చంద్రబాబు తీసుకొచ్చారు. దాన్ని కూడా జగన్ రద్దు చేశాడు. కావాలంటే పేరు మార్చుకోండి అని అసెంబ్లీలో మేం ప్రాధేయపడినా ఆ సైకో వినలేదు. 100 రోజుల్లో అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ చేస్తాం. ఐదో సంతకంగా స్కిల్ డెవలప్ మెంట్ సెన్సెస్ పై చంద్రబాబు చేశారు. స్టూడెంట్స్ లోని ప్రతిభను సానబెట్టేలా ఇకపై స్కిల్ డెవలప్ మెంట్ సంస్థలు పనిచేస్తాయి. అధికారంలోకి రాగానే ఇన్ని పథకాలపై సంతకం పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబే. 

మా ప్రెస్ మీట్లలో బూతులు ఉండవు
మా మంత్రుల మీటింగ్స్ లో బూతులు, తిట్లు ఉండవు. జగన్ పాలన మొత్తం తిట్లు.. బూతులు.. విద్వేషం.. విధ్వంసం.. కేసులతో నడిచింది. ఎన్డీఏ పాలనలో అభివృద్ధి, సంక్షేమ, సంస్కరణలతో కూడి ఉంటుంది. మా నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కూడా మాకు అదే చెప్పారు. మేం బూతులు తిట్టం’’ అని అన్నారు.

బ్రిటీష్ పాలన కంటే ఘోరం
మరో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. జగన్ పాలన మొత్తం గంజాయి, డ్రగ్స్, లాంటి వాటితో సాగింది. నిర్వీర్యం అవుతున్న యువత కోసం చంద్రబాబు ఈ ఐదు సంతకాలు చేశారు. సామాజిక భద్రత తెలుగు దేశం ధ్యేయం. రైతుల, ప్రజల ఆస్తుల రక్షణ కోసమే లాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు పై సంతకం పెట్టారు’’ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు వచ్చాయని.. మెగా డీఎస్సీ పేరుతో జగన్ యువతను ఐదేళ్లు మోసం చేశారని మరో మంత్రి సవిత అన్నారు. బ్రిటీష్ పాలన కంటే ఘోరంగా జగన్ పాలన చేశారని అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Dissatisfaction: డిప్యూటీ సీఎం అప్‌సెట్.. ?ఆ పోలీస్ బాస్‌తో ఏం చెప్పారు..?
డిప్యూటీ సీఎం అప్‌సెట్.. ?ఆ పోలీస్ బాస్‌తో ఏం చెప్పారు..?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
AP Cabinet Special Task Force: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Lenin Collection Day 1: లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Akhil Akkineni : తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Embed widget