(Source: ECI/ABP News/ABP Majha)
AP Govt: మహిళా పోలీసు విభాగం ఏర్పాటు.. మహిళా పోలీసులుగా గ్రామ సంరక్షణ కార్యదర్శులు
ఆంధ్రప్రదేశ్‌లో మహిళ పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వార్డు, గ్రామ మహిళ సంరక్షణ కార్యదర్శులు మహిళా పోలీసులుగా మారనున్నారు.
ఏపీ మహిళా పోలీసు విభాగం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా మార్పు చేస్తున్నట్లు తెలిపింది. సర్వీసు నిబంధనలు, పోస్టుల కేటగిరీ అంశాలను తెలిపింది. ఐదు కేటగిరీలుగా మహిళా పోలీసు విభాగంలో పోస్టులను విభజించినట్లు ప్రభుత్వం పేర్కొంది. దీని ద్వారా.. 90 శాతం మహిళా పోలీసుల భర్తీ చేపడుతామని చెప్పింది. ఐదు శాతం మహిళా హోంగార్డులను ఈ విభాగంలో భర్తీ చేస్తామని తెలిపింది. గ్రామ, వార్డు మహిళా వాలంటీర్ల నుంచి 5 శాతం మంది భర్తీలో అవకాశం ఇవ్వనున్నారు.
సర్వీసు నిబంధనలు, పోస్టుల కేటగిరి ప్రకటిస్తూ ప్రభుత్వం నోటిషకేషన్ జారీ చేసింది. మొత్తం ఐదు విధాలుగా మహిళా పోలీసు విభాగంలో పోస్టులను భర్తీ చేస్తారు. నేరుగా నియామకాల ద్వారా 90 శాతం మహిళా పోలీసులను భర్తీ జరగనుంది.
మహిళా పోలీస్ గా కనీసం ఆరు సంవత్సరాలు సర్వీస్ చేసిన వారికి సీనియర్ మహిళా పోలీస్ గా అవకాశం కల్పిస్తారు. సీనియర్ మహిళా పోలీస్ గా ఐదేళ్లు పని చేస్తే.. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కు ఛాన్స్ ఉంటుంది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఐదేళ్లు సర్వీస్ పని చేస్తే.. సబ్ ఇన్స్పెక్టర్ కు అర్హత ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్ ఐదు సంవత్సరాలు పని చేస్తే..ఇన్స్పెక్టర్ నాన్ గెజిటెడ్ కు అర్హత సాధించనున్నారు.
Also Read: Covid 19 Lockdown: ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ.. లాక్‌డౌన్ విధిస్తారా?