AP High Court: ఏపీ సర్కార్‌కు హైకోర్టు షాక్! టెట్, డీఎస్సీ ఎగ్జామ్స్‌పై కీలక తీర్పు - ఆ షెడ్యూల్ సస్పెండ్
టెట్ పరీక్ష ఫలితాలు మార్చ్ 14 వ తేదీన వస్తున్నాయని, మార్చ్ 15 నుంచి డీఎస్సీ పరీక్షలు పెట్టడంపై హైకోర్ట్ లో పలువురు విద్యార్థులు పిటిషన్లు వేశారు.
AP High Court Verdict on TET and DSC Exams: ఏపీలో టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. మార్చ్ 15 వ తేది నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్ ను హైకోర్ట్ సస్పెండ్ చేసింది. టెట్ పరీక్ష ఫలితాలు మార్చ్ 14 వ తేదీన వస్తున్నాయని, మార్చ్ 15 నుంచి డీఎస్సీ పరీక్షలు పెట్టడంపై హైకోర్ట్ లో పలువురు విద్యార్థులు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై జవ్వాజి శరత్ చంద్ర వాదనలు వినిపించారు. కేవలం ఒక్క రోజు సమయంలో విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతారని శరత్ చంద్ర ప్రశ్నించారు.
ఇప్పటి వరకు ఎప్పుడు అటువంటి షెడ్యూల్ ఇవ్వలేదని వాదనలు వినిపించారు. నిరుద్యోగుల హక్కులను హరిస్తున్నారని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. పిటిషన్ల తరపున న్యాయవాదుల వాదనలను హైకోర్ట్ పరిగణలోకి తీసుకుంది. మార్చ్ 15 నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్ ను హైకోర్ట్ సస్పెండ్ చేసింది. టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలకు నాలుగు వారాలు కనీసం సమయం ఉండాలని ఆదేశాలు ఇచ్చింది.