అన్వేషించండి

Vaddera Quarry Reservation: ఆంధ్రప్రదేశ్‌లో వడ్డెర వర్గానికి గుడ్ న్యూస్ - క్వారీ లీజుల్లో 33 శాతం కేటాయిస్తూ ఏపీ సర్కార్ జీవో 126 జారీ!

Minerals Policy : వడ్డెర సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం భారీ వరం ప్రకటించింది. లోకేష్ యువగళం పాదయాత్ర హామీ మేరకు క్వారీ లీజుల్లో 33% కేటాయిస్తూ సీనియరేజ్ ఫీజులో 50% రాయితీతో జీవో 126 జారీ చేసింది.

AP Govt GO Ms No 126 Vaddera quarry lease reservation: ఆంధ్రప్రదేశ్‌లో వడ్డెర సామాజికవర్గానికి ప్రభుత్వం భారీ ఆఫర్ ప్రకటించింది.  నారా లోకేష్  యువగళం పాదయాత్రలో  వడ్డెర కష్టాలను ప్రత్యక్షంగా చూసి, వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తమ కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వడ్డెర  ల ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా, రాష్ట్రంలోని మైనర్ మినరల్ క్వారీ లీజుల్లో వడ్డెర సహకార సంఘాలకు 33 శాతం ప్రాధాన్యత కేటాయింపులను ఖరారు చేస్తూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా  జీవో జారీ చేశారు. 

 పాదయాత్ర హామీ నెరవేర్చిన లోకేశ్ 

గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన వేలం   విధానం వల్ల వడ్డెర సహకార సంఘాలు క్వారీ లీజులను పొందలేక, తమ సాంప్రదాయ వృత్తికి దూరమై తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. యువగళం  పాదయాత్ర సాగుతున్న సమయంలో వడ్డెర  పెద్దలు  నారా లోకేశ్‌ను కలిసి, తమ జీవనోపాధిని కాపాడటానికి క్వారీలను కేటాయించాలని విన్నవించారు. ఆనాడు క్షేత్రస్థాయిలో వారి బాధలను చూసి ఇచ్చిన హామీని గుర్తుపెట్టుకుని, నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సామాజిక న్యాయం, సాంప్రదాయ వృత్తి హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఈ సరికొత్త గనుల విధాన సవరణలను తీసుకొచ్చింది.

 జీవో 126 లోని కీలక ముఖ్యాంశాలు 

ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్  రూల్స్, 1966కు సవరణలు చేస్తూ విడుదల చేసిన ఈ జీవో ద్వారా వడ్డెర సంఘాలకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. 

 33% రిజర్వేషన్: బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్, గ్రావెల్/మొరమ్, స్లేట్, రఫ్ స్టోన్ వంటి మైనర్ మినరల్స్ క్వారీ కేటాయింపుల్లో రిజిస్టర్డ్ వడ్డెర సహకార సంఘాలకు గరిష్టంగా 33 శాతం ప్రాధాన్యత లీజులను కేటాయిస్తారు. 

 50% రాయితీ: ఈ నిబంధనల ప్రకారం లీజులు పొందే వడ్డెర సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన సీనియరేజ్ ఫీజు   లో 50 శాతం భారీ రాయితీని కల్పించారు.

 ప్రీమియం తగ్గింపు: లీజుకు సంబంధించిన ప్రీమియం మొత్తంలోనూ వడ్డెర సంఘాలకు 50 శాతం మినహాయింపు లభిస్తుంది.

 పరిమితి: ప్రతి సొసైటీకి గరిష్టంగా 12 హెక్టార్ల వరకు ఈ ప్రాధాన్యత విధానం కింద లీజు పొందే అవకాశం ఉంటుంది.

 ప్రత్యేక  వడ్డెర క్వారీ పూల్  ఏర్పాటు 

ఈ నూతన విధానాన్ని పటిష్టంగా అమలు చేయడానికి వీలుగా ప్రభుత్వం మొదటి విడతగా 100 హెక్టార్ల ఖనిజ లభ్యత గల ప్రభుత్వ భూమిని సేకరించి వడ్డెర క్వారీ పూల్  గా నోటిఫై చేయనుంది. ఈ పూల్ విజయవంతంగా పూర్తయిన తర్వాత 33 శాతం ప్రాధాన్యత కేటాయింపుల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది. అంతేకాకుండా, దరఖాస్తుల పరిశీలన కోసం క్యాలెండర్ ఏడాదిని 45 రోజుల చొప్పున 8  ఇవాల్యుయేషన్ స్లాట్లు గా విభజించి, ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా బ్యాచ్-వైజ్ పద్ధతిలో లీజులను ఖరారు చేయనున్నారు.

 బినామీలకు అడ్డుకట్ట.. కులవృత్తిదారులకే హక్కులు 

ఈ జీవోలో ప్రభుత్వం మరో కీలకమైన రక్షణ నిబంధనను పొందుపరిచింది. ప్రాధాన్యత ప్రాతిపదికన వడ్డెర సహకార సంఘాలకు కేటాయించిన క్వారీ లీజులను వేరే ఏ ఇతర వ్యక్తులకు లేదా సంస్థలకు బదిలీ చేయడం  , సబ్-లెట్  ఇవ్వడం లేదా అసైన్ చేయడం పూర్తిగా నిషిద్ధం. కేవలం మరో రిజిస్టర్డ్ వడ్డెర సంఘానికి మాత్రమే దీనిని బదిలీ చేసే వీలుంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే లీజులను తక్షణమే రద్దు చేసే అధికారాన్ని గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌కు కల్పించారు. తద్వారా కార్పొరేట్ శక్తులు, బినామీలు వడ్డెరల హక్కులను లాక్కోకుండా ప్రభుత్వం గట్టి ప్లాన్ చేసింది. 
  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Thalli Bidda Express Vehicles: ఏపీలో కొత్తగా 500 తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు - బాలింతలకు ప్రభుత్వం ఉచిత సొకర్యం
ఏపీలో కొత్తగా 500 తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు - బాలింతలకు ప్రభుత్వం ఉచిత సొకర్యం
Breaking News: సీజేపీ కార్యకర్తలపై టియర్ గ్యాస్ ప్రయోగం.. పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత
సీజేపీ కార్యకర్తలపై టియర్ గ్యాస్ ప్రయోగం.. పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Trainee IPS Suicide Attempt: లైంగిక వేధింపుల ఆరోపణలు- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ తెలుసా
లైంగిక వేధింపుల ఆరోపణలు- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ తెలుసా
Advertisement

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
కొత్త రెనాల్ట్ డస్టర్ రోడ్‌ టెస్ట్‌ రివ్యూ - డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేఫ్టీ, మైలేజ్‌ పూర్తి సమీక్ష
కొత్త రెనాల్ట్ డస్టర్ రియల్‌ రోడ్ టెస్ట్ - స్టైలిష్ లుక్‌ అదిరింది, కానీ మైలేజ్‌లో నిరాశ!
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
Embed widget