AP Govt Employees Transfers : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
AP Govt Employees Transfers : ఏపీలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. జూన్ 17 లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
AP Govt Employees Transfers : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 17వ తేదీ లోగా సాధారణ బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉద్యోగుల బదిలీల ఫైల్‌పై సీఎం జగన్ సంతకం చేసినట్లు తెలుస్తోంది. బదిలీలకు సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. రాష్ట్రంలో సాధారణ బదిలీలపై ఇప్పటి వరకు ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం సడలించింది. బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం జగన్ బదిలీల ఉత్తర్వులపై సంతకం చేశారు. దీంతో ఉద్యోగుల బదిలీలపై అడ్డంకులు తొలగాయి. ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో పూర్తిస్థాయి మార్గదర్శకాలు వెలువడనున్నాయి.
ఉద్యోగుల హర్షం
అయితే బదిలీల్లో ఉద్యోగుల అర్హత, ఖాళీల వివరాలు, ఇతర నిబంధనలపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. బదిలీలపై అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన విషయాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి వివాదాలు, ఆరోపణలు తావులేకుండా ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. సాధారణ బదిలీల కోసం ఎంతో కాలంగా వేచిచూస్తున్నామని అంటున్నారు. ఇప్పటికీ తమ నిరీక్షణ ఫలించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త జిల్లాల్లో ఉద్యోగాల భర్తీ
ఏపీలో ఇప్పటివరకు బదిలీలపై నిషేధం ఉంది. ఈ నిషేధంపై ఉద్యోగ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. అయితే గతంలో 13 జిల్లాలు ఉండగా ఉగాది నుంచి మరో 13 కొత్త జిల్లాలు యాడ్ అయ్యాయి. కొత్త జిల్లాల్లో ఉద్యోగాల భర్తీకి ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సాధారణ బదిలీల్లో కొంతమందిని నూతన జిల్లాలకు ప్రభుత్వం సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పీఆర్సీ, సీపీఎస్ రద్దు విషయాల్లో నిరాశతో ఉన్న ఉద్యోగులు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అనుహ్యంగా బదిలీల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : Atmakur By Poll : ఆత్మకూరులో మోహరించిన వైసీపీ శ్రేణులు- ప్రతిష్టాత్మకంగా ఉపఎన్నిక