AP IAS Postings: ఏపీలో ఐఏఎస్ అధికారుల పోస్టుల్లో మార్పులు, సీఎం జగన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి
AP IAS Officers: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికార పోస్టింగ్స్ మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా టీటీడీ ఈవో జవహర్‌రెడ్డిని నియమించారు.
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికార పోస్టులు మారాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా టీటీడీ ఈవో జవహర్‌రెడ్డిని నియమించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా జవహర్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది. టీటీడీ ఏఈవో ధర్మారెడ్డికి ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ధర్మారెడ్డి ఈ బాధ్యతల్లో కొనసాగనున్నట్టుగా తెలిపింది. నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా సత్యనారాయణ, యువజన సర్వీసులశాఖ కమిషనర్‌గా శారదా దేవిని నియమించారు. ప్రస్తుత ఆ శాఖ కమిషనర్ నాగరాణిని ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది. మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా ఇంతియాజ్, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా సెర్ప్ సీఈవో ఇంతియాజ్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఏపీలో ఐఏఎస్ అధికారుల పోస్టుల్లో తాజా మార్పులివే..
ఏపీ సీఎం జగన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్‌రెడ్డి
టీటీడీ ఈవోగా జవహర్‌రెడ్డిని రిలీవ్ చేసిన ప్రభుత్వం
టీటీడీ ఏఈవో ధర్మారెడ్డికి ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు
నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా సత్యనారాయణ
యువజన సర్వీసులశాఖ కమిషనర్‌గా శారదా దేవి, ప్రస్తుత ఆ శాఖ కమిషనర్ నాగరాణిని రిలీవ్ చేసిన ఏపీ ప్రభుత్వం
మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా ఇంతియాజ్
మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా సెర్ప్ సీఈవో ఇంతియాజ్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికార పోస్టులు మారాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా టీటీడీ ఈవో జవహర్‌రెడ్డిని నియమించారు. టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డిని ప్రభుత్వం రిలీవ్ చేసింది. టీటీడీ ఏఈవో ధర్మారెడ్డికి ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. #YSJagan #APNews #IAS pic.twitter.com/9rNyCgOAUb
— ABP Desam (@ABPDesam) May 8, 2022
ఆంధ్రప్రదేశ్‌లో కొన్నిరోజుల కిందట బదిలీల వివరాలు..
ఏప్రిల్ నెలలో ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగింది. అనంతరం కొత్త మంత్రులు తమకు కేటాయించిన శాఖల బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఆయా శాఖలకు ఎవరు ఫిట్ అవుతారో అన్న విధానంలో రాష్ట్రంలో ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎంటీ కృష్ణబాబును నియమించింది. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్‌ను తీసుకొచ్చింది. తాజాగా మైనార్టీ సంక్షేమ శాఖ, యువజన సర్వీసుల శాఖ కమిషనర్, నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్‌కు కొత్త ఎండీని నియమించారు. ఏపీ సీఎం జగన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా టీటీడీ ఈవోగా ఉన్న జవహర్ రెడ్డిని నియమించారు.
Also Read: Sajjala On Elections : ఏడాదిలో అసెంబ్లీ, రెండేళ్లలో పార్లమెంట్ ఎన్నికలు - సజ్జల చెప్పింది ఇదేనా ?