Banakacharla Andhra: బనకచర్ల విషయంలో అవసరం లేని హడావుడి - చివరికి టెండర్లు క్యాన్సిల్ - ఏపీ తొందరపడిందా ?
Andhra Projects: బనకచర్ల విషయంలో హడావుడి చేసిన ఏపీ ప్రభుత్వం చివరికి వెనుకడుగు వేసింది. పొరుగు రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు, నిధుల సమస్య ప్రాజెక్టును ఒక్క అడుగు కూడా ముందుకు పడనివ్వలేదు.

Banakacharla Andhra backfoot: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ (PBLP) డీపీఆర్ టెండర్లను ఇటీవల రద్దు చేసింది. రూ. 81,900 కోట్లతో గోదావరి సర్ప్లస్ నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్లించి, రాయలసీమను డ్రాట్-ఫ్రీ చేయాలనే భారీ లక్ష్యంతో మొదలైన ఈ ప్రాజెక్ట్ తెలంగాణ బలమైన వ్యతిరేకత, కేంద్ర పర్యావరణ కమిటీ వ్యతిరేకత, అంతర్రాష్ట్ర వివాదాలు , నిధుల కొరత వంటి కారణాలతో అడ్డంకులు ఎదుర్కొంది. అందుకే ఇటీవల గతంలో ప్రకటించిన టెండర్ ప్రక్రియను కూడా రద్దు చేసింది. అయితే ప్రభుత్వం “వెనక్కి తగ్గలేదు, ప్రాజెక్ట్‌ను రివైజ్ చేస్తున్నాం” అని చెబుతోంది.
బనకచర్లపై తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత
తెలంగాణ ప్రభుత్వం PBLPపై తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అక్టోబర్ 28న తెలంగాణఇరిగేషన్ ఇంజినీర్-ఇన్-చీఫ్ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్‌కు లేఖ రాసి టెండర్లు ఆపాలని డిమాండ్ చేశారు. గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్-1980 అవార్డు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్-2014ను ఉల్లంఘిస్తుందని, పోలవరం డ్యామ్ డైమెన్షన్స్ మార్చడం సెంట్రల్ వాటర్ కమిషన్ అప్రూవల్‌కు విరుద్ధమని ఆరోపించారు. పోలవరం బ్యాక్‌వాటర్లు తెలంగాణ గ్రామాలు, రోడ్లు, రైల్వేలను డామేజ్ చేస్తాయని భయపడుతున్నారు. అక్టోబర్ 15న సీడబ్ల్యూసీకి మరో లేఖ రాసి ల్యాండ్ సర్వే, టెండర్లు ఆపాలని కోరారు. గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా డైవర్షన్‌పై అభ్యంతరాలు లేవనెత్తాయి.
ప్రపోజల్ రిజెక్ట్ చేసిన కేంద్ర పర్యావరణ కమిటీ
కేంద్ర పర్యావరణ కమిటీ జూన్ 30న ప్రపోజల్‌ను రిజెక్ట్ చేసింది. తెలంగాణ, ఒడిషా, ఛత్తీస్‌గఢ్ అభ్యంతరాలు, పోలవరం ముంపు వివాదాల అంశం కోర్టులో పెండింగ్‌లో ఉండటం, సీడబ్ల్యూసీ 2018 రిపోర్ట్ ప్రకారం మిగులు జలాలు లేకపోవడం ప్రధాన కారణాలు. గోదావరి, కృష్ణా ట్రిబ్యునల్ అవార్డులు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉల్లంఘనలు కూడా ఉన్నాయి. ప్రాజెక్ట్ వ్యయం రూ. 90,000 కోట్లకు చేరే అవకాశం ఉండటంతో కేంద్రం ఫండింగ్‌కు ఇష్టపడటం లేదు. తెలంగాణ వ్యతిరేకత వల్ల ఆలస్యం, న్యాయపరమైన సమస్యలు పెరిగి ప్రాజెక్ట్ సస్యం అవుతుందనే భయం కూడా ఉంది.
తాత్కాలికంగా టెండర్లు రద్దు
ఎలాగూ ముందుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో జనవనరుల శాఖ నవంబర్ 7న టెండర్లు రద్దు చేసి ఫీజిబిలిటీ స్టడీ పూర్తి తర్వాత రివైజ్డ్ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించింది. కొత్త ప్లాన్‌లో పోలవరం నుంచి నల్లమల సాగర్ వెలిగొండ ప్రాజెక్ట్ పార్ట్, ప్రకాశం జిల్లా కు నీటి డైవర్షన్ ఉంటుంది. రూట్ ప్రకాశం బ్యారేజ్, నాగార్జున సాగర్ రైట్ కానాల్, బొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా సోమశిలకు మిగులు జలాలను డైవర్ట్ చేస్తారు. ఈ మార్పు రాయలసీమకు వాటర్ సెక్యూరిటీని వేగవంతం చేస్తుందని, డిలేలు, ఖర్చులు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వం దూకుడు అసలు సమస్య !
దిగువ రాష్ట్రమైన ఏపీ.. వరదరూపంలో తమకు వచ్చే నీటిని మళ్లించుకోవడనికి ఎగువరాష్ట్రాలకు సమస్యలు ఉండకూడదు. కానీ ఎగువరాష్ట్రం.. బనకచర్లను వరదలజలాలనే కాదు.. ప్రాజెక్టుల్లోని నీటిని కూడా తరలించుకుంటుందని అనుమానిస్తోంది. అందుకే ప్రభావిత రాష్ట్రాలను కూడా కన్విన్స్ చేసి ప్రాజెక్టు గురించి ముందుకెళ్లాల్సి ఉంది. అదేమీ చేయకోవడంతో వివాదంలో పడిపోయింది. ఇప్పుడు.. టెండర్లు నిలిపివేయాల్సి వచ్చింది.





















