అన్వేషించండి

Nara Lokesh : అక్టోబర్ 4 వరకూ లోకేష్‌ను అరెస్ట్ చేయవద్దు - సీఐడీకి హైకోర్టు ఆదేశం !

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్టోబర్ నాలుగో తేదీ వరకూ అరెస్ట్ చేయవద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. లోకేష్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పై విచారణ అప్పటికి వాయిదా వేసింది.

Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఊరట లభించింది. పైబర్ గ్రిడ్,  స్కిల్ డెవలప్‌మెంట్ కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని లోకేష్ దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణ జరిగిదంి.  అక్టోబర్ 4 వరకు లోకేశ్‌ను అరెస్ట్ చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.   ఈ స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని లోకేశ్ తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరువర్గాల వాదన విని కీలక ఉత్తర్వులు ఇచ్చింది.  

అంతకు ముందు  ఇన్నిర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్పునకు సంబంధించిన అక్రమ కేసులో ఏపీ హైకోర్టులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ14గా చేర్చిన నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌పై విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ కోర్టుకు కీలక విషయాలు వెల్లడించారు. సీఆర్‌పీసీలోని 41ఏ కింద లోకేష్‌కు నోటీసులు ఇస్తామని ఏజీ అన్నారు. ఈ మేరకు దర్యాప్తు అధికారి ఎఫ్ఐఆర్‌లో మార్పు చేశారని కోర్టుకు నివేదించారు. 41ఏ నిబంధనలు పూర్తిగా పాటిస్తామని, విచారణకు సహకరించకపోతే కోర్టు దృష్టికి తీసుకొస్తామని ఏజీ వివరించారు. 

దీంతో సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు అంటే అరెస్ట్‌ ప్రస్తావన రాదు కాబట్టి ముందస్తు బెయిల్‌పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. దీనినిబట్టి ముందస్తు బెయిల్‌కు ఆస్కారమున్న అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లను ఎఫ్ఐఆర్ నుంచి తొలగించి ఉండొచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం నిర్ధారణ కావాల్సి ఉంది. అసలు లోకేష్‌పై ఎఫ్ఐఆర్‌లో ఏ సెక్షన్లు పెట్టారు.. ఏ సెక్షన్లు తీసేశారు.. మళ్లీ ఏ సెక్షన్లు పెట్టారు అన్నది మొత్తం సస్పెన్స్ గానే ఉంది. ఎఫ్ఐఆర్‌లు కూడా లేకుండా అరెస్టులు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నా అదే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. 

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు కొనసాగుతోన్నాయి. ఈ కేసులో చంద్రబాబును సీఐడీ మొదటి నిందితుడిగా పేర్కొంది. బెయిల్‌ పిటిషన్‌పై ఈనెల 27న వాదనలు జరిగాయి. అనంతరం తదుపరి విచారణను న్యాయమూర్తి నేటికి వాయిదా వేశారు. ఇవాళ వాయిదాల అనంతరం నాలుగో తేదీకి వాయిదా వేశారు. రాజధాని నగరానికి సంబంధించిన బృహత్‌ ప్రణాళిక డిజైనింగ్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, దాన్ని అనుసంధానించే రహదారుల ఎలైన్‌మెంట్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2022 ఏప్రిల్‌ 27న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అదే ఏడాది మే 9న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. చంద్రబాబును మొదటి నిందితుడిగా పేర్కొంది. ఈ కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు పిటిషన్‌ వేశారు. చంద్రబాబు తరఫున వర్చువల్‌గా సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు పూర్వాపరాలను కోర్టు దృష్టికి తెచ్చారు. రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారని వివరించారు.          

టాప్ హెడ్ లైన్స్

Breaking News: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 18 మంది మృతి
వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 18 మంది మృతి
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
YS Jagan vs Chandrababu Naidu:ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Embed widget