By: ABP Desam | Updated at : 07 May 2022 01:42 PM (IST)
ఏడాదిలో అసెంబ్లీ, రెండేళ్లలో పార్లమెంట్ ఎన్నికలు - సజ్జల చెప్పింది ఇదేనా ?
" ఏడాది, రెండేళ్లలో ఎన్నికలకు వెళ్లబోతున్నాం" అని సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించిన అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పలు రకాలుగా చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలయినా పార్లమెంట్ ఎన్నికలయినా రెండేళ్ల తర్వాతే ఉన్నాయి. మరి ఏడాదిలో అని ఎందుకన్నారనేదే ఆ చర్చకు కారణం. ముందస్తు ఎన్నికలకు వెళ్తారని విస్తృతమైన చర్చ జరుగుతున్న సమయంలో వైఎస్ఆర్‌సీపీ రాజకీయ నిర్ణయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించే సజ్జల నోటి వెంట ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఆసక్తికరంగా మారింది
తెలంగాణకు అసెంబ్లీకి 2023 చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు రెండూ కలసి వస్తే జాతీయ అంశాలు హైలెట్ అవుతాయని దాని వల్ల ఓటింగ్ ప్రయారిటీ మారిపోతుందని .. అది ప్రాంతీయ పార్టీలకు నష్టం చేస్తుందన్న అంచనా ఉంది. కేసీఆర్ ఈ కారణంతోనే ముందస్తుకు వెళ్లి విజయం సాధించారు. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. అప్పట్లోనే ముందస్తుకు వెళ్లిన కేసీఆర్ విజయవంతం కాగా.. పార్లమెంట్‌తో పాటే ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు ఘోర పరాజయం పాలయ్యారు. ఈ అనుభవాలతో పార్లమెంట్ ఎన్నికలతో సంబంధం లేకుండా విడిగా ఎన్నికలకు వెళ్లడం బెటరన్న ఆలోచనలో వైఎస్ఆర్‌సీపీ వ్యూహకర్తలు ఉన్నట్లుగా భావిస్తున్నారు.
ముందస్తు ఎన్నికలు వస్తాయని విపక్షాలు కూడా గట్టిగా నమ్ముతున్నాయి. అందుకే అవి కూడా రాజకీయ కార్యకలాపాల్లో వేగం పెంచాయి. చంద్రబాబు జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. పవన్ కల్యాణ్ రైతు భరోసా యాత్ర చేస్తున్నారు. టీడీపీ నేతలు నియోజకవర్గాల్లో జోరుగా పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. చివరికి పొత్తుల చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. అంటే అటుఅధికార పార్టీతో పాటు ఇక విపక్షాలు కూడా ముందస్తుకు సిద్ధమయ్యాయని అంచనాకు వస్తున్నారు. ఈ ముందస్తు ఎప్పుడనేదే తేలాల్సి ఉందనేది ఎక్కువ మంది నమ్మకం.
Lokesh Mahanadu : వరుసగా మూడు సార్లు ఓడిన వారికి నో టిక్కెట్ - టీడీపీ నిర్ణయం !
NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !
Anna Hazare President Candidate KCR Plan: రాష్ట్రపతి అభ్యర్థిగా అన్నా హజారే ! కేసీఆర్ చెబుతున్న సంచలనం అదేనా ?
3 Years of YSR Congress Party Rule : మూడేళ్ల పాలన తర్వాత వైఎస్ఆర్‌సీపీ గ్రాఫ్ పెరిగిందా ? తగ్గిందా ?
3 Years of YSR Congress Party Rule : ఏపీలో విద్యుత్ సంక్షోభానికి కారణం ఏమిటి ? జగన్ విధానాలే నష్టం చేశాయా ?
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
RR Vs RCB: ఆఖర్లో తడబడ్డ బెంగళూరు - రాజస్తాన్ ముందు ఈజీ టార్గెట్!
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!
Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్